వాలెంటైన్స్ డే నాడు.. ప్రేయ‌సి నుంచి ప్రియుడు కోరుకునేవి ఇవే..!

వాలెంటైన్స్ డే నాడు.. ప్రేయ‌సి నుంచి ప్రియుడు కోరుకునేవి ఇవే..!

ప్రేమికులకు ప్రతి రోజూ ప్రత్యేకమే. వాలెంటైన్స్ డే(Valentines day) మరింత ప్రత్యేకం. అందుకే ఆ రోజు.. తమ మనసులోని వ్యక్తికి మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి, వాలెంటైన్స్ డే నాడు.. తన గర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌ నుంచి boyfriend ఏం ఆశిస్తాడు? తన ప్రేయసి తనకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అనుకొంటాడు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే..


1. మీ నుంచి ఓ బహుమతి


నిజమే.. వాలెంటైన్స్ డే నాడు.. నా గర్ల్ ఫ్రెండ్ ఏదైనా బహుమతి ఇస్తే బాగుండునని అనుకొంటారు అబ్బాయిలు. అది కూడా మీ చేత్తో మీరు స్వయంగా తయారు చేసిన కానుక అయితే వారి మనసుకి బాగా నచ్చుతుంది? మరింకెందుకు ఆలస్యం వారి మనసు కట్టిపడేసేలా.. మీపై ప్రేమ మరింత పెరిగేలా వారికి నచ్చిన బహుమతి అందించేయండి. సాధారణంగా రిస్ట్ వాచ్, టై, వాలెట్ వంటివి బహుమతిగా ఇస్తే బాగుంటుందని వారు కోరుకొంటారు.


2. మీ చేతి వంట..


2-what-boyfriend-wants-from-his-girlfriend


Photo: Pexels


వాలెంటైన్స్ నాడు మీ బాయ్ ఫ్రెండ్ మనసు గెలుచుకోవాలంటే.. మీరు గిఫ్టే ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా మీ చేతి వంట రుచి చూపిస్తే చాలు. అబ్బాయిలకు తమ ప్రియురాలి చేతి వంట రుచి చూడాలనే ఆశ ఉంటుంది. దాన్ని వాలెంటైన్స్ డే నాడు తీర్చేయండి మరి.


అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేయాలి?


3. డిన్నర్ పార్టీ..


ప్రేమికుల రోజు మనకు సెలవు దినమేమీ కాదు. కాబట్టి మన దినచర్యలో పెద్దగా మార్పేమీ ఉండదు. కానీ ప్రేమికులిద్దరూ ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలని కోరుకొంటారు. అందుకే సాయంత్రం మీ ప్రేమికుడి కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేయండి. వీలుంటే.. అతనికి నచ్చిన వంటకాలను మీరే సిద్ధం చేయండి. అలా చేయడం వీలు కాకపోతే.. మంచి రెస్టారెంట్లో డిన్నర్ ఏర్పాటు చేయండి. హాయిగా సమయాన్ని గడిపేయండి. మీ ప్రియుడు కోరుకొనేది కూడా ఇదే.


 


4. చాక్లెట్స్..


3-what-boyfriend-wants-from-his-girlfriend


Photo: Pixabay


సాధారణంగా బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కు చాక్లెట్స్ ఇస్తాడు. కానీ మ‌న‌సులో తను కూడా నా గర్ల్ ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇస్తే బాగుండునని అనుకొంటాడట. ఒకరికి చాక్లెట్ ఇస్తున్నామంటే.. వారు మనకెంత ముఖ్యమో చెబుతున్నట్టే. మరి, మీ బాయ్ ఫ్రెండ్ మీకెంత ముఖ్యమో అతనికి తెలియాలిగా.. అందుకే ఈ వాలెంటైన్స్ డే కి అతను ఇష్టపడే చాక్లెట్ ను బహుమతిగా ఇచ్చేయండి.


5. ప్రేమలేఖ


వాట్సాప్ లో షార్ట్ మెసేజ్ లు పంపించుకొనే ఈ కాలంలో ప్రేమలేఖ ఏంటని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా..! కానీ మనసులోని భావాలను అక్షరాలు పలికినంత సుమధురంగా.. మరేవీ చెప్పలేవు. అందులోనూ అబ్బాయిలు.. తమ ప్రియురాలు తమను ఎందుకు ప్రేమిస్తుందో తెలుసుకోవాలనుకొంటారు. అది కూడా ప్రేమలేఖ ద్వారా. అందుకే ఈ వాలెంటైన్స్ డేకి మీ లవర్ కి మీ ప్రేమలేఖ అందించండి. వారిని సర్ప్రైజ్ చేయండి.


6. కాస్త రొమాన్స్..


4-what-boyfriend-wants-from-his-girlfriends


Photo: Pexels


వాలెంటైన్స్ డే నాడు తమ‌ ప్రేయసితో కాస్త రొమాంటిక్ గా గడపాలని కోరుకొంటారు అబ్బాయిలు. మీ భాగస్వామికి ఈ వాలెంటైన్స్ డేని మరింత స్పెషల్ గా మార్చాలంటే.. అతనితో కాస్త రొమాంటిక్ గా సమయం గడపండి. అయితే ముందు జాగ్రత్త పాటించడం మాత్రం మరచిపోవద్దు.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ "వాలెంటైన్స్ డే" కానుకలతో.. మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి..!


డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!


హనీమూన్‌కి వెళుతున్నారా..? హాట్ లుక్ ఇచ్చే క్యూట్ డ్రస్సులు మీకోసమే..


రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..?


మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??