ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీరు అనుకున్న‌వి సాధించండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీరు అనుకున్న‌వి సాధించండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీ అభిరుచి ఏంటో దానినే అనుస‌రించండి. ఇందులో ఎటువంటి వాయిదాల‌కు తావీయ‌కండి. మీదైన మ‌నోస్థైర్యం, దైర్యం, ప‌ట్టుద‌ల‌తో మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోండి.

వృషభం (Tarus) – ఒక్క‌సారి మీ కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌ను ప‌ల‌క‌రించండి. వారితో కాస్త స‌మ‌యం గ‌డ‌పండి. అలాగే చెప్పులు లేకుండా మ‌ట్టి లేదా గ‌డ్డిపై న‌డ‌వండి. ఆ స‌మ‌యంలో మీ మ‌న‌సు ఏం చెప్తుందో విన‌డానికి ప్ర‌య‌త్నించండి.

మిథునం (Gemini) – మీకు ఉన్న బంధాల్లో వేటిని మీరు పున‌రుద్ధ‌రించుకోవాల‌ని అనుకుంటున్నారో వాటిని పున‌రుద్ధ‌రించుకోండి. అలాగే అన‌వ‌స‌రం అనిపించ‌న వాటిని అక్క‌డితో క‌ట్ చేసేయండి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – మీకేం కావాలి? ఎందుకు, ఎలా కావాలి.. అనే అంశాల గురించి ఏకాగ్ర‌త‌తో ఆలోచించండి. దానిని పొందేందుకు మీ ముందు ఉన్న మార్గాలేంటో ఒక పేప‌ర్ పై రాసుకోండి. త‌గిన అవ‌కాశాలు త్వ‌ర‌లో వ‌స్తాయి.

సింహం (Leo) – వృత్తిప‌రంగా మీలో కొంద‌రు దూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించాల్సి రావ‌చ్చు. ఇదే స‌మ‌యంలో ఇత‌రులు మీ జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌చ్చు. అయితే ఇవి మిమ్మ‌ల్ని కొత్త‌గా ఆలోచించేలా చేస్తాయి.

కన్య (Virgo) – పాజిటివిటీతో ఆలోచించి మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు ఇత‌రుల‌కు కూడా ఆద‌ర్శప్రాయులుగా అవుతారు. మీ సంతోషాల‌ను ఇత‌రుల‌తో పంచుకోండి.

తుల (Libra) – మీ శ‌త్రువుల‌పై దృష్టి పెట్టి ప్ర‌శాంత‌త పోగొట్టుకునే కంటే మీపై మీరు దృష్టి పెట్టి సంతోషంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించండి. మీ చుట్టూ ఉన్న సంతోషాన్ని క‌నుక్కోండి.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – మీ మ‌న‌సు చెప్పే మాట ప్ర‌కారం మీరు న‌డుచుకుంటే అద్భుత‌మైన ఫ‌లితాలు పొందుతారు. మీకు ఇప్పుడు చాలా మంచి స‌మ‌యం న‌డుస్తోంది. మీ కోరిక‌లు నెర‌వేరుతాయి.

ధనుస్సు (Saggitarius) – మీ గ‌తం మిమ్మ‌ల్ని బాధిస్తుండ‌చ్చు. మీకు ఏడ్వాల‌నిపిస్తే మ‌న‌సారా ఏడ్చేయండి. మ‌న‌సు కాస్త తేలిక‌ప‌డిన త‌ర్వాత ఆ గ‌తాన్ని అక్క‌డితో విడిచిపెట్టేయండి. వ‌ర్త‌మానంపై దృష్టి పెట్టండి.

మకరం (Capricorn) – మీ క‌ల‌లు, ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ధైర్యంగా ముంద‌డుగు వేయండి. మీ వ‌య‌సు ఎక్కువ కాబ‌ట్టి అనుకున్న‌ది సాధించ‌డానికి దానిని ఒక అడ్డంకిగా భావించ‌కండి. మీరిప్పుడు ఏదైనా సాధించ‌గ‌ల‌రు.

కుంభం (Aquarius) – మీరు ఎదిగేందుకు ఉప‌క‌రించే ఎన్నో అవ‌కాశాలు మిమ్మ‌ల్ని వెతుక్కుంటూ మీ వ‌ద్ద‌కు వ‌స్తాయి. వాటిని అందిపుచ్చుకుంటే మీకు వృత్తిప‌రంగానే కాదు.. వ్య‌క్తిగ‌తంగా కూడా లాభ‌దాయ‌కంగానే ఉంటుంది.

ADVERTISEMENT

మీనం (Pisces) – మీ మ‌న‌సు ఏం చెప్తుందో అదే చేయండి. మీ బుర్ర‌లో ఉన్న లాజిక్స్ ని ప‌క్క‌న పెట్టండి. మీరేం చేయగ‌ల‌రో మీ మ‌న‌సుకు బాగా తెలుసు. కాబ‌ట్టి నిర‌భ్యంత‌రంగా మీరు దానిని ఫాలో అయిపోవ‌చ్చు.

ఇవి కూడా చదవండి

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

ADVERTISEMENT

ఈ రోజు రాశిఫలాలు చదివేయండి – కలలను సాకారం చేసుకోండి

28 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT