ADVERTISEMENT
home / సౌందర్యం
ఈ హెయిర్ ప్యాక్స్‌తో.. జుట్టు సమస్యలకు పరిష్కారం దక్కినట్లే..!

ఈ హెయిర్ ప్యాక్స్‌తో.. జుట్టు సమస్యలకు పరిష్కారం దక్కినట్లే..!

Homemade Hair Masks to solve our Problems

సీజన్ మారినప్పుడల్లా.. మన చర్మం, జుట్టు.. ఈ రెండింటి సంరక్షణలో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిందే. కాలాన్ని బట్టి మన జుట్టు సమస్యలు కూడా మారుతుంటాయి. చలికాలం ప్రారంభం కాగానే జుట్టు పెళుసుబారిపోవడం, డల్‌గా మారడం చూస్తుంటాం. అయితే కేవలం వాతావరణం వల్లే కాదు.. మనం ఉపయోగించే పదార్థాల వల్ల కూడా కేశాలు పాడయ్యే అవకాశాలున్నాయి

అలాగే డైట్‌లో మార్పులు, స్టైలింగ్ టూల్స్ వంటివన్నీ జుట్టు రాలడానికి కారణమవుతాయి. వీటన్నింటినీ తగ్గించేందుకు.. మీరు కూడా మార్కెట్లో దొరికే హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తున్నారా? అయితే వాటికి బదులు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొనే ఈ ప్యాక్స్ ఉపయోగించండి. అప్పుడు మీ జుట్టు కూడా ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.

పాలు, తేనెల సౌందర్యం..

ADVERTISEMENT

పాలు, తేనె.. ఈ రెండూ మన అందాన్ని కాపాడుకునేందుకు ఎంతో అవసరం. ఈ రెండూ కలిస్తే.. అందాన్ని రెట్టింపు చేయడం ఖాయం. ఈ రెండింటినీ మిక్స్ చేసి తయారుచేసిన హెయిర్ మాస్క్ జుట్టులో తేమను పెంచుతుంది. ఇది వేసుకోవడం కూడా చాలా సులభం. ఎలాగంటే..

1. ఒక బౌల్‌లో రెండు కప్పుల పాలు, మరో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి.
2. ఈ రెండింటినీ స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి.
3. ఆ తర్వాత మీ జుట్టును నీటితో తడిపేసి.. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ బాగా అప్లై చేసుకోవాలి.
4. మాస్క్ వేసుకున్న తర్వాత పావు గంట పాటు అలా ఉంచుకోవాలి.
5. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
6. ఇలా వారానికి ఒక సారి.. రెండు నెలల పాటు చేయడం వల్ల జుట్టులో తేమ పెరిగి పొడిబారకుండా, రాలిపోకుండా ఉంటుంది.

తేనెతో మీ కురులు మెరిపించాలా? ఈ 15 హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి..!

అవకాడోలతో అందంగా..

ADVERTISEMENT

అవకాడోల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయట. వీటిని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కేవలం అవకాడో తినడం, చర్మానికి రాసుకోవడం మాత్రమే కాదు.. ఒకవేళ మీకు డల్ హెయిర్ ఉన్నా.. మీ జుట్టు చిక్కులు పడుతూ ఉన్నా దీన్ని ప్రయత్నించడంలో ఏమాత్రం తప్పు లేదు.

1. ముందుగా అవకాడోను గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో దానిని రెండు స్కూప్స్ తీసుకోవాలి.
2. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండును గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
3. ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి.
4. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి.
5. మిశ్రమం పొడిబారిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
6. ఇలా వారానికోసారి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

జుట్టు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి పాటించాల్సిన చిట్కాలు

స్ట్రాబెర్రీలతో చూడచక్కగా..

ADVERTISEMENT

జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మాయిశ్చరైజ్డ్‌గా ఉండి.. పట్టులా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ ఉపయోగిస్తే చాలు.. జుట్టు మెరుస్తూ ఉండడంతో పాటు పండ్ల వాసనతో అద్భుతంగా కూడా మారుతుంది. ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలంటే..

1. కొన్ని స్ట్రాబెర్రీలు తీసుకొని.. అందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ పోసుకోవాలి.
2. ఆ తర్వాత.. ఈ మిశ్రమంలో గుడ్డులోని పచ్చ సొన వేసి బాగా కలుపుకోవాలి.
3. మెత్తని బ్రష్ ఉపయోగించి ఈ మాస్క్‌ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కుదుళ్లకు పట్టించాక మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి.
4. మాస్క్ వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి.
5.తర్వాత జుట్టును చల్లని నీటితో కడిగేయాలి.
6.ఇలా నెలకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

03 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT