ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. మీ భవితకు బాటలు వేసుకోండి..

ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. మీ భవితకు బాటలు వేసుకోండి..

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీకు సహనం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ సహనం అంటే కేవలం సమయం విషయంలోనే కాదు.. ఇతరులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా వారిని తిరిగి ఏమీ అనకపోవడం కూడా సహనమే. వ్యక్తుల పట్ల సహనం కలిగి ఉండడం కూడా అవసరమే.


వృషభం (Tarus) – మీ కలలన్నీ త్వరలో నిజం కానున్నాయి. కానీ అందుకు మీరు చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాల్సి ఉంటుంది. జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకుంటున్నారు. జాగ్రత్తగా ముందుకు వెళ్లండి.


మిథునం (Gemini) – ఇటీవల మీకు ఎదురైన అనుభవాలన్నీ మీ శక్తి, సామర్ధ్యాలను మీకు తెలియజేయడానికే అని గుర్తించండి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా నిర్దయగా ఉండకండి. మీ కలలన్నీ త్వరలో సాకారం కానున్నాయి.


కర్కాటకం (Cancer) – మీకు తగిలిన దెబ్బలు కాలక్రమేణా మానిపోతాయి. అవి మిమ్మల్ని మరింత బలంగా చేస్తాయి. అలాగే ఓ కొత్త వ్యక్తిలా మిమ్మల్ని మారుస్తాయి. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభించండి.


సింహం (Leo) – మీ మనసు, బుర్రలో మీరేదో చాలా బలంగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించకూడదని మీకు కూడా తెలుసు. అందుకే ఈసారి మీ తప్పులను మీరు అంగీకరించి వాటిని అక్కడితో వదిలిపెట్టేయండి.


క‌న్య (Virgo) – ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న పరిస్థితులకు కారణం మీ గతంలోనే ఉందని గ్రహించండి. కాబట్టి ఒక్కసారి గతంలోకి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. అడ్డంకులు తొలగించుకోండి.


తుల (Libra) – మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఎంజాయ్ చేసే సమయం ఇది. పని, వ్యక్తిగత జీవితాలను బ్యాలన్స్ చేయడం నేర్చుకోండి. మీరు వెళ్లే మార్గం మరింత సులభతరంగా ఉంటుంది.


వృశ్చికం (Scorpio) – మీరు ఏ పని చేయాలనుకున్నా దాని గురించి పాజిటివ్ గానే ఆలోచించండి. ఫలితంగా సానుకూలమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీ బుర్రలో ఉన్న ఎలాంటి ఆలోచనకైనా ఇది వర్తిస్తుంది.


ధనుస్సు (Saggitarius) – మీ మెదడులో ఉన్న ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. వాటిని తక్షణమే అమల్లో పెట్టండి. ఇందులో అసలు జాప్యం చేయడం మంచిది కాదు.


మకరం (Capricorn) – మీ జీవితంలో ఇప్పుడు మీరు చాలా కీలక దశలో ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత మీరు చింతించాల్సి ఉంటుంది.


కుంభం (Aquarius) – మీ బుర్రలో ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నింటినీ తీసేయండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే లేదా ప్రతి పనిలోనూ వెనక్కి లాగే వారి నుంచి దూరం జరగండి. మీ చుట్టూ ఎప్పుడూ సంతోషంగా ఉన్నవారినే ఉండనీయండి.


మీనం (Pisces) – చాలామంది వ్యక్తుల నుంచి ఆశీర్వాదాలు, బహుమతులు అనేక రూపాల్లో మీ వద్దకు చేరనున్నాయి. గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. మీకు ప్రేమ అందించే వారి గురించి ఆలోచించండి.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు.. మీ బంగారు భవిష్యత్తుకు వేస్తాయి బాటలు..


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?