ADVERTISEMENT
home / Celebrity Life
దేశంలో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. అమ్మాయిలకు న్యాయం జరిగేదెప్పుడు : సమంత

దేశంలో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. అమ్మాయిలకు న్యాయం జరిగేదెప్పుడు : సమంత

ఈ మధ్యకాలంలో సినిమా కథానాయికలు కూడా సామాజిక సమస్యలపై బాగానే స్పందిస్తున్నారు. తమదైన శైలిలో గళం విప్పుతున్నారు. కొన్ని విషయాలలో ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. పీడితుల పక్షాన నిలిచి.. వారి తరఫున మాట్లాడుతున్నారు కూడా. బాలీవుడ్‌లో దీపికా పదుకొణే లాంటి హీరోయిన్లు ఇప్పటికే పలు సామాజిక రుగ్మతలపై స్పందించారు. ఇక ఆ జాబితాలో తాజాగా మన టాలీవుడ్ కథానాయిక సమంత (Samantha) కూడా చేరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పై ఆమె ఇటీవలే మాట్లాడారు. 

“అమ్మాయిలపై రోజు రోజుకీ లైంగిక దాడులు పెచ్చుమీరిపోతున్నాయి. ఇది చాలా బాధను కలిగించే విషయం. అమ్మాయిలను చెడుభావంతో చూసే వ్యక్తులు ఈ సమాజంలో పెరిగిపోతున్నారు. కఠినమైన శిక్షలు పడతాయనే భయం వారికి ఉండాలి. అలాంటి భయాన్ని ప్రభుత్వం వారికి కలిగించాలి. ఇలాంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి భయమే మందు. అలాగే ఓ మహిళ పై అత్యాచారం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. న్యాయస్థానం కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి” అని అభిప్రాయపడ్డారు సమంత.

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

అలాగే “ఈ రోజు బాధితులు న్యాయం జరిగే వరకూ వేచి చూసి అలిసిపోతున్నారు. మన దేశంలో 3 కోట్లకు పైగానే కేసులు పెండింగ్‌లో ఉన్నాయట. అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయో  తెలియదు. ఈ సమయంలో బాధితులకు తీవ్రమైన నష్టం చేకూరుతుంది. ఈ పరిస్థితి మారాలి.  నిజానికి.. ఈరోజు చాలా చోట్ల బాధితులకు సరైన న్యాయం జరగడమే లేదు. దీనికి కారణం ఇలాంటి లోపాలే” అని తన మదిలోని భావాలను పంచుకున్నారు సమంత. సమంత కూడా ‘ప్రత్యూష సపోర్ట్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

‘ప్రత్యూష సపోర్ట్’ అనే సంస్థ ద్వారా సమంత టీమ్ బడుగు, బలహీన వర్గాల మహిళలు, పిల్లలకు మంచి ఆరోగ్యం కోసం వైద్య సేవలను అందించడంతో పాటు పోషకారాహాన్ని కూడా సప్లై చేస్తోంది. అలాగే కొన్ని కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకుంటోంది. ప్రముఖ వైద్యురాలు మంజుల అనగాని.. ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నారు. సమంత షూటింగ్ లేని రోజులలో, అలాగే తన ఖాళీ సమయాలలో ఎక్కువగా తన సంస్థ కార్యాలయంలోనే గడుపుతుంటారు. అక్కడి పిల్లలతో కలిసి సరదాగా ముచ్చటిస్తుంటారు. ఆ విధంగా తన వంతు సామాజిక సేవ చేస్తున్నారు సమంత. 

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

సమంత ఈ సంవత్సరం ‘జాను’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ చిత్రం ’96’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తుండగా.. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. 7 ఫిబ్రవరి 2020 తేదిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 2019లో సమంత మజిలీ, ఓ బేబీ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలూ ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. భవిష్యత్తులో ఆమె దర్శకత్వం వైపు అడుగులు వేసే అవకాశముందని ఆమె ఓ సందర్భంలో పేర్కొన్నారు. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                                                                                                                                                                                                                               

08 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT