మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవితకు పునాదులు వేసుకోండి..!

మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవితకు పునాదులు వేసుకోండి..!

ఈ రోజు (ఏప్రిల్ 20) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  మీరు చేసే పనులకు సంబంధించిన ఫలితాల కోసం ఎక్కువగా ఆలోచించకండి. అవి రావాల్సిన సమయానికి తప్పకుండా వస్తాయని నమ్మండి. అంతేకానీ వాటి కోసం ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడిని ఫీలవ్వకండి.


వృషభం (Tarus) – మీకు ప్రస్తుతం ఉద్యోగ భద్రత ఉంది. కనుక అనవసరంగా చింతించకండి. మిగతా విషయాలు పై కూడా దృష్టిని మళ్లించండి. పర్యావరణాన్ని  ప్రేమించండి. మూగజీవాలకు ఆశ్రయం కల్పించండి. దీంతో మీకు ఎనలేని సంతృప్తి కలుగుతుంది. మీరు ఎంత ఎక్కువగా వాటిని ప్రేమిస్తే తిరిగి మీకు అంత ప్రేమ అందుతుంది.


మిథునం (Gemini) – మీకు సహజసిద్ధంగా ఉన్న నాయకత్వ లక్షణాల కారణంగా నాయకులుగా మీరెప్పుడూ ముందే నిలబడతారు. అంతేకాదు.. ఇప్పుడు మీరు చేపట్టే ఏ పనైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. తద్వారా మీరు చాలామందికి ప్రేరణగా నిలుస్తారు.


కర్కాటకం (Cancer) – మీ కెరీర్‌కి  లేదా మీ సృజనాత్మకతకి సంబంధించి మీకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. వాటిని మీరు ఉపయోగించుకొని.. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా.. విజయాన్ని కైవసం చేసుకొనేలా ప్రయత్నించండి.  ధైర్యంగా సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్లండి.


సింహం (Leo) – మీకున్న అవకాశాలు, ఆప్షన్స్ ప్రకారం మీరొక నిర్ణయం తీసుకోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి ఇతరులు ఇచ్చే సూచనలు, సలహాల ప్రకారం ఏం చేయాలో నిర్ణయించుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లండి.


క‌న్య (Virgo) – మీరు ముందుకు వెళ్లడానికి.. మీకు ఎలాంటి దారి కనిపించట్లేదా?? కాస్త మీ మనోనేత్రంతో చూడండి. తప్పకుండా ఏదో ఒక దారి కనిపిస్తుంది. చాలా సులభంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లవచ్చు. ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.


తుల (Libra) – మీరు దేని గురించో బాగా ఒత్తిడి ఫీలవుతున్నారు. కానీ ఉన్న పరిస్థితుల నుంచి బయటపడడం అంత కష్టమేమీ కాదు. చేసే పనిని ఇంకా ప్రేమించండి. పట్టుదల, ఏకాగ్రతతో పనిని పూర్తి చేయండి. తప్పకుండా అద్భుతాలు చూస్తారు.


వృశ్చికం (Scorpio) – మీ వద్ద చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిలో దేనిని ఎంచుకోవాలన్నది కాస్త ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏర్పడే బంధాలు ప్రొఫెషనల్‌గానే కాదు.. పర్సనల్‌గా కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి.


ధనుస్సు (Saggitarius) – మీ జీవితంలో ఒక ఛాలెంజింగ్ దశ ముగిసింది. ఇప్పుడు ప్రశాంతమైన సమయం మొదలైంది. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం మీ చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయని గ్రహించండి. మీ ప్రతిభ, నైపుణ్యాలపై మీరు నమ్మకం ఉంచండి.


మకరం (Capricorn) – ప్రస్తుతం మీకు కలిగే అపజయాలను చూసి నిరుత్సాహపడకండి. ధైర్యంగా మీ కోసం మీరు నిలబడండి. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. మీ జీవితంపై నియంత్రణ మీ చేతుల్లోనే ఉండాలని గుర్తుంచుకోండి.


కుంభం (Aquarius) –  మీకున్న నైపుణ్యాలు, ప్రతిభ, తెలివితేటలతో చక్కని అనుభవాలను మాత్రమే కాదు.. విజయాలను కూడా సాధించగలరు. వాటి ద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. మీరు ఒకవేళ మీ జాబ్ లేదా కెరీర్ మార్చుకోవాలని అనుకుంటే అందుకు ఇదే సరైన సమయం.


మీనం (Pisces) – మీరు త్వరలో పెళ్లి లేదా రొమాంటిక్ జీవితాన్ని ఆస్వాదించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక  సుదీర్ఘమైన ప్రేమ బంధాన్ని కొనసాగించే దిశగా మీరు పయనించే సమయం వచ్చింది. కనుక.. ఆ దిశగా మీరు ఆలోచించండి. మీరు వివాహితులైతే.. కొన్నాళ్లు ఆఫీసుకి సెలవు పెట్టి.. ఏదైనా రొమాంటిక్ ప్రాంతానికి మీ భాగస్వామిని తీసుకెళ్లండి.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు.. మీ బంగారు భవిష్యత్తుకు వేస్తాయి బాటలు..


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?