ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ గమ్యాన్ని మీరే నిర్దేశించుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ గమ్యాన్ని మీరే నిర్దేశించుకోండి..!

ఈ రోజు (ఏప్రిల్ 21) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (Horoscope and Astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇంకా ఏం జరగాలి? ఎలా జరగాలి?? అనే వాటి గురించి ఆలోచించండి. అందుకు అవసరమైన మార్పులు ఇప్పుడే చేసుకోండి. అప్పుడే మీ కలలు మీరు అనుకున్నట్లు నెరవేరుతాయి.


వృషభం (Tarus) – మీ ఆర్థిక వ్యవహారాలు సర్దుకోవాలంటే మీకు వచ్చే ఆదాయం, మీ ఖర్చులను ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీ కుటుంబ సభ్యులు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో సమయం గడుపుతున్నారో లేదో చూసుకోండి. అప్పుడే మీకు ఒత్తిడి ఉండదు.


మిథునం (Gemini) – మీ జీవితంలో కొత్త ప్రారంభాలకు ఇది సమయం. మీ జాబ్ లేదా కెరీర్‌లో మార్పు కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే.. అందుకు ఇదే సరైన సమయం. మీ కొత్త జీవితం మొదలుపెట్టడానికి చక్కని సమయం ఇది.


కర్కాటకం (Cancer) –  ఇతరుల ప్రేమను అందుకోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక బంధానికి కట్టుబడి ఉండేవారు.. ఆ బంధంలో మరింత లోతైన ప్రేమను చూస్తారు. అలాగే ఇంకొందరు కొత్త ప్రేమను వెతుక్కుంటారు. ఏది ఏమైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.


సింహం (Leo) – ప్రస్తుతం మీరు ఉన్న దశ ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రేమించిన వ్యక్తులకు సహాయం చేసేందుకు మీరెప్పుడూ సిద్ధంగా ఉండండి. వారికి మీ విలువైన సమయం, డబ్బు, ప్రతిభను అందించండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులే.. మిమ్మల్ని కాపాడతాయి.


క‌న్య (Virgo) – మీ మనసులో ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలకు, మీరు చెప్పే మాటలకు తేడా ఏమైనా ఉంటుందా?? ఒక్కసారి సరిచూసుకోండి. రెండూ ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడండి. అప్పుడే మీ లక్ష్యాలను మీరు సాధించగలరు.


తుల (Libra) – మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న సంతోషాలు, వసతులు, అందిన ఆశీర్వాదాల పట్ల సంతోషంగా ఫీలవ్వండి. అలాగే ఏ అంశాన్నైనా పాజిటివ్‌గా ఆలోచించేందుకు ప్రయత్నించండి. అప్పుడే ఫలితం కూడా సానుకూలంగా వస్తుంది.


వృశ్చికం (Scorpio) – మీరు ఊహించిన వ్యక్తుల నుంచే కాదు.. ఊహించని వ్యక్తుల నుండి కూడా మీకు సహాయం అందుతుంది. మీ కలలను సాకారం చేసుకోవడం లేదా అనుకున్నది సాధించడంలో మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు ఏదో ఒక రకంగా సహాయపడతారు. కాబట్టి సహాయాన్ని స్వాగతించండి.


ధనుస్సు (Saggitarius) – మీరు చేసే పనులు కేవలం మిమ్మల్నే కాదు.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేయండి.


మకరం (Capricorn) – మీ జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో జీవించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీరు కేవలం ఒకే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మిగతా అంశాల విషయంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వండి.


కుంభం (Aquarius) – మీ జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో జీవించేందుకు ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ రోజువారీ పనులను కూడా ఒక క్రమపద్ధతిలో చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజు మీరు చేసే ప్రతి చిన్న పని పై పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యం.


మీనం (Pisces) – మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. అవి మీకే కాదు.. మీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీకున్న అభిప్రాయాలు, విలువల ఆధారంగా ఇతరుల విషయాల్లో నిర్ణయాలు తీసుకోకండి.


Credit : Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


ఈ రోజు రాశిఫలాలు.. మీ బంగారు భవిష్యత్తుకు వేస్తాయి బాటలు..