ADVERTISEMENT
home / Fitness
స్తనాల సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేసి చూడండి..

స్తనాల సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేసి చూడండి..

పర్ఫెక్ట్ ఫిగర్ కావాలని కోరుకోని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి? కొందరు తమ స్తనాల సైజ్ (breast size) పెంచుకోవాలని భావిస్తే.. మరికొందరు తమ స్తనాల సైజ్ పెద్దగా ఉండడం వల్ల దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే స్తనాల సైజ్ ముఖ్యంగా జన్యు పరమైన అంశాలు, హార్మోన్ల స్థాయులు, ఇతరత్రా విషయాల పైన ఆధారపడి ఉంటుంది. కానీ కాస్త ప్రయత్నిస్తే చాలు.. స్తనాల సైజు తగ్గించుకోవచ్చు. మరి, దాని కోసం చేయాల్సిందేంటో మీకు తెలుసా? 

చాలా సార్లు స్తనాల సైజ్ తగ్గించుకోవడానికి కేవలం సర్జరీ మాత్రమే ఆప్షన్ అని చాలామంది భావిస్తారు. కానీ అలా సర్జరీ చేయిచుకోవడం వల్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వాటికి బదులుగా ఇంట్లోనే పాటించగలిగే టిప్స్ చాలా ఉన్నాయి. వాటిని పాటిస్తూ సులువుగా స్తనాల సైజ్ తగ్గించుకునే వీలుంటుంది. దీనికోసం మొదట మీ స్తనాల సైజ్‌కి తగినట్లుగా ఉండే బ్రాని ధరించాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు.. తప్పుడు సైజ్ బ్రా వేసుకోవడం వల్లే స్తనాలు పెద్దగా కనిపించడంతో పాటు భుజాలు, వీపు భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆహారం, వ్యాయామం వంటి వాటిలో మార్పులను పాటిస్తూ స్తనాల సైజ్ తగ్గించుకోవచ్చు.

వ్యాయామం ఇలా చేయండి.

మీ శరీరం టోన్ కావాలన్నా.. స్తనాల సైజ్ తగ్గాలన్నా.. స్తనాలు మీ శరీరం కంటే పెద్దగా కనిపించకూడదన్నా.. రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. దీనివల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. తద్వారా మీ స్తనాల సైజ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మన స్తనాల్లో చాలా ఎక్కువ భాగం కొవ్వుతోనే తయారై ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి హై ఇంటెన్సిటీ ఎక్సర్ సైజులు చేయాల్సి ఉంటుంది. కార్డియో చేయడం వల్ల మీ స్తనాల సైజ్ వేగంగా తగ్గించుకునే వీలుంటుంది. అయితే వ్యాయామం గురించి పూర్తిగా తెలియకుండా దాన్ని చేయడం సరికాదు. ఎందుకంటే కొన్ని వ్యాయామాలు స్తనాల సైజ్ పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే వ్యాయామం గురించి తెలుసుకొని చేయడం మంచిది. ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేయడం మంచిది.

ADVERTISEMENT

1. స్తనాల సైజ్ తగ్గించుకోవడానికి కార్డియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజూ కార్డియో చేయడం వల్ల స్తనాల సైజ్ వేగంగా తగ్గుతుంది.

2. పుషప్స్ చేయడం వల్ల ఛాతి భాగం సరైన షేప్‌లో ఉండే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల స్తనాల సైజ్ మరీ పెద్దగా కనిపించకుండా చూసుకోవచ్చు.

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

3. ఏరోబిక్స్ కూడా స్తనాల సైజ్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనికోసం సైక్లింగ్, మెట్లెక్కడం, బ్రిస్క్ వాకింగ్ వంటివి చేయవచ్చు.

ADVERTISEMENT

4. రోజూ వేగంగా డ్యాన్స్ చేయడం వల్ల మీ స్తనాల సైజ్ కూడా తగ్గుతుంది. మీ ఛాతి భాగాన్ని కదిలించే డ్యాన్స్ స్టెప్స్ వేయడం మంచిది.

5. మీ ఛాతి భాగాన్ని రోజూ మసాజ్ చేయడం వల్ల స్తనాల సైజు కొద్దికొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం సహజసిద్ధమైన మసాజ్ ఆయిల్స్ ఉపయోగించడం మంచిది.

ఇలాంటి ఆహారంతో..

మనం తిన్న ఆహారంలోని క్యాలరీలు కొవ్వుగా మారి మన శరీరంలో పేరుకుపోతాయి. అందుకే మనం తినే ఆహారాన్ని కంట్రోల్ చేసుకుంటే కానీ.. స్తనాల సైజ్ తగ్గించుకునే వీలుండదు. మీరు తినే ఆహారం కంటే మీరు కరిగించే క్యాలరీలు తక్కువగా ఉండడం వల్లే స్తనాల సైజ్ తగ్గుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు దీని గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఛాతి భాగంలో కొవ్వు తగ్గించేందుకు ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

ADVERTISEMENT

1. అల్లం కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా కప్పు వేడి నీళ్లు, అల్లం పేస్ట్, టీస్పూన్ తేనె కలిపి తాగాల్సి ఉంటుంది. ఇది ఛాతి భాగంలోని కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది.

2. గ్రీన్ టీ కూడా కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మీ స్తనాల సైజ్ కూడా తగ్గుతుంది..

ఈ ఆహార పదార్థాలు.. మీ బరువును సులువుగా తగ్గించేస్తాయి..!

3. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులను తగ్గిస్తాయి. అందుకే రోజూ నానబెట్టిన అవిసె గింజలు తినడం వల్ల స్తనాల సైజ్ తగ్గుతుంది. దీనితో పాటు తగినంత మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

4. గుడ్డులోని తెల్లటి సొనని రెగ్యులర్‌గా తినడం వల్ల కూడా స్తనాలు మంచి షేప్‌లో ఉండేలా చేయవచ్చు. రోజూ టీస్పూన్ ఉల్లిపాయ రసం, గుడ్డులోని తెల్ల సొనలో వేసి తీసుకోవడం వల్ల స్తనాల సైజ్ కూడా తగ్గుతుంది.

5. స్తనాల సైజ్‌ని సహజసిద్ధంగా తగ్గించుకోవాలంటే గుప్పెడు వేపాకులను ఒక బౌల్‌లో వేసి మరిగించి.. అందులో పసుపు, తేనె కూడా కలుపుకోవాలి. దాన్ని వడకట్టుకొని రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇవన్నీ స్తనాల సైజ్ తగ్గించడంలో తోడ్పడతాయి. అయితే ఈ పద్ధతులను పాటించే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

ADVERTISEMENT
22 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT