ఈ రోజు రాశిఫ‌లాలు తెలుసుకోండి.. బంగ‌రు భ‌విత‌కు ప్రణాళిక‌లు వేసుకోండి..!

ఈ రోజు రాశిఫ‌లాలు తెలుసుకోండి.. బంగ‌రు భ‌విత‌కు ప్రణాళిక‌లు వేసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - ఎదుటివారు ఏం చెప్తున్నార‌నేదాని కంటే వారి బాడీ లాంగ్వేజ్ పై దృష్టి పెట్టండి. ఎందుకంటే కొంద‌రు ఒక‌టి మాట్లాడినా వారి మ‌న‌సులో ఉండేది వేరుగా ఉంటుంది. ఎవ‌రినీ గుడ్డిగా నమ్మేయ‌కండి. ఎదుటివారు ఇచ్చే సంకేతాల‌పై దృష్టి పెట్టండి.


వృషభం (Tarus) - మీ ఆరోగ్యం బాలేద‌ని చింతిస్తున్నారా? అయితే బాధ‌ప‌డ‌కండి. త్వ‌ర‌లోనే అది స‌ర్దుకుంటుంది. ఆరోగ్యం మాత్ర‌మే కాదు.. మీ ఆర్థిక వ్య‌వ‌హారాలు, అనుబంధాలు అన్నీ క్రమంగా స‌ర్దుకుంటాయి.


మిథునం (Gemini) - ప్రేమ‌దూత‌లు మీకు అనేక ర‌కాలుగా సందేశాలు పంపుతున్నారు. మీకు వ‌చ్చే సంకేతాల‌పై మీరు దృష్టి పెట్టండి.


కర్కాటకం (Cancer) - ప్రేమదేవత మిమ్మ‌ల్ని చేరుకునేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. అది ప‌ని విష‌యంలో మీరు వినే శుభ‌వార్త రూపంలో కావ‌చ్చు లేదా మీ జీవిత భాగస్వామిని క‌లుసుకోవ‌డం కావ‌చ్చు. మీకు ప్రేమ త‌ప్ప‌కుండా ఏదో ఒక బ‌హుమ‌తిని అందిస్తుంది.


సింహం (Leo) - మీరు ఈ రోజు చాలా ఎమోష‌న‌ల్‌గా, సెన్సిటివ్‌గా ఫీల్ అవ్వ‌చ్చు. మీ మ‌న‌సులో ఉన్న భావాలను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. సిగ్గుతో వాటిని దాచేయ‌కండి. మీ మ‌న‌సులో ఉన్న‌ది ధైర్యంగా చెప్పండి.


క‌న్య (Virgo) - మీ మ‌న‌సులో ఉన్న చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా మీలోనే ఉన్నాయి. కాస్త ప్ర‌శాంతంగా ఆలోచించి చూడండి. అలాగే మీకు ఇత‌రుల నుంచి బ‌హుమ‌తులు కూడా అందే అవ‌కాశాలున్నాయి.


తుల (Libra) - ఇత‌రులు చేసే నెగెటివ్ కామెంట్స్ లేదా ప‌రుష‌మైన ప‌ద‌జాలం నుంచి మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోండి. మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించే వ్య‌క్తుల నుంచి దూరంగా ఉండండి. ఆ నెగెటివిటీ మీ క్రియేట‌విటీని ప్ర‌భావితం చేయ‌చ్చు.


వృశ్చికం (Scorpio) - మీ చుట్టూ ఉన్న‌వారిలో ఒక‌రికి మీ స‌హాయం అవ‌స‌రం అవుతుంది. త‌ప్ప‌కుండా స‌హాయ‌ప‌డండి. ఇలా ఏమీ ఆశించ‌కుండా స‌హాయ‌ప‌డితే మీరు విజ‌యం సాధించేందుకు అనుకూల‌మైన పరిస్థితులు సానుకూలంగా మార‌తాయి.


ధనుస్సు (Saggitarius) - మీకు ఉన్న బాధ‌ల‌న్నింటినీ ఒక పేప‌ర్ పై రాయండి. ఆ త‌ర్వాత వాటిని బిగ్గ‌ర‌గా బ‌య‌ట‌కు చ‌దివి, పేప‌ర్ చింపేయండి. ఆ త‌ర్వాత మీకేం కావాలో ఒక పేపర్ పై రాసి దానిని భ‌ద్ర‌ప‌రుచుకోండి.


మకరం (Capricorn) - ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోండి. అతిగా పని చేయ‌డం లేదా ఒత్తిడికి గురి కావ‌డం ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని రోజులు డీటాక్స్ డైట్ ఫాలో అవ్వండి. అలాగే నెగెటివ్ ఆలోచ‌న‌లు రానీయ‌కండి.


కుంభం (Aquarius) - మీ మ‌న‌సులో ఉన్న ఇష్టాలు, అయిష్టాల గురించి ఎదుటివారికి సున్నితంగా చెప్పండి. అంతేకానీ మీ మాట‌ల‌కు వారు నొచ్చుకుంటార‌ని మాట్లాడ‌డం మానేయ‌ద్దు. మీ భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌డం చాలా ముఖ్యం.


మీనం (Pisces) - మీరేం చేయాలో మీ మ‌న‌సుకు బాగా తెలుసు. కానీ ఏదో మూల మీపై మీకు ఉన్న అప‌న‌మ్మ‌కం మిమ్మ‌ల్ని అడ్డ‌గిస్తోంది. లాజిక్స్ గురించి ప‌క్క‌న పెట్టి మీరు చేయాల‌నుకున్న‌ది చేయండి. మీ మ‌న‌సు మాట వినండి.


ఇవి కూడా చదవండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ అదృష్టం గురించి తెలుసుకోండి..!