ADVERTISEMENT
home / Fitness
జిమ్‌కి వెళ్తున్నారా? వ్యాయామమే కాదు.. ఈ మర్యాదలూ ముఖ్యమే..

జిమ్‌కి వెళ్తున్నారా? వ్యాయామమే కాదు.. ఈ మర్యాదలూ ముఖ్యమే..

కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే కొందరు ‘జిమ్‌కి (gym) వెళ్లాలి… బరువు తగ్గాలి’ అని రిజల్యూషన్ పెట్టుకుంటారు . అయితే కొత్తగా జిమ్‌కి వెళ్లే వాళ్లు మాత్రం అక్కడ వ్యాయామం చేయడం ఎలా..? అన్న విషయం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు.. అసలు జిమ్‌లో ఎలా వ్యవహరించాలో కూడా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే నేను రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తాను. అప్పుడు జిమ్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఆకట్టుకునే రూమ్ ఫ్రెషనర్ వాసనతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఉదయం లేవడం లేట్ అయ్యో.. లేదా ఉదయం కుదరక సాయంత్రం వర్కవుట్‌కి వెళ్తే మాత్రం.. అదే ఆ జిమ్ చాలా చెత్తగా కనిపిస్తుంది. ట్రెడ్ మిల్ మీద చెమటతో నిండిన టవల్, బురదలోని షూ అడుగులు వంటివి చిరాకు తెప్పిస్తాయి.

కొన్నిసార్లు డంబెల్ జతను వెతుక్కోవడానికి కూడా చాలా సమయం పట్టేస్తుంది. ఇది నా అనుభవం మాత్రమే కాదు.. చాలామందికి ఇలాంటి ఘటనలు సుపరిచితమే. అందుకే జిమ్‌కి వెళ్లేటప్పుడు.. అక్కడ వ్యాయామం చేయడంతో పాటు కొన్ని మర్యాదలు (etiquettes) కూడా పాటించాల్సి ఉంటుంది. దీనివల్ల మీతో పాటు జిమ్‌లో వ్యాయామం చేసేవారి పట్ల కూడా.. మీరు అక్కరగా ఉంటున్నారన్న ఫీలింగ్ వారికి కలుగుతుంది. అంతేకాదు.. ఇది  ఆరోగ్యకరమైన అలవాటు కూడా. మరి, మీరు పాటించాల్సిన జిమ్ మర్యాదలు ఏంటో తెలుసుకోండి

1. మీకు జిమ్‌లో వచ్చే సంగీతం కాకుండా..  ప్రత్యేకంగా వేరే ట్యూన్ లేదా మ్యూజిక్ కావాలనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం మంచిది. ఎయిర్ పాడ్స్ అయితే ఇంకా మంచిది. దీనివల్ల జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు వైర్ అడ్డు పడకుండా ఉంటుంది.

ADVERTISEMENT

2. మీరు జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఉపయోగించే దుస్తులు, చెమట తుడుచుకోవడానికి ఉపయోగించే టవల్స్ తరచూ ఉతుకుతూ ఉండాలి. కనీసం వారానికి రెండు సార్లయినా వీటిని ఉతకడం వల్ల.. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

3. ఒకసారి మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయడం పూర్తయిన తర్వాత.. ఆ డంబెల్స్, రాడ్స్ వంటి వస్తువులన్నింటినీ అవి ఎక్కడున్నాయో తిరిగి మళ్లీ ఓసారి అక్కడే పెట్టడం వల్ల ఇతరులకు వాటిని వెతుక్కునే ఇబ్బంది ఉండదు.

4. ఇతరులు ఏదైనా మీకు తెలియని వ్యాయామం చేస్తున్నారే అనుకోండి… అయినా వారిని అలా చూస్తూ ఉండిపోవడం సరికాదు. ఇలా చేయడం వల్ల వారు ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

5. ప్రతి ఒక్కరికీ వార్మప్ చేయడానికి.. వ్యాయామం చేయడానికి తగిన స్థలం ఇవ్వండి. వారి పక్కనే వెళ్లి వ్యాయామం చేయడం వల్ల వారికి ఇబ్బంది ఎదురవుతుంది.

