మనలో చాలామందికి తేనె ( Honey) అంటే కేవలం తియ్యదనాన్ని అందించే వస్తువుగానే తెలుసు. కొందరు మాత్రం దాన్ని అందాన్ని పెంపొందించేందుకు.. చర్మంపై అప్లై చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఇది చర్మాన్ని మెరిపిస్తుందని చాలామందికి తెలుసు. కానీ తేనె కేవలం చర్మాన్ని మాత్రమే కాదు.. మన జుట్టును కూడా అందంగా మారుస్తుందని మీకు తెలుసా? అవును.. దీన్ని హెయిర్ ప్యాక్స్‌లో (hair packs) భాగంగా ఉపయోగిస్తే చాలు.. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా మనకు అందుతాయి. మరి, తేనెను జుట్టుకు ఎలా ఉపయోగించాలి. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి.. వంటి వివరాలన్నీ తెలుసుకుందాం రండి.
Shutterstock
తేనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు
1. తేనె మంచి మాయిశ్చరైజర్. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. కేవలం చర్మంలోనే కాదు.. జుట్టులోనూ తేమను లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. జుట్టును కండిషన్ చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లే సమస్యను తగ్గిస్తుంది.
2.ఇందులోని అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కేవలం జుట్టును మాత్రమే కాదు.. కుదుళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఎన్నో ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంతో పాటు చుండ్రు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. తేనె కుదుళ్లను కూడా శుభ్రపర్చి అందులోని మలినాలను దూరం చేస్తుంది.
5. కేవలం పెరుగుతున్న వెంట్రుకల వేగాన్ని పెంచడం మాత్రమే కాదు.. వెంట్రుకలు పెరగకుండా ఆగిపోయిన కుదుళ్ల నుంచి కూడా వెంట్రుకలు పెరిగేందుకు తేనె తోడ్పడుతుంది.
6. తేనెను ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు.. ఎన్నో పోషకాలను తక్కువ ధరకే పొందినవాళ్లమవుతాం. సాధారణంగా తేనె కొనేటప్పుడు వీలైనంత మేరకు కాస్త ముదురు రంగులో ఉన్నదే తీసుకోవడం మంచిది. ముదురు రంగులో ఉండే తేనెలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి తక్కువ లేదా అసలే లేకుండా ఉంటాయి. అందుకే కొనేముందు తేనె అసలైందా? కాదా? అని ప్రశ్నించడంతో పాటు తేనె రంగును కూడా చూసుకొని కొనడం మంచిది.
ఈ చిట్కాలు వాడితే చాలు.. పొడుగైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..
తేనె హెయిర్ ప్యాక్స్
తేనె వల్ల చర్మం, జుట్టు రెండూ మెరుస్తూ ఉంటాయి. అయితే దాన్ని మెరిపించేందుకు హెయిర్ ప్యాక్‌లో కేవలం తేనెనే కాకుండా ఈ పదార్థాలను కూడా ఉపయోగించి చూడండి.
చుండ్రుకు చెక్ పెట్టాలా? అయితే ఈ చిట్కాలు ప్రయత్నించండి (How To Get Rid Of Dandruff At Home)shutterstock
1. ఆలివ్ ఆయిల్, తేనె హెయిర్ ప్యాక్
ఆలివ్ ఆయిల్ సహజ కండిషనర్. ఇది జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. తేనె జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. దీనికోసం కావాల్సినవి అర కప్పు తేనె, పావు కప్పు ఆలివ్ నూనె, పావు కప్పు మజ్జిగ. ముందుగా తేనె, ఆలివ్ నూనె కలిపి .. ఆ మిశ్రమాన్ని 30 సెకెన్ల పాటు ఒవెన్‌లో పెట్టి వేడి చేయాలి. తిరిగి అదే మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత.. అందులో మజ్జిగ కలిపి దానిని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. మిశ్రమం కారిపోకుండా అలాగే జుట్టుకు పట్టుకొని ఉండేందుకు.. కావాలంటే ప్లాస్టిక్ క్యాప్ కూడా ధరించవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది.
2. అరటిపండు, తేనెతో
అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడతాయి. దీనికోసం రెండు అరటి పండ్లు, అర కప్పు తేనె, పావు కప్పు ఆలివ్ నూనె తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత దీన్ని జుట్టుకు, మాడుకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. షవర్ క్యాప్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ అంత తొందరగా వదలదు. దీన్ని వదిలించుకోవడం కోసం కాస్త కష్టపడాల్సిందే. లేదంటే ఆలివ్ నూనె కాస్త ఎక్కువగా ఉపయోగించాలి. తలస్నానం చేసిన తర్వాత మిగిలిన ముక్కల్ని.. తలస్నానం తర్వాత దువ్వుకొని తీసేయొచ్చు.
shutterstock
3. గుడ్డు, తేనె కలిపి
గుడ్డులో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే గుడ్డు, తేనెతో చేసిన ఈ ఫేస్ ప్యాక్‌లో.. మీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడే గుణాలు ఉంటాయి. దీనికోసం రెండు గుడ్లు, కప్పు తేనె తీసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు.. ముఖ్యంగా కుదుళ్లకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
4. పెరుగు, తేనె కలిపితే..
పెరుగు మీ జుట్టుకు మెరుపును అందిస్తుంది. తేనె మీ కేశాలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. పెరుగులోని సిట్రిక్ యాసిడ్ చుండ్రును నివారిస్తుంది. దీనికోసం మనకు కావాల్సింది కప్పు పుల్లని పెరుగు, అర కప్పు తేనె.. ఈ రెండింటినీ మిక్సీ పట్టి స్మూతీలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.
shutterstock
5. అవకాడో, తేనె హెయిర్ మాస్క్
ఒక అవకాడో, అర కప్పు తేనె తీసుకోవాలి. ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అవకాడోలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తాయి. తద్వారా కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా మార్చే సహజమైన నూనెలు ఇందులో ఉండడం వల్ల జుట్టు మాయిశ్చరైజ్ అవుతుంది. అందుకే దీన్ని నెలకు మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేసుకోవచ్చు.
6. కొబ్బరి నూనెలో మిక్స్ చేయండి.
కొబ్బరి నూనె మన జుట్టుకు బలాన్ని అందిస్తుందన్న సంగతి తెలిసిందే. తేనెతో కలిస్తే దీని బలం మరింత పెరగడమే కాదు.. జుట్టు లోపలి దాకా వెళ్లి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతుంది. దీనికోసం అర కప్పు కొబ్బరి నూనెలో.. అర కప్పు తేనె కలుపుకోవాలి. ఒకవేళ మీ జుట్టు కాస్త పొడుగ్గా ఉంటే.. కొబ్బరి నూనె కాస్త ఎక్కువగా తీసుకోవాలి. మరీ పొట్టిగా ఉంటే ఇంకాస్త తగ్గించవచ్చు. ఈ మిశ్రమంతో మీ జుట్టు కుదుళ్లను బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చివర్ల వరకూ అప్లై చేసి.. షవర్ క్యాప్ పెట్టుకొని పావు గంట పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
shutterstock
7. ఆర్గానిక్ తేనెతో..
సహజంగా ఉత్పత్తి చేసిన తేనె ఆరోగ్యానికే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. మంచి క్లెన్సర్ మాదిరిగా పనిచేస్తుంది. జుట్టు పెరిగేందుకు మంచి ట్రీట్ మెంట్ ఇది. దీనికోసం ఆర్గానిక్ తేనెను టేబుల్ స్పూన్ తీసుకొని.. టేబుల్ స్పూన్ షాంపూలో కలపాలి. ఈ మిశ్రమంలో నీళ్లు పోసి దానితో తలస్నానం చేయాలి. మామూలు షాంపూకి బదులుగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. అంటే మీరు తలస్నానం చేసినప్పుడల్లా.. ఈ పద్దతిని ఉపయోగించవచ్చన్నమాట. దీనివల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగే వీలుంటుంది.
