మీరూ వ‌ర్క్ హోలిక్ అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

మీరూ వ‌ర్క్ హోలిక్ అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

మీరు ప‌డుకునేట‌ప్పుడు మీకు ప‌క్క‌నే ల్యాప్‌టాప్(Laptop) ఉండాల్సిందేనా? అర్ధ‌రాత్రి మూడు గంట‌లకు కూడా వ‌ర్క్(Work) మెయిల్స్‌కి మీరు రిప్లై ఇస్తుంటారా? చేయాల్సిన ప‌ని కంటే డ‌బుల్ ప‌ని చేస్తేనే మీ వీకెండ్ ఆనందంగా ఉంటుందా? అయితే మీరూ వ‌ర్క్ హోలిక్ (workaholic) అన్న‌మాట‌..! నేను కూడా ఓ పెద్ద వ‌ర్క్ హోలిక్ నే.. ఇవ‌న్నీ నేనూ చేస్తుంటాను. తిన‌డం, ప‌డుకోవ‌డం, ప‌నిచేయ‌డం త‌ప్ప ఇంకే ప్ర‌పంచం లేద‌న్న‌ట్లుగా నేను జీవిస్తుంటా. వ‌ర్క్ లైఫ్ బ్యాల‌న్స్ అంటేనే ఒక అబ‌ద్ధం అనుకుంటా.. ఆఫీసులో ఖాళీ స‌మ‌యంలో అంద‌రూ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు అస్స‌లు అర్థం కాదు. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఖాళీగా ఉండ‌డం న‌చ్చ‌దు. ఒక్క ఐదు నిమిషాలు ఆఫీస్‌లోని ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్లు నా కంప్యూట‌ర్‌ని అప్‌డేట్ చేయ‌డానికి తీసుకుంటే చాలు.. నేను ప‌నిచేయ‌ట్లేదు అన్న ఆలోచ‌న నా మెద‌డును తొలిచేస్తూ ఉంటుంది. ఇందులో మీరూ ఏదైనా చేస్తున్నార‌నిపిస్తోందా? మీరూ వ‌ర్క్ హోలిక్ అనిపిస్తోందా? ఎందుకు అనుమానం. ఈ ప‌ది ల‌క్ష‌ణాల‌ను చెక్ చేసుకొని మీరు నిజంగానే వ‌ర్క‌హోలికా? కాదా? అని తెలుసుకోండి.


1


1. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంలో మీకు ప్ర‌త్యేక‌మైన సంతృప్తి ద‌క్కుతుంది..


మీకంటూ ప్ర‌త్యేకంగా ఆఫీస్ టైమ్ అంటూ ఏదీ ఉండ‌దు. మీరు ఆఫీస్‌కి రావ‌డంలో అంద‌రి కంటే ముందుంటారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవ‌డంలో మాత్రం అంద‌రి త‌ర్వాతే మీరు.. ఇక ఆఫ్ రోజున ప‌నిచేయ‌డం అంటే కూడా మీకు చాలా ఇష్టం. ఎందుకంటే దీని వ‌ల్ల మ‌నం చేయాల్సిన ప‌నుల‌న్నీ పూర్తి అయిపోతాయి. ప‌నిలోనే ఫ‌న్‌ని కూడా వెతుక్కునే ర‌కం మ‌నం.


2


2. టిక్ చేస్తే కానీ ఆనందం అనిపించ‌దు..


ఒక‌ రోజు మొద‌ల‌వ్వ‌గానే కొంద‌రు ఆనందిస్తారు. ఉద‌యం టీ లేదా కాఫీ తాగ‌డం ద్వారా ఇంకొంద‌రు రోజుని ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఒక‌ రోజు ప్ర‌శాంతంగా ఫీల‌వ్వాలంటే మీరు రాసుకున్న లిస్ట్‌లో దాదాపు స‌గం ప‌నులు అయిపోయాయ‌ని టిక్ చేసుకోవాల్సిందే.


3


3. స్టేట‌ల్ ఇన్ రిలేష‌న్‌షిప్ విత్ వ‌ర్క్‌..


మీరు అబ్బాయిల‌తో కాకుండా.. మీ ల్యాప్‌టాప్‌, ఫోన్‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పుడూ అవి మీతో ఉండాల్సిందే..! దానితోనే మీరు మీ స‌మయాన్ని ఆనందంగా గ‌డ‌ప‌గ‌ల‌రు.


4


4. భోజ‌నానికీ స‌మ‌యం లేదు..


మీరు మామూలుగా ఆహారం తిన‌డానికి మీకు స‌మ‌యం ఉండ‌దు. కొన్నిసార్లు ప‌ని చాలా ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు మీరు ఆ ప‌ని చేసేందుకు తిండిని కూడా తిన‌కుండా ప‌క్క‌న పెట్టేసి లేదా పూర్తిగా భోజ‌నం కూడా చేయ‌కుండా ప‌నులు చేస్తుంటారు.


