వాలెంటైన్స్ డేకి సింగిల్‌గా ఉంటే.. ఈ స‌మ‌స్య‌లు మీకూ ఎదుర‌య్యే ఉంటాయి..!

వాలెంటైన్స్ డేకి సింగిల్‌గా ఉంటే.. ఈ స‌మ‌స్య‌లు మీకూ ఎదుర‌య్యే ఉంటాయి..!

వాలెంటైన్స్ డే(Valentines day).. ఈ రోజు వ‌చ్చిందంటే చాలు.. ఎటు చూసినా ప్రేమికుల హ‌డావిడే.. న‌చ్చిన‌వారికి చ‌క్క‌టి బ‌హుమ‌తులు అందించ‌డం, న‌చ్చిన ప్ర‌దేశాల‌కు వెళ్ల‌డం, ఇద్ద‌రూ క‌లిసి ఆనందంగా గ‌డ‌ప‌డం.. ఇలా ఎవ‌రికి తోచిన ప‌ద్ధ‌తుల్లో వారు త‌మ ప్రేమ‌ను చాటిచెబుతుంటారు. అయితే మీకు బాయ్‌ఫ్రెండ్ లేక‌పోయినా.. మీ స్నేహితులంద‌రిలోనూ సింగిల్ గ‌ర్ల్ (Single girl) మీరొక్క‌రే అయినా.. మీ మ‌ధ్య‌ ఎదుర‌య్యే కొన్ని సంఘ‌ట‌న‌లు ఇబ్బందిపెడ‌తాయి. అలాంట‌ప్పుడు సాధార‌ణంగా అమ్మాయిలు ఎలా ఫీల‌వుతారో తెలుసా? ఒక‌సారి చూసేద్దాం రండి..


1. రొమాంటిక్ చిత్రాలు, మెసేజ్‌ల‌తో మీ ఫేస్‌బుక్ నిండిపోతుంది.


అబ్బా.. ఈ వాలెంటైన్స్ డే ఎందుకొస్తుందో.. అంద‌రూ ఇక్క‌డికి వెళ్లాం.. ఆ ప్ర‌దేశానికి ట్రిప్‌కి వెళ్తున్నాం. నా బాయ్‌ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ వారం రోజులు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటే స‌రి..!


breakup1


2. మీరు ఒక్క‌రే ఉన్నార‌ని స్నేహితులు మిమ్మ‌ల్ని వారితో గ‌డిపేందుకు ఆహ్వానిస్తారు..


ఫ‌ర్లేదు. మీతో పాటు వ‌చ్చి ఎక్స్‌ట్రా ప్లేయ‌ర్‌లా కూర్చోవ‌డం నాకు అస్స‌లు ఇష్టం లేదు.


3. మీ స్నేహితులంతా వాలంటైన్స్ డే ఎంజాయ్ చేస్తుంటే మీరు ఒంట‌రిగా మిగులుతారు..


వీళ్లంద‌రికీ పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి, ప్రేమించ‌డానికి ఇంత తొంద‌రెందుకో? అవును.. నేను అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్ద‌దాన్నైపోయానా? రెండు సంవ‌త్స‌రాల క్రిత‌మేగా నేనీ ఉద్యోగంలో చేరింది..


gifskey %281%29


4. మీకోసం ఓ అబ్బాయిని వెతికేందుకు మీ స్నేహితులు ప్ర‌య‌త్నిస్తుంటారు..


ఏంటి? రాహుల్ వాళ్ల క‌జిన్ అందంగా ఉంటాడ‌ని చెప్పినందుకు త‌న‌తో డేట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా? నాకు డేటింగ్ చేసే ఆలోచ‌న ఉంటే నీకు అప్పుడు చెబుతాను కానీ ఇప్పుడు న‌న్ను వ‌దిలేయ్‌. 


5. మీరు అమ్మానాన్న చూసిన వ్య‌క్తినే చేసుకుంటార‌ని అంద‌రి భావ‌న‌.


నాకు ల‌వ్ మ్యారేజ్ కి పెద్ద‌లు ఒప్పుకోర‌నే భ‌య‌మూ లేదు.. అరేంజ్‌డ్ మ్యారేజ్‌పై ఇష్ట‌మూ లేదు.. ఈ విష‌యాల‌న్నీ మీకు చెప్పాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.


6. వేలెంటైన్ డే పార్టీ పాసెస్ మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడ‌తాయి..


సాయంత్రం పార్టీకి ఇద్ద‌రూ క‌లిసే వెళ్లాల‌ట‌. మ‌రి, బాయ్‌ఫ్రెండ్ లేనివాళ్లేం చేయాలో.. నాకోసం ఎవ‌రైనా ఈ పార్టీ వ‌ర‌కూ బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటే బాగుండు.. ఆ రాహుల్ వాళ్ల క‌జిన్‌ని ఒక్క‌సారి అడిగితే ఎలా ఉంటుంది?? అమ్మో.. త‌ను మ‌ళ్లీ త‌న‌పై నాకు ఇష్టం ఉంద‌నుకుంటే.. వ‌ద్దులే.. పార్టీ క్యాన్సిల్‌. 


giphy


7. సింగిల్ అబ్బాయిలు మిమ్మ‌ల్ని ట్రై చేస్తుంటారు..


వాలెంటైన్స్ డే అన‌గానే ఇదో బాధ‌. ప్ర‌తిఒక్క‌రూ వ‌చ్చి ఐ ల‌వ్ యూ చెప్ప‌డం.. డేట్‌కి పిల‌వ‌డం.. వీళ్ల‌కు ఇంకో ప‌నేమీ ఉండ‌దా?


8. బ్రేక‌ప్ అయిన వాళ్లు మీకు స‌ల‌హాలిస్తుంటారు.


నువ్వు చాలా మంచి ప‌ని చేశావు. ఈ ప్రేమ‌, దోమ అంతా ట్రాష్‌. కొన్నిరోజుల వ‌ర‌కే.. అందుకే ఎవ‌రినీ ప్రేమించ‌కు..
నేను - ఓహ్‌.. అవునా.. మంచిది.. (క‌బాలి పోజ్ లో)


 1525341064


9. ఒక్కోసారి మీపై మీకే అనుమాన‌మొస్తుంది..


అయినా అంద‌రికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఒక్క‌దానికే ఎందుకు లేరు? నేను మ‌రీ అంత రిజ‌ర్వ్‌డ్ టైపా? లేక వాళ్లు త‌ట్టుకోలేనంత హాట్‌గా ఉన్నానా?


10. మీరూ బాయ్‌ఫ్రెండ్ వెతుక్కోవాల‌నుకుంటారు..


నాకూ ఓ బాయ్‌ఫ్రెండ్ ఉంటే మంచి మంచి బ‌హుమ‌తులు వ‌చ్చేవేమో.. ఒక్క‌సారి టిండ‌ర్ డౌన్లోడ్ చేసి చూస్తే స‌రి.. అయినా.. ఇప్పుడు వాలంటైన్స్ డే గిఫ్టుల కోసం చూస్తే.. ఆ త‌ర్వాత స‌మ‌స్య‌లు రావా ఏంటి? నేను ఇలా సింగిల్ ఉండ‌డం బెట‌ర్‌..!


ఇవి కూడా చ‌ద‌వండి.


బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!


మీరూ లేట్ ల‌లిత‌లేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జ‌రుగుతూ ఉంటాయి..


తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!


GIfs - Giphy, Gifskey