ఈ రోజు రాశిఫలాలు చదవండి.. భవితకు మార్గాన్ని నిర్దేశించుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. భవితకు మార్గాన్ని నిర్దేశించుకోండి..!

ఈ రోజు (ఏప్రిల్ 16) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (Horoscope and Astrology) మీకోసం..మేషం (Aries) – ఈరోజు ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. అయినా స‌రే.. అనుకున్న స‌మ‌యానికి ప‌ని పూర్తి చేసే విధంగా మీరు ప్రణాళిక వేసుకుంటారు. అనుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు.. కలిగే అసలు సిసలైన సంతోషాన్ని మీరు ఈ రోజు ఆస్వాదిస్తారు.


వృషభం (Tarus) – మీకు ప్రేమ‌పై న‌మ్మకం ఉందా? ఉన్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా ఈ రోజు ప్రేమ దేవ‌త మిమ్మ‌ల్ని క‌రుణిస్తుంది. కొత్త పరిచయాలు మీలో ఆసక్తిని కలిగించే అవకాశం కూడా ఉంది. మీరు వివాహితులైతే.. మీ భాగస్వామి కోసం ఈ రోజు కేటాయించండి. తన మనసులోని భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. 


మిథునం (Gemini) – మీరు మీ ప‌ట్ల ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యంపైనే మీ ఆరోగ్యం కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం ప‌ట్ల నిర్లక్ష్యంగా ఉంటే.. కొన్ని అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక, ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 


కర్కాటకం (Cancer) – ప‌నిలో ఈ రోజు మీరు లీడ్ తీసుకోండి. ఎవ‌రికి తెలుసు? భ‌విష్య‌త్తులో మీరే మంచి టీం లీడ‌ర్ అవుతారేమో! అందుకే.. ఆఫీసులో శ్రద్ధగా, ఉత్సాహంగా పని చేయడానికి శ్రీకారం చుట్టండి. 


సింహం (Leo) – మీరు ప్రేమలో పడ్డారా..? అయితే మీరు ప్రస్తుత సమయంలో మీ కెరీర్‌కు మొదటి ప్రాధాన్యమిస్తూ.. ఆ తర్వాతే ప్రేమ గురించి ఆలోచించడం మంచిది.  ఈ క్రమంలో మీ లక్ష్యాల గురించి ముందుగానే మీ ప్రేమించే వ్యక్తికి చెప్పడం కూడా మంచిది. 


క‌న్య (Virgo) – మంచి ఆలోచ‌న‌ల‌తో మీరు ప‌ని చేస్తే.. పెద్ద పెద్ద అవ‌కాశాలు వాటంత‌ట‌వే మిమ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తాయి. అందుకే స్థిరచిత్తంతో కష్టపడి పడి పనిచేయడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీరు పలు అడ్డంకులను కూడా అధిగమించాల్సి ఉంటుంది. 


తుల (Libra) – ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు ఎంత బిజీగా ఉన్నా.. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోకూడదు. సాధ్యమైనంత వరకు బయట తిండికి స్వస్తి చెప్పి.. ఇంటి భోజనానికే తొలి ప్రాధాన్యమివ్వండి.


వృశ్చికం (Scorpio) – జీవితంలో ఎవ‌రూ మ‌న‌కు ఏదీ ఇవ్వ‌రు. ఎవ‌రో మనకు ఏదో చేస్తారనే ఊహ‌ల నుంచి ముందుగా మీరు బ‌య‌ట‌కు రావాల్సిందే. ఎందుకంటే కొన్ని వాస్తవాలు చేదుగానే ఉంటాయి. మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నప్పుడే ఫలితాన్ని పొందగలరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.


ధనుస్సు (Saggitarius) – మ‌న జీవితంలో ఎంతోమంది మ‌న‌కు స్నేహితులు అవుతూ ఉంటారు. వారిలో కొంద‌రు మాత్ర‌మే మ‌న మ‌న‌సుకు బాగా చేరువ అవుతారు. అలాంటి స్నేహితుల‌ను ఈ రోజు క‌లిసి హాయిగా కాసేపు మాట్లాడుకోండి. ఎంతో ఆనందాన్ని పొందండి.


మకరం (Capricorn) –  ప్ర‌తికూల ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల‌తో క‌లిసి ప‌ని చేస్తే.. వారి ప్ర‌భావం మీపై కూడా త‌ప్ప‌కుండా ప‌డుతుంది. అందుకే మీరు ఇతరుల మాటలను లక్ష్య పెట్టక.. మీ ప‌ని మీరు పూర్తి చేసుకోవ‌డం మంచిది.


కుంభం (Aquarius) – మీ ఆలోచ‌న‌లు ఏవిధంగా సాగుతున్నాయి? సానుకూలంగానా?? లేక ప్ర‌తికూలంగానా?? ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే మంచింది. ఎందుకంటే మంచి అనేది మ‌న ఆలోచ‌న‌ల నుంచే మొద‌ల‌వుతుంది.


మీనం (Pisces) – మీరు మీ బంధాలను పటిష్టం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరినీ బాధపెట్టే నిర్ణయాలు తీసుకోకపోవడం బెటర్. మీరు ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలే.. భవిష్యత్తులో మీకు ఎంతో లాభం చేకూరుస్తాయి. 


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేయండి..!