5


5. ఎక్కువ ప‌ని చేస్తేనే ప‌ని చేసిన‌ట్లు లెక్క‌..


మీకు మీరే త‌క్కువ స‌మ‌యానికి డెడ్‌లైన్ల‌ను పెట్టుకొని ప‌నిచేస్తుంటారు. ఎందుకంటే డెడ్‌లైన్ అనే ప‌దం మీకు ఉత్సాహాన్ని అందిస్తుంది. త‌క్కువ ప‌నితో సంతృప్తి చెంద‌డం మీ కెరీర్‌లోనే లేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ ప‌ని చేస్తే మీకు అంత ఆనందం. మీకు ప‌నంటే ఎంతో ఇష్టం కాబ‌ట్టి మ‌ల్టీటాస్కింగ్‌, మీ కొలీగ్స్ ప‌నిలో సాయం చేయ‌డం వంటివి కూడా చేస్తారు.


6


6. తిరిగి కాల్ చేయ‌డ‌మా? నో..


అఫీషియల్ కాల్స్‌ని ఎత్త‌కుండా అస్స‌లు వ‌ద‌ల‌ని మీరు ఏ స‌మ‌యంలోనైనా వాటిని ఎత్తి మాట్లాడ‌తారు. అదే ఫోన్‌కాల్ మీ స్నేహితుల నుంచి లేదా కుటుంబం నుంచి వ‌స్తే మాత్రం తిరిగి కాల్ చేయ‌డానికి మీకు పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. వారికి కూడా మీ గురించి తెలుసు కాబ‌ట్టి మ‌రీ అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఫోన్ చేయ‌రు.


7. డెడ్‌లైన్‌కి ముందు పూర్తిచేస్తే ఆ కిక్కే వేర‌ప్పా..


మీకు ఇచ్చిన అసైన్‌మెంట్‌ని దాని కోసం కేటాయించిన స‌మ‌యం కంటే ముందే పూర్తి చేస్తే మీకు అందే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది.


8


8. క‌ల‌ల్లోనూ అద్భుత‌మైన ఐడియాలు ఇచ్చేస్తుంటారు..


రోజంతా ప‌ని గురించే ఆలోచిస్తుంటారు కాబ‌ట్టి నిద్ర‌లోనూ మీకు చ‌క్క‌టి ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అంతేకాదు.. మీరు చ‌క్క‌టి ప్ర‌జెంటేష‌న్ ఇస్తున్న‌ట్లు.. వాటిని మీ పై అధికారులు, క్లైంట్లు ఎంతో ఇష్ట‌ప‌డి మిమ్మ‌ల్ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్న‌ట్లు మీకు క‌ల‌లు వ‌స్తుంటాయి.


9


9. బాయ్‌ఫ్రెండ్‌? అంటే ఎవ‌రు?


కుటుంబానికి, స్నేహితుల‌కే పెద్ద‌గా స‌మ‌యం కేటాయించ‌నివారికి ఇక బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉంటారు చెప్పండి? అందుకే నో బాయ్‌ఫ్రెండ్‌..!


10


10. అంద‌రూ మిమ్మ‌ల్ని మ‌ర్చిపోతారు.


మీ స్నేహితులు మిమ్మ‌ల్ని గుర్తించ‌డ‌మే మానేస్తారు. ఇక కుటుంబ స‌భ్యులు ఎన్ని మెసేజ్‌లు పెట్టినా మీరు స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల మీకు మెసేజ్ చేయ‌డ‌మే ఆపేస్తారు. వాట్సాప్ గ్రూప్స్‌లోంచి కూడా మిమ్మ‌ల్ని తీసేసి ఉంటారు. ఇక ఆఫీస్ త‌ర్వాత జ‌రిగే పార్టీల‌కు మీ కొలీగ్స్ మిమ్మ‌ల్ని పిల‌వ‌డం మానేస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ వాటికి నో చెబుతుంటారు. మ‌ళ్లీ పిలిచి నో అనిపించుకోవ‌డం ఇష్టం లేక మిమ్మ‌ల్ని లెక్క‌లోకి తీసుకోవ‌డ‌మే మానేస్తారు చాలామంది.


మీకూ చాలా క‌నెక్ట్ అవుతున్నాయి క‌దా.. అయితే మీరు కూడా వ‌ర్క్ హోలిక్ అన్న‌మాట‌..!


ఇవి కూడా చ‌ద‌వండి.


మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..


వాలెంటైన్స్ డేకి సింగిల్‌గా ఉంటే.. ఈ స‌మ‌స్య‌లు మీకూ ఎదుర‌య్యే ఉంటాయి..!


ఇష్టంలేని ల‌వ్‌ ప్ర‌పోజ‌ల్‌కి.. ఇలా తెలివిగా నో చెప్పండి..!


Images : Giphy.