6. జిమ్‌లో చాలామంది వ్యక్తులు ఉంటారు. వారిలో కొత్తగా కూడా జిమ్‌కి వచ్చేవాళ్లుంటారు. అదేవిధంగా చాలా రోజుల నుంచి వ్యాయామం చేస్తూ అనుభవం ఉన్నవారు కూడా ఉంటారు. మీరు ఇందులో ఏ స్థాయిలో ఉన్నా సరే.. ఇతరులకు సలహాలు ఇస్తూ లేదా వారి సలహాలు అడుగుతూ వారిని ఇబ్బందికి గురి చేయడం సరికాదు. వీటన్నింటి కోసం జిమ్‌లో ట్రైనర్లు ఉంటారని గుర్తుంచుకోండి.

7. మీకు మరీ ఎక్కువగా చెమట రాదు అని మీరు అనుకున్నా సరే.. మీరు ఉపయోగించడానికి ముందు, తర్వాత ఒకసారి ఓ శుభ్రమైన వస్త్రంతో.. మీరు ఉపయోగించే వస్తువులను తుడవడం వల్ల చెమట ద్వారా ఇతరుల శరీరం నుంచి మీకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పైగా ఇతరులకు కూడా మీరు శుభ్రంగా మెషీన్లను అందించే వీలుంటుంది.

8. మీ జిమ్‌లో జనాలు ఎక్కువగా ఉన్న సమయంలో అద్దాల ముందు సెల్ఫీలు దిగడం మానేయండి. మీ సెల్ఫీలో ఇతరులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంత మర్యాదగా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఇది నచ్చదు కూడా.

ADVERTISEMENT

9. జిమ్‌లో వ్యాయామం చేసే ఇతర వ్యక్తులతో పాటు స్టాఫ్ పట్ల కూడా గౌరవం చూపించండి. అక్కడి నియమాలను పాటించండి.

10. మీరు వ్యాయామం చేయడం అయిపోయిన తర్వాత.. ఏదైనా బెంచ్ పై పెట్టడం కాకుండా డంబెల్స్‌ని కింద పెట్టడం మంచిది. అవి ఎవరి కాలు మీదైనా పడే ప్రమాదం ఉంటుంది.

11. ఒక మెషీన్‌ని మీరే ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం కూడా సరికాదు. సెట్‌కి సెట్‌కి మధ్య గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్‌లో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి.

ADVERTISEMENT

12. మీ ట్రైనర్లను గౌరవించండి. గ్రూప్ క్లాసెస్ ఏవైనా ఉంటే వారిని, మీ తోటి వారిని ఎదురు చూసేలా చేయకండి. సమయానికి అక్కడికి చేరుకోండి.

13. జిమ్‌లో స్నానం చేసిన తర్వాత మీ టవల్‌ని మీరే ఆరేసుకోవడం మంచిది.

హైదరాబాద్ ట్రెండ్స్ : బెస్ట్ జిమ్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..!

14. మీరు వ్యాయామం చేసేందుకు తగిన జోన్‌ని చూసుకోవడం మంచిది. మెషీన్లు ఉన్న చోట ఆ రకమైన వ్యాయామాలు.. మెషీన్లు లేని చోట బాడీ వెయిట్, కోర్ వ్యాయామాలు చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ట్రెడ్ మిల్ దగ్గరికి వెళ్లడం వల్ల మీకు మాత్రమే కాదు.. వారికి కూడా ప్రమాదం జరిగే వీలుంటుంది.

ADVERTISEMENT

15. వ్యాయామం చేస్తున్నప్పుడు వీలైనంత తక్కువగా ఫోన్ ఉపయోగించాలి. ఒకవేళ అత్యవసరమై ఫోన్ కాల్ మాట్లాడాల్సి వస్తే జిమ్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. చాటింగ్ విషయంలోనూ అంతే. ట్రెడ్ మిల్ పై నడుస్తూ చాటింగ్ చేయడం వల్ల మీరే తక్కువ క్యాలరీలు కరిగిస్తారని గుర్తుంచుకోండి.

16. మీ లాకర్‌ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఈ చిట్కాలన్నీ పాటిస్తే మీరు మీ జిమ్‌లో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యక్తులుగా మారిపోతారు అనడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

జిమ్‌కి వెళ్లడం కుదరడం లేదా? అయితే ఈ వ్యాయామాలను ప్రయత్నించండి ..!

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

04 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT