ADVERTISEMENT
home / Budget Trips
హైదరాబాద్ గోల్కొండ కోట గురించి మీకు ఈ విశేషాలు తెలుసా?

హైదరాబాద్ గోల్కొండ కోట గురించి మీకు ఈ విశేషాలు తెలుసా?

హైదరాబాద్ (hyderabad) నగరంలో పర్యాటకంగా ఎక్కువమందిని ఆకర్షించే వాటిల్లో గోల్కొండ కోట ఒకటి. అయితే మనం తరచుగా వినే ఈ గోల్కొండ కోట (golconda fort) కి ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? ఇదొక్కటే కాదు.. గోల్కొండ ఎన్నో అద్భుతాల సమాహారం.. అందుకే దానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు (interesting facts) ఇక్కడ తెలుసుకుందాం. 

హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు…

* గొల్ల కొండ (or) గోల్ కొండ..

గోల్కొండ కోట కి ఈ పేరు రావడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఒకటి గోల్ కొండ అనే పేరు నుంచి గోల్కొండ (golconda) వచ్చిందని, ఎందుకంటే ఈ కోట గుండ్రంగా ఉండటంతో… ‘గోల్’ అని హిందీ లో గుండ్రంగా అని అర్ధం వచ్చేలా ఈ పేరు వచ్చిందని వారు చెబుతారు. అలాగే ఈ కోట కట్టకముందు ఆ కొండ పైన ఎక్కువగా గొర్రెలని కాసేవారు అని అందుకే ఆ సామాజిక వర్గం పేరు వచ్చేలా గొల్ల కొండ అని పిలువగా.. అది కాలక్రమంలో గోల్కొండ గా మారిందట.

ADVERTISEMENT

* రహస్య సొరంగాలు & మార్గాలు

ఈ గోల్కొండ కోట నుండి అనేక రహస్య సొరంగాలు & శత్రువులు దాడి చేసినప్పుడు తప్పించుకునేందుకు బాహ్య ప్రపంచానికి తెలియని మార్గాల ఉన్నాయి అని సమాచారం. గోల్కొండ కోట నుండి నేరుగా భూగర్భ సొరంగం ద్వారా చార్మినార్ కి చేరుకోవచ్చు అని అంటుంటారు. కుతుబ్ షాహీలు గోల్కొండ కోటని తమ రాజధానిగా చేసుకుని పరిపాలించిన రోజుల్లో ఇటువంటి సదుపాయాలు సమకూర్చుకున్నట్టుగా చెబుతుంటారు.

* ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలు

గోల్కొండ కోటకి అనుబంధంగా ఉన్న కొల్లూర్ గని నుండి అనేక వజ్రాలు వెలికితీయడం జరిగింది. అలా ఈ గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి కేంద్ర బిందువుగా కూడా ఉండేది. అలా ఈ గోల్కొండ కోట నుండే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని కూడా వెలికితీసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ లో ఉంది. అలాగే మరికొన్ని అపురూప వజ్రాలు – హోప్ వజ్రం, ప్రిన్సీ వజ్రం, రిజెంట్ వజ్రం, నూర్ – ఉల్ – ఐన్ వజ్రం, దారియా – ఐ – నూర్ వజ్రం వంటివి ఇక్కడ లభించాయి.

ADVERTISEMENT

* చప్పట్లు

మనం గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే ఇక్కడ చప్పట్లు కొట్టండి అని రాసి ఉంటుంది. ఇక్కడ చప్పట్లు కొడితే , కిలోమీటర్ అవతల ఉన్న కోట పై భాగంలో ఉన్నవారికి స్పష్టంగా వినపడుతుంది. అంటే కోట ప్రవేశ భాగంలో చప్పుడు చేస్తే అది కోట పైన ఉన్న వారికి స్పష్టంగా తెలిసిపోతుంది. దీనివల్ల శత్రువులు ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు తెలుసుకునే విధంగా ఈ ఏర్పాటుని కోటని నిర్మించే సమయంలో చేయడం జరిగింది. ఇది ఈ కోట మొత్తంలో ఒక ప్రత్యేకతగా చెబుతారు.

* మహంకాళి గుడి

అలాగే ఈ కోట పైన శ్రీ జగదాంబ మహంకాళి గుడి ఒకటి ఉంది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు ఇక్కడ నుండే ప్రారంభమవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక ఈ గుడిని అప్పటి పాలకులే కట్టించారని, ఈ గోల్కొండ కోట ద్వారా పరిపాలించిన వారందరూ కూడా ఇక్కడి సంస్కృతిని పెంపొందించారు అనడానికి ఉదాహరణే ఈ గుడి అని చెబుతుంటారు.

ADVERTISEMENT

* సౌండ్ & లైట్ షో

ఇక ఇక్కడ ప్రతి రోజు సాయంత్రం ఈ కోటని సందర్శించే పర్యాటకుల కోసం సౌండ్ & లైట్ షో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ షో ద్వారా గోల్కొండ కోట చరిత్ర, ఏయే రాజులు ఇక్కడ పాలించింది & వారి సామ్రాజ్యాలు ఎలా అంతమైంది వంటి అనేక చరిత్ర విషయాలు ఇక్కడ సౌండ్ & లైట్ షో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారు.

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

* బ్రహ్మ మల్లిక చెట్టు

ADVERTISEMENT

ఈ గోల్కొండ కోటలో పర్యాటకులని అమితంగా ఆకర్షించే అంశం – బ్రహ్మ మల్లిక చెట్టు. దాదాపు 400 ఏళ్ళ క్రితం నాటిన ఈ మొక్క నేటికీ ఒక మహా వృక్షమై అలాగే నిలిచి ఉంది. దాదాపు 90 ఫీట్ల వెడలుపుతో ఉన్న ఈ వృక్షాన్ని మొక్కగా ఉన్నప్పుడు అరేబియా కి చెందిన కొందరు వ్యాపారస్తులు కుతుబ్ షాహి రాజులకు బహుమతిగా ఇచ్చారని చరిత్రకారులు చెబుతారు. గోల్కొండ కోట నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ చెట్టు ఉంటుంది. దీనిలోపల ఉన్న ఖాళీ ప్రదేశంతో రెండు గదుల్లా కూడా  ఏర్పడ్డాయి. 

* మట్టితో చేసిన ఖిల్లా (fort)

అసలు ఈ గోల్కొండ కోట కట్టక ముందు ఇక్కడ మట్టితో కట్టిన కోట ఒకటి ఉండేదట. అది అప్పటి కాకతీయ రాజులు కట్టించడం జరిగిందట. ఆ తరువాత కాలంలో ఖుతుబ్ షాహీలు ఆ మట్టి కోట చుట్టూ ఈ గోల్కొండ కోటని నిర్మించారు.

గోల్కొండ కోట గురించి ఎక్కువమందికి ఈ వివరాలు (facts) తెలియవు. ఇంతటి ఆసక్తికరమైన అంశాలకి నెలవైన ఈ కోటని ఇంకా సందర్శించకపోతే వెంటనే వెళ్లి సందర్శించండి.

ADVERTISEMENT

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

29 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT