నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ రాశి ఫ‌లితం ఏంటో తెలుసుకోండి!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ రాశి ఫ‌లితం ఏంటో తెలుసుకోండి!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీ జీవితంలో ఏదైతే వైఫల్యం ఉందో దానిపై కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సంతోష‌క‌ర‌మైన సంద‌ర్భాల‌పై దృష్టి పెట్టండి. వాటిని మీకు మిగిల్చిన ప్ర‌తిఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పండి. మీరు సాధించింది చూసి గ‌ర్వించండి.


వృషభం (Tarus) - మిమ్మ‌ల్ని ప్రేమించే మీ కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషులే మీ బ‌లం. వారిని మీరూ అంత‌గానే ప్రేమించండి. మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోనివారిని వ‌దిలేయండి. ఎవ‌రైనా మీ విష‌యంలో త‌ప్పు చేస్తే వారిపై కోపం పెంచుకోకండి.


మిథునం (Gemini) - మీకు బాగా ద‌గ్గ‌రైన ఒక వ్య‌క్తిపై మీకు కోపం లేదా తీవ్ర‌మైన బాధ ఉండ‌చ్చు. దానిని అక్క‌డితో వ‌దిలేయండి. గ‌తంలో మాదిరిగానే వారిని మ‌రింత ఎక్కువ‌గా ప్రేమించండి. మ‌నుషులు మారుతూ ఉంటారు.


కర్కాటకం (Cancer) - ఇత‌ర‌త్రా ప‌నుల్లో ప‌డి మీ కోసం అంటూ కాస్త స‌మ‌యం కేటాయించుకోవ‌డం పూర్తిగా మానేశారు. కానీ ఈ రోజు మాత్రం మీరు కాస్త విశ్రాంతి తీసుకోవ‌డానికి, తిరిగి ఉత్సాహం నింపుకోవ‌డానికి స‌మ‌యం కేటాయించుకోవాల్సిందే!


సింహం (Leo) - అపార్థాలు వ‌చ్చిన‌ప్పుడు లేదా ఏవైనా త‌గాదాలు జ‌రిగిన‌ప్పుడు కాస్త ప‌రిణితితో ఆలోచించండి. ఇత‌రుల‌ విషయంలో ఏమైనా అపార్థాలు ఉంటే వెంట‌నే వాటిని తొలిగించుకోండి. ప‌రిస్థితుల‌ను వారి కోణం నుంచి చూసే ప్ర‌య‌త్నం చేయండి.


క‌న్య (Virgo) - మీరు చాలా నిరుత్సాహంగా, బ‌ద్ద‌కంగా ఉన్నారు. ఉప్పునీటి స్నానం చేసి, మీ బెడ్ ప‌క్క‌న నిమ్మ‌చెక్క‌లు పెట్టుకొని ప‌డుకోండి. ప్ర‌కృతితో కాసేపు స‌మ‌యం గ‌డ‌పండి. నెగెటివిటీ నుంచి దూరంగా ఉండండి.


తుల (Libra) - మీ చుట్టూ ఉన్న ప‌రిస్థితులు, వ్య‌క్తులు మీకు ఏం నేర్పించాల‌ని భావిస్తున్నారో ఒక్క‌సారి గ‌మ‌నించండి. ప‌రిస్థితుల‌ను వారి కోణం నుంచి కూడా చూడండి. మీ దృష్టికి ప‌రిధులు విధించ‌కండి.


వృశ్చికం (Scorpio) - మిమ్మ‌ల్ని ప్రేమించే వ్య‌క్తులు.. మీకు ప్రేమ సందేశాలు పంపుతున్నారు. వారు మీతో ఉన్న‌ట్లు అనిపించ‌డం లేదా వారికి న‌చ్చిన పాట‌లు మీకు వినిపించ‌డం వంటివి జ‌రగ‌చ్చు. వారు మీతోనే ఉన్నార‌నడానికి ఇవే సంకేతాలు.


ధనుస్సు (Saggitarius) - ప్రేమ మీ బాధ‌ను త‌గ్గించేందుకు అనేక రూపాల్లో మీ వ‌ద్ద‌కు వ‌స్తుంది. మీ గ‌త అనుభ‌వాల కార‌ణంగా దానిని నిర్ల‌క్ష్యం చేయకండి. ప్రేమ‌పై న‌మ్మ‌కం ఉంచండి.


మకరం (Capricorn) - మీరు కోరుకున్న స‌పోర్ట్, స‌హాయం మీకు అందుతుంది. అయితే మీకు ఇవి అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎదుటివారిని అడ‌గండి. అడ‌గ‌క‌పోతే మీకు ఇవి అవ‌స‌రం అని ఎవ‌రికి తెలుస్తుంది? అన్నీ ఒంట‌రిగా చేసేందుకు ప్ర‌య‌త్నించకండి.


కుంభం (Aquarius) - మీరు ఇచ్చిన మాట‌, చేసిన వాగ్దానం మీరే నిల‌బెట్టుకోవాలి. అందుకోసం ఏం చేయాలో, ఎంత ప్ర‌య‌త్నించాలో శ‌క్తివంచ‌న లేకుండా చేయండి. లేదంటే విజ‌యం సాధించ‌డం క‌ష్టం.


మీనం (Pisces) - మీతో ఉన్న టీం, మీలా ఆలోచించే స‌భ్యుల బృందంతో క‌లిసి ప‌ని చేయండి. మీరు ఒంట‌రిగా ప‌ని చేస్తే అనుకున్న‌ది సాధించ‌లేరు. ఇప్పుడు మీరు పంచుకునే భాగ‌స్వామ్యం దీర్ఘ‌కాలం పాటు మీకు లాభాల‌ను చేకూరుస్తుంది


ఇవి కూడా చదవండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీరు అనుకున్న‌వి సాధించండి..!