రాంగోపాల్ వర్మ (RGV) తెరకెక్కించే ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం అని చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా తన ఆలోచనలను కథగా మలిచి, ఆయా పాత్రలకు బలం చేకూర్చేలా సమర్థులైన నటీనటులను ఎంపిక చేసుకొని ముందడుగు వేస్తారు ఆర్జీవీ (RGV). ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ చిత్రంలో కథ కంటే పాత్రల బలానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వర్మ రూపొందించే చిత్రాలు కూడా ఆయనలానే చాలా వైవిధ్యంగా ఉంటాయి. బలమైన పాత్రల ద్వారా కథకు బలాన్నిచ్చే ప్రయత్నం చేయడం వర్మకే చెల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
View this post on Instagram
ఆర్జీవీ స్టైల్‌గా చెప్పుకునే ఈ ధోరణిలోనే త్వరలో ఓ సినిమా మన ముందుకు రానుంది. అదే- లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmis NTR). ప్రస్తుతం దీని గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కథ ఆధారంగా తెరకక్కుతోన్న చిత్రం ఇది. ముఖ్యంగా ఆయనను పదవీచ్యుతుడిని చేసిన విధానం, అందుకు దారి తీసిన పరిణామాలు.. వంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి?? అనే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. మరోవైపు స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) చిత్రం ఇటీవలే విడుదలకాగా; ఎన్టీఆర్ మహానాయకుడు (NTR Mahanayakudu) చిత్రం వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
'నూతన సంవత్సర' శుభాకాంక్షలు.. ఈ 2019 మనది మనందరిది... #NTRBiopic pic.twitter.com/iL39cUL246
— Krish Jagarlamudi (@DirKrish) January 1, 2019
ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో సఫలం కావడం మాత్రమే కాదు.. అందులో నటించిన నటీనటులు కూడా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నటించే నటీనటులు ఎవరై ఉంటారన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ఫొటోను విడుదల చేశారు.
బ్లాక్ & వైట్ (Black & White)లో ఉన్న ఆ ఫొటోలో ఓ అమ్మాయి చీరకట్టులో అందంగా కనిపిస్తోంది. దీనిని పంచుకుంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మీపార్వతి అంటూ అందరికీ పరిచయం చేశారు ఆర్జీవీ. అయితే ఈ ఫొటోలో కనిపించిన నటి పేరు యజ్ఞ శెట్టి (Yagna Shetty). ఆమె కన్నడ చిత్రపరిశ్రమలో బాగా పేరొందిన హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇక యజ్ఞ శెట్టి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
*యజ్ఞ శెట్టి (Yagna Shetty) ఇప్పటివరకు నటించిన చిత్రాలలో దాదాపు 15 విడుదలయ్యాయి. మరో నాలుగు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
* కిల్లింగ్ వీరప్పన్ (Killing Veerappan) చిత్రం తరువాత.. దర్శకుడు ఆర్జీవీతో ఆమె చేస్తున్న రెండో చిత్రం ఇదే.
* తన రెండో చిత్రమైన ఏదేళ్ళు మంజునాథ (2009)కి ఫిలింఫేర్ అవార్డు ఆమెను వరించింది.
* యజ్ఞ శెట్టి సినిమాల్లోకి ప్రవేశించక ముందు MBA గ్రాడ్యుయేట్.
* 2019 లో యజ్ఞ శెట్టి చేస్తున్న చిత్రాల సంఖ్య 4.
* యజ్ఞ శెట్టి ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ కన్నడ భాషలోనివే!
* కన్నడలో కాకుండా వేరే భాషలో ఆమె తొలిసారి నటిస్తున్న చిత్రం - లక్ష్మీస్ ఎన్టీఆర్.
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మనకు లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi)గా కనిపించనున్న యజ్ఞ శెట్టి గురించి కొన్ని వివరాలివి. ఇక ఈ చిత్రంలో ఆమె ఎలా నటిస్తుంది? ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతుది?? అనే ప్రశ్నలకు సమాధానాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైతే కానీ చెప్పలేం.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూరుస్తుండగా; రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఆ చిత్రబృందం.
ఇవి కూడా చదవండి
2019 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కనున్న హీరో-హీరోయిన్స్ వీరేనా!
సోషల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెలబ్రిటీలు..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన... బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?