8. తేనె, నీళ్లు కలిపి..
తేనెను అలాగే జుట్టుకు పెట్టడం వల్ల.. అందులోని హైడ్రోజన్ పెరాక్సైడ్ జుట్టుకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందులో నీళ్లు కలిపి ఉపయోగించడం మంచిది. దీనికోసం టేబుల్ స్పూన్ తేనె, తొమ్మిది టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకొని రెండింటినీ బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ రుద్దాలి. ఆ తర్వాత.. షవర్ క్యాప్ పెట్టుకొని.. మూడు గంటల పాటు ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది.
shutterstock
9. కలబంద, తేనె మాస్క్
ఈ హెయిర్ మాస్క్ కోసం టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె తీసుకోవాలి. వీటన్నింటినీ ఓ బౌల్‌లో వేసి బాగా కలిపి మెత్తని మిశ్రమంగా మార్చాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టి ..అలాగే ఓ 20 నిమిషాల పాటు ఉంచాలి .ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారానికోసారి చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాదు.. తలలోని పీహెచ్ స్థాయులు బ్యాలన్స్ అయ్యి ఫంగస్ లాంటివి చేరకుండా ఉంటాయి.
10. ఆముదం, తేనె ప్యాక్
ఆముదం సహజంగానే జుట్టును నల్లగా మార్చేందుకు, కేశాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక తేనెతో ఆముదం కలిసి అప్లై చేసుకుంటే మరింత వేగంగా ఫలితం కనిపిస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలుపుకొని.. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత గంట పాటు ఉంచుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లు, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయవచ్చు.
shutterstock
11. కొబ్బరి పాలు, తేనె కలిపి
సాధారణంగా కొబ్బరి పాలు చర్మానికి, జుట్టుకి మంచి మెరుపుని తీసుకురావడంతో పాటు సున్నితంగా మారుస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. పైగా ఇందులోని ఫ్యాట్లు, ప్రొటీన్లు మన జుట్టును బలంగా మారుస్తాయి. దీనికోసం 200గ్రాముల కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఒక బౌల్‌లో కొబ్బరి పాలు పోసి.. అందులో తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అలా గంట పాటు ఉన్న తర్వాత.. గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.
జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!12. మయోనైజ్, తేనె హెయిర్ ప్యాక్
మయోనైజ్‌లో నూనెలు, ఫాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడతాయి. దీనికి అవకాడోను కలపడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన మాస్క్‌లా పనిచేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా కప్పు మయోనైజ్, ఒక అవకాడో, టేబుల్ స్పూన్ తేనె తీసుకొని.. అవకాడో గుజ్జు, మయోనైజ్ కలిపి అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మాస్క్‌ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట పాటు.. షవర్ క్యాప్ పెట్టి అలా ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా మీ జుట్టు జిడ్డుగా ఉంటే.. నెలకు మూడు నాలుగు సార్లు చేయాలి. మీది పొడి జుట్టు అయితే ఐదారు సార్లు చేసుకోవచ్చు.
shutterstock
13. ఓట్ మీల్, తేనె కలిపి
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కుదుళ్లు, తల ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కుదుళ్లు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం ఓట్ మీల్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం మంచిది. ఈ మాస్క్ తయారీకి రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, టేబుల్ స్పూన్ తేనె, అర టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇంకా మిశ్రమం మిగిలి ఉంటే అంచుల వరకూ పెట్టుకోవచ్చు. అయితే కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసేటప్పుడు చిక్కులు లేకుండా చేయడం వల్ల.. తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఆ తర్వాత అరగంట పాటు షవర్ క్యాప్ పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లని నీటితో తలస్నానం చేసి.. జుట్టు ఆరిన తర్వాత ఇంకా తలలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని దువ్వడం ద్వారా తొలగించుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయవచ్చు.
14. బంగాళాదుంప, తేనె హెయిర్ మాస్క్
బంగాళాదుంప రసం కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీన్ని గుడ్డుతో కలిపి తలకు పెట్టుకోవడం వల్ల జుట్టుకి మంచి కండిషనింగ్ అందుతుంది. అయితే ఇది అందరికీ కాకుండా.. కేవలం పొడిజుట్టు ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనికోసం కావాల్సినవి ఒక బంగాళాదుంప, ఒక గుడ్డు, టేబుల్ స్పూన్ తేనె. ఈ ప్రక్రియలో తొలుత బంగాళాదుంపను మిక్సీ పట్టుకొని రసం తీసుకోవాలి.
ఈ రసాన్ని తేనెలో వేసి అందులో గుడ్డు మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని పొడి జుట్టుకు అప్లై చేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని.. అరగంట పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల జుట్టులో తేమ పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
shutterstock
15. యాపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి..
యాపిల్ సైడర్ వెనిగర్‌లో జుట్టు ఎదుగుదలలో.. తోడ్పడేందుకు వీలుగా కొన్ని ఎంజైమ్స్, పోషకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును పట్టులా మెరిసేలా చేయడంతో పాటు మీ కుదుళ్లలోనూ బలాన్ని మారుస్తాయి. దీనికోసం చేయాల్సిందల్లా మూడు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు, టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కుదుళ్లకు, జుట్టుకు పట్టించి పావుగంట పాటు షవర్ క్యాప్ పెట్టుకొని జుట్టు ఆరనివ్వాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాలు
Shutterstock
1.జుట్టుకు తేనె అప్లై చేయడం వల్ల అది తెల్లగా మారుతుందా?
కేశాలకు తేనె అప్లై చేయడం వల్ల.. జుట్టు తెల్లబడుతుందనేది అపోహ మాత్రమే.. అయితే పాశ్చరైజ్ చేయని తేనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు తెల్లబడుతుందని కొందరు వైద్యులు చెబుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే తేనెలు అన్నీ పాశ్చరైజ్ చేసినవే.. కాబట్టి జుట్టు బ్లీచ్ కి గురవుతుందని.. తెల్లబడుతుందని భయపడాల్సిన అవసరం లేదు.
Shutterstock
2. తేనెను నేరుగా జుట్టుకు అప్లై చేయొచ్చా?
తేనెలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ గుణాలుంటాయి. అందుకే దీన్ని నేరుగా.. జుట్టుకు అప్లై చేయడం అంత మంచిది కాదు. కానీ తేనెను నేరుగా కాకుండా కాస్త నీళ్లు కలిపి ఉపయోగించడం వల్ల.. తేనె ప్రయోజనాలన్నింటినీ పొందే వీలుంటుంది. హెయిర్ ప్యాక్స్‌లో కలిపి లేదా నీళ్లు కలిపి ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తేనె ప్రయోజనాలు పొందే వీలుంటుంది.
Shutterstock
3. తేనె జుట్టుకు అప్లై చేయడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?
సాధారణంగా తేనె వల్ల జుట్టుకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. అయితే ఇందులో కొద్ది మొత్తంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండడం వల్ల.. అలాగే మూడు గంటల కంటే ఎక్కువగా ఉంచుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. దాంతో పాటు తేనె పడని వారికి కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. తేనె కొన్నిసార్లు బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కలిగించే అవకాశం కూడా ఉంది.
Shutterstock
4. తేనెను నెలలో ఎన్ని సార్లు ఉపయోగించవచ్చు?
తేనెలో చాలా తక్కువగా అయినా.. బ్లీచింగ్ గుణాలుంటాయి. అందుకే దానిని నెలకు కనీసం రెండు నుంచి నాలుగు సార్లు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సార్లు ఉపయోగించినా అవే ప్రయోజనాలు అందుతాయి. కాబట్టి కేవలం వారానికోసారి అప్లై చేస్తే సరిపోతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.