ADVERTISEMENT
home / Astrology
నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ అదృష్టం గురించి తెలుసుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ అదృష్టం గురించి తెలుసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఇత‌రుల కోసం మీరేమీ న‌టించాల్సిన అవ‌స‌రం లేదు. అందుకు ఇది స‌మ‌యం కూడా కాదు. కాబ‌ట్టి మీ మ‌న‌సులో ఉన్న భావాల‌ను స్ప‌ష్టంగా వారికి తెలియ‌జేయండి.

వృషభం (Tarus) – మీరు ఏం చేయాల‌ని అనుకుంటున్నారో అది చేయండి. ఒక‌సారి విఫ‌లం చెందినంత‌మాత్రాన అక్క‌డే ఆగిపోవాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యంలో త‌ల్లిలాంటివారు లేదా మీ త‌ల్లి మీకు స‌హాయ‌ప‌డ‌తారు.

మిథునం (Gemini) – ప‌రిస్థితుల‌ను విశాల దృక్ప‌థంతో కాస్త భిన్నంగా చూడండి. మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి గ‌ల అనేక మార్గాలు మీకు క‌నిపిస్తాయి. అనేక అవ‌కాశాలు మీ వ‌ద్ద‌కు వ‌స్తాయి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – మీకు మీరు పెట్టుకున్న హ‌ద్దుల‌ను దాటి కాస్త బ‌య‌ట‌కు రండి. ప్ర‌తి విష‌యంలోనూ మీ బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీకు అద్భుత‌మైన జీవితం ల‌భిస్తుంది. మీరు అనుకున్న‌వి సాధిస్తారు.

సింహం (Leo) – ఏ కార‌ణం లేకుండానే మీకు అల‌సిపోయిన‌ట్లు లేదా ఆందోళ‌న‌గా ఉన్న‌ట్లు అనిపిస్తోందా? మీలో ఉన్న శ‌క్తి, సామ‌ర్థ్యాలు త‌గ్గిపోవ‌డం కూడా అందుకు ఒక కార‌ణం కావ‌చ్చు. కాబ‌ట్టి కాస్త విరామం తీసుకోండి. తిరిగి శ‌క్తిని పుంజుకోండి.

కన్య (Virgo) – మీ శ‌క్తి, సామ‌ర్థ్యాల‌ను తిరిగి పొందే స‌మ‌యం ఇది. ఆ దైవ‌శ‌క్తిని ప్రార్థిస్తూనే మీ శ‌క్తి, సామ‌ర్థ్యాల‌ను పొందేందుకు మీ వంతు ప్రయ‌త్నం మీరు మొద‌లుపెట్టండి. అవ‌స‌ర‌మైతే ఇత‌రుల స‌హాయం కోరండి.

తుల (Libra) – మీ సంతోషం గురించి ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది. ప్రేమ‌తో, ఏదైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సంతోషంగా ప‌ని చేయండి. త‌ప్ప‌కుండా స‌త్ఫ‌లితాలు పొందుతారు.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – కొన్ని కొన్ని ప‌ద్ధ‌తులు త‌ర‌త‌రాలుగా వ‌స్తూ మ‌న‌కు అల‌వాటైపోతూ ఉంటాయి. అయితే వాటిలో అన్నీ స‌రైన‌వి కాక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి ఇప్పుడు వాటి నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన స‌మ‌యమైంద‌ని గుర్తించండి.

ధనుస్సు (Saggitarius) – ప్రేమ‌ను ఇచ్చేందుకు, పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. గ‌తంలో ఎదురైన ప్రేమ మీకు చేదు అనుభ‌వాలు క‌లిగించినా వాటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ధైర్యంగా అంద‌రినీ ప్రేమించండి.

మకరం (Capricorn) – అవ‌స‌రార్థం లేదా ప‌రిస్థితుల దృష్ట్యా మీరు ఏమైనా పొర‌పాట్లు చేసి ఉంటే వాటికి ఇప్పుడు క్షమాప‌ణ కోరుకోండి. లేదంటే అవి మీ బంధాల‌ను త‌ప్ప‌క ప్ర‌భావితం చేస్తాయ‌ని గుర్తుంచుకోండి.

కుంభం (Aquarius) – భ‌యాన్ని విడిచిపెట్టి, ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేయండి. అప్పుడే మీరు అనుకున్న‌వి సాధించ‌గ‌లుగుతారు. ఏవేవో కార‌ణాల వ‌ల్ల భ‌య‌ప‌డుతూ మీ కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు రాదు.

ADVERTISEMENT

మీనం (Pisces) – మీకు ఏం కావాలో మీరు తెలుసుకొని దానిని సాధించ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఒక్క‌సారి మీరు ప్ర‌య‌త్నించడం ప్రారంభిస్తే త‌గిన అవ‌కాశాలు మిమ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తాయి. కాబట్టి మొద‌ట మీరు అనుకున్న‌ది సాధించ‌డానికి ప్ర‌యత్నం మొద‌లుపెట్టండి.

ఇవి కూడా చదవండి

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీరు అనుకున్న‌వి సాధించండి..!

నేటి రాశిఫలాలు తెలుసుకోండి.. బంగారు భవిత‌కు బాట‌లు వేసుకోండి..!

ADVERTISEMENT

ఈ రోజు రాశిఫలాలు చదివేయండి – కలలను సాకారం చేసుకోండి

29 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT