మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేయండి..!

మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేయండి..!

ఈ రోజు (ఏప్రిల్ 14) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (Horoscope and Astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీ జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాల్సిన సమయం ఇది. ఇప్పటివరకు జరిగిన సంఘటనల కారణంగా ఎక్కడో ఆపిన మీ జీవితానికి తిరిగి కొత్తగా ఊపిరి పోయండి. అడ్డంకులు తొలగించుకొని ముందడుగు వేయండి.


వృషభం (Tarus) – మీ వద్ద ఉన్న వస్తువులు లేదా వనరులను ఇతరులతో పంచుకోండి. అవసరం ఉన్న వారికి సహాయం చేయడం మంచిదే. అది మీ సమయం కావచ్చు లేదా తెలివితేటలు, డబ్బు.. ఏదైనా కావచ్చు. కానీ చేసేది ప్రేమతో చేయండి. ప్రేమతోనే ఫలితాలు సాధించవచ్చనే నిజాన్ని తెలుసుకోండి


మిథునం (Gemini) –  ప్రేమను ఇవ్వడానికి లేదా అందుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. అది మీకు ఎవరి నుంచైనా అందవచ్చు. కాబట్టి ప్రతిఒక్కరితోనూ ప్రేమగా మాట్లాడండి. ప్రేమ ఒక శక్తి అని గుర్తుంచుకోండి.


కర్కాటకం (Cancer) –  మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఇతరులను గైడ్ చేయండి. వారి జీవితంలో ఒక మార్పుకి కారణమై సంతోషంగా జీవించేలా చేయండి. మార్పే జీవితానికి పరమావధి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.


సింహం (Leo) –  ఇతరుల జీవితాలను మీరు తప్పకుండా ప్రభావితం చేయడమో లేక మార్పు తీసుకురావడమో చేస్తుంటారు. ఈ విషయం మీరు గ్రహించకపోవచ్చు. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోండి. ప్రేమతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి


క‌న్య (Virgo) –  మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇప్పటివరకు మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడండి. మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీకు మీరు ప్రాధాన్యం ఇచ్చుకోండి. అయితే మీ గెలుపు దారి.. అహంకారానికి బాటలు వేయకూడదు.


తుల (Libra) –  మీకేం కావాలి, మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి ఒక స్పష్టత కలిగి ఉండండి. మీకు కలలు ఉన్నా.. వాటిని ఎలా సాకారం చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. స్పష్టత ఉంటే ఏదైనా సాధించవచ్చు. 


వృశ్చికం (Scorpio) – మీ కలలు నిజమవుతాయి. ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ దిశగా అడుగులేయాలో మీకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ముందు ఆ ఒక్క అడుగు ధైర్యంగా వేయండి. తర్వాత మీరు అనుకున్న దిశగా మీరు ఇట్టే ప్రయాణం చేయగలుగుతారు. 


ధనుస్సు (Saggitarius) – మీ సామర్థ్యాలేంటో మీకు బాగా తెలుసు. కాబట్టి మీ జీవితాన్ని ధైర్యంగా, సంతోషంగా జీవించండి. ఆత్మవిశ్వాసంతో మెలగండి. మీరు సరైన దారిలోనే వెళ్తున్నారు. 


మకరం (Capricorn) –  మీ కోసం మీరు గట్టిగా నిలబడండి. మీరు నిజాయితీగా ఉన్నంత వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఎవరైతే వారి కోసం నిలబడలేరో వారికి కూడా మీ వంతు సహాయ, సహకారాలు అందించండి.


కుంభం (Aquarius) – కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే సమయం ఇది. మీ జీవితంలో మరో విజయవంతమైన దశ ప్రారంభం కానుంది. కాబట్టి దానికి సిద్ధంగాఉండండి. సమయం వ్యర్థం చేసుకోకండి.


మీనం (Pisces) – మీరు ప్రస్తుతం ఎదుగుదల ఉన్న సమయంలో ఉన్నారు. ఇప్పటివరకు మీ సమయం మెల్లగా నడిచి ఉండచ్చు. కానీ మార్పుకి ఆహ్వానం పలకండి. 


Credit: Asha shah


ఇవి కూడా చ‌ద‌వండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..