ADVERTISEMENT
home / Diet
ఈ ఆహార పదార్థాలు.. మీ బరువును సులువుగా తగ్గించేస్తాయి..!

ఈ ఆహార పదార్థాలు.. మీ బరువును సులువుగా తగ్గించేస్తాయి..!

7 best foods for weight loss and why

కొత్త సంవత్సరం వేళ.. ఎక్కువ మంది తీసుకునే ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’లో బరువు తగ్గడం (Weight Loss) కూడా ఒకటి. అయితే రిజల్యూషన్ అయితే తీసుకుంటారు కానీ.. దాన్ని ఎలా పాటించాలో చాలామందికి తెలీదు.  మీకో విషయం తెలుసా..? మీ బరువు సమస్యకు పరిష్కారం ఒక్కటే. మీ డైట్‌లో మార్పులు చేసుకుంటే.. అన్నీ అవే సర్దుకుంటాయి.

మన బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ముఖ్యమైన కారణం మన డైట్. మనం వ్యాయామం చేసినా.. దాని పాత్ర బరువును తగ్గించడంలో కేవలం 20 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 80 శాతం మన డైట్ మీదే ఆధారపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి స్వస్తి చెప్పి.. వేరే ఆహార పదార్థాలను మన డైట్‌లో భాగం చేసుకోవాలి. అవేంటంటే..

1. ఇడ్లీ సాంబార్

ADVERTISEMENT

ఒక వారం పాటు రోజూ ఉదయం కేవలం ఇడ్లీ, సాంబార్‌ని మాత్రమే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటే.. మీ జీర్ణ శక్తి చాలా బాగా పెరుగుతుంది. సాంబార్‌లో పప్పు ప్రొటీన్‌ని, పీచు పదార్థాన్ని అందిస్తుంది. కాబట్టి ఇది చాలా సేపటి వరకూ ఆకలి లేకుండా చేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్‌ను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ పద్దతిని కొద్ది రోజులు అనుసరించండి. తద్వారా సులువుగా బరువు తగ్గే వీలుంటుంది.

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

2. దాల్చిన చెక్క

రోజూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని.. నీటిలో కలుపుకొని తాగడం వల్ల కొవ్వు శాతం తగ్గుతుంది. అలాగే మీ జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మీ బాడీ మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి.. బరువు కూడా తగ్గుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల.. కడుపుబ్బరం, ఎసిడిటీ వంటివి ఎదురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

3.యాపిల్

ADVERTISEMENT

రోజుకో యాపిల్ తింటే రోగాలన్నీ దూరమైపోతాయని.. మన పెద్దలు చెప్పడం తెలిసిందే. ఆపిల్ కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం మాత్రమే కాదు.. బరువు తగ్గేందుకు కూడా  తోడ్పడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల.. కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఆహారం తక్కువగా తీసుకుంటాం. అంతేకాదు.. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది.

4. దలియా

దలియా అంటే గోధుమలు లేదా ఇతర ధాన్యాలను బరకగా పట్టించిన మిశ్రమం. దీన్ని రోజులో ఒక్కసారైనా తీసుకోవడం మంచిది. రోజుకు రెండు సార్లు అన్నం బదులుగా దీనిని తీసుకుంటే ఇంకా మంచిది.

అందంగా, ఆరోగ్యంగా మారిపోవాలా? అయితే డీటాక్స్ వాటర్ ప్రయత్నించి చూడండి..

5. బ్రౌన్ రైస్

ADVERTISEMENT

ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలామంది వైట్ రైస్‌కి బదులుగా.. బ్రౌన్ రైస్‌ని తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కానీ ఇది ఎలా బరువు తగ్గిస్తుందో మీకు తెలుసా? వైట్ రైస్‌తో పోల్చితే బ్రౌన్ రైస్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా అరగడం వల్ల ఆకలి వేయదు. బరువు తగ్గడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపర్చడంతో పాటు .. మన శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పోయేలా చేస్తుంది.

6.రాగులు

రాగుల్లో పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఇది చాలా సమయం వరకూ.. మన పొట్టను నిండుగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు కూడా రావు. అధిక బరువు, డయాబెటిస్ వంటివి కూడా తగ్గుతాయి.

7. గుడ్లు

మనలో చాలామందికి తెలియని అంశం ఏంటంటే.. బరువు తగ్గడానికి ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రొటీన్లకు అన్నింటికంటే ఉత్తమమైన నెలవైన ఆహారం గుడ్లు. అందుకే గుడ్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. మన శరీరానికి ప్రొటీన్లను అరిగించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే చాలా సమయం పాటు ఆకలి కలగకుండా ఉంటుంది.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

02 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT