నేటి రాశిఫలాలు తెలుసుకోండి.. బంగారు భవిత‌కు బాట‌లు వేసుకోండి..!

నేటి రాశిఫలాలు తెలుసుకోండి.. బంగారు భవిత‌కు బాట‌లు వేసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీరు ఇష్ట‌ప‌డే వ్య‌క్తులకు బ‌హుమ‌తి ఇవ్వండి. అది చిన్న ప్ర‌శంస కావ‌చ్చు. లేదా మీరిచ్చే స‌హ‌కారం కావ‌చ్చు. మీరు ఎంత‌గా ఇత‌రుల‌కు వీటిని అందిస్తారో అంత‌గా మీకు తిరిగి అవి ల‌భిస్తాయి.


వృషభం (Tarus) - ప్ర‌స్తుతం మీ వ‌ద్ద చాలా అవ‌కాశాలు ఉన్నాయి. అయితే వాటి నుంచి త‌క్ష‌ణ‌మే ఫలితాలు వ‌స్తాయ‌ని ఆశించ‌కండి. భ‌విష్య‌త్తు కోసం బ‌ల‌మైన పునాదులు వేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.


మిథునం (Gemini) - మీరు ఉన్న స్థానాన్ని కాపాడుకోండి. ఇప్ప‌టివ‌ర‌కు మీరు సాధించిన లేక పూర్తి చేసిన ప‌నికి వేరొక‌రికి క్రెడిట్ ఇవ్వ‌కండి. మీకు ఉన్న ప్ర‌ణాళిక‌లు, ఆలోచ‌న‌ల‌ను ఇత‌రుల‌తో పంచుకోకండి.


కర్కాటకం (Cancer) - మీ కోరిక‌లు, క‌లలు, లక్ష్యాల‌పై దృష్టి పెట్టండి. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేస్తూ స‌హ‌నంతో వేచి చూడండి. త‌ప్ప‌కుండా అవి తీరుతాయి.


సింహం (Leo) - మీకు ఉన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఆలోచించే క్ర‌మంలో పాజిటివిటీతో వ్య‌వ‌హ‌రించండి. అప్పుడే మీ ప్ర‌ణాళిక‌లు సాఫీగా అమ‌ల‌వుతాయి.


కన్య (Virgo) - మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌తిదీ మీకు ఒక కొత్త అంశాన్ని నేర్పుతుంది. మీకున్న చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా మీ చుట్టూనే ఉన్నాయి. కాక‌పోతే మీరు స‌రిగ్గా దృష్టిపెట్ట‌డం లేదు. ఒక్క‌సారి శ్ర‌ద్ధ‌గా మీ చుట్టూ ఉన్న‌వాటిని గ‌మ‌నించి వాటి నుంచి నేర్చుకోండి.


తుల (Libra) - మీరు అనుకున్న‌ది సాధిస్తారా? లేదా? అన్న‌ది మీరు చేసే ప‌నుల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. మీకు ఒక విభిన్న‌మైన జీవితం కావాల‌నుకుంటే అలా భిన్న‌మైన ప‌నులే చేయండి.


వృశ్చికం (Scorpio) - మీ జీవితంలో ఇప్పుడు మార్పులేమీ చేయ‌కండి. ఒక్క‌సారి బాగా ఆలోచించి స‌హ‌నంతో వేచి చూడండి. ఇంకా ఎలాంటి మార్పులు చేసుకుంటే మీకు మంచి జరుగుతుందో గ‌మ‌నించండి.


ధనుస్సు (Saggitarius) - మీకు వ‌చ్చే స‌వాళ్ల‌నే అవ‌కాశాలుగా మ‌లుచుకోండి. వాటి నుంచి వీలైనంత వ‌ర‌కు నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీరు ఎంత గ‌ట్టి స‌వాల్‌ని ఎదుర్కొంటే అంత‌గా మీ తెలివి పెరుగుతుంది. ఫ‌లితంగా అడ్డంకులు తొల‌గి విజ‌యం సాధిస్తారు.


మకరం (Capricorn) - మీరు సాధించాల‌నుకుంటున్న విజ‌యం మీకు అతి చేరువ‌లో ఉంది. మీ తెలివితేట‌లు, సంక‌ల్పానికి ఇంకాస్త కృషి తోడైతే విజయం మీదే. అయితే ప‌ని కోసం ప్ర‌యాణాలు కూడా చేయాల్సి రావ‌చ్చు.


కుంభం (Aquarius) - మీరు ప్రస్తుతం ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌యంలో ఉన్నారు. కాబ‌ట్టి మీకు బాగా న‌మ్మ‌క‌స్థులైన వారితో మీ ప‌రిస్థితిని వివ‌రించి వారి స‌ల‌హా తీసుకోండి. అలాగే మీ కుటుంబ స‌భ్యుల సూచ‌న‌లు కూడా తీసుకుంటే మీకు మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంది.


మీనం (Pisces) - మీ జీవితంలో ఎదుర‌య్యే ఎలాంటి ప‌రిస్థితుల‌ననైనా ఎదుర్కొనే శ‌క్తి మీకు ఉంది. అంతేకాదు.. నెగెటివ్ అనుకున్న‌ది కూడా మీకు ఉప‌క‌రించే విధంగానే ఉంటుంది.


ఇవి కూడా చదివేయండి


ఈ రోజు రాశిఫలాలు చదివేయండి - కలలను సాకారం చేసుకోండి


ఈ రోజు రాశిఫలాలు చదివేయండి - మీ జీవిత గమనానికి బాటలు వేయండి


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!