ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీ జీవితంలో మీరు ఆస్వాదిస్తున్న వాటిని సంపాదించుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారు. అయితే ఆ కష్టానికి ప్రతిఫలం కేవలం అక్కడితో ఆగిపోతు. మరిన్ని మంచి ఫలితాలను మీరు పొందనున్నారు.

వృషభం (Tarus) – మీకున్న నైపుణ్యాలను ఉపయోగించి మీరు ఏమైనా సాధించగలరు. మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి శ్రమించి పని చేస్తే గుర్తింపు, ప్రతిఫలం వాటంతటవే మీ వద్దకు వస్తాయి.

మిథునం (Gemini) – మీకున్న పరిస్థితులు లేదా వనరుల కారణంగా మీరు ఇబ్బందిగా ఫీలవ్వచ్చు. కానీ ఉన్నచోటే ఆగిపోకుండా జాగ్రత్తపడండి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడండి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో మీకు సహాయం చేసేందుకు చాలామంది ముందుకు వస్తారు. మీకు అవకాశాలు వస్తున్నా వాటిపై మీరు సరైన దృష్టి పెట్టడం లేదు. కొన్ని మార్పులకు మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.

సింహం (Leo) – మీ ఏకాగ్రతను చెదిరిపోనీయకండి. దాని కారణంగా మీకు బోలెడన్ని అవకాశాలు రావడం మాత్రమే కాదు.. విజయాలు కూడా వరిస్తాయి. అలాగే కొన్న ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. అనవసర విషయాలు, వ్యక్తుల గురించి ఆలోచించి మీ సమయం వ్యర్థం చేసుకోకండి.

క‌న్య (Virgo) – మీ కష్టేంచే తత్వం, ఏకాగ్రత మీకు విజయాన్ని అందిస్తాయి. అంతేకాదు.. ఆర్థికంగా కూడా స్థిరత్వం సంపాదిస్తారు. అలాగే మీరు ఈ రోజు పెళ్లి, నిశ్చితార్థం లేదా సీమంతం.. వంటి శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

తుల (Libra) – పరిస్థితులను అధికంగా విశ్లేషించడం వల్ల మీ సమస్యలకు పరిష్కారాలు లభించకపోవచ్చు. వాటి నుంచి బయటకు వచ్చి, మీ మైండ్ డైవర్ట్ చేసుకోండి. మీకు కూడా ఒక స్పష్టత వస్తుంది. మీ సమస్యలు కూడా వాటంతట అవే ఓ కొలిక్కి వస్తాయి.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – మీరు నమ్మే వ్యక్తులు లేదా సిద్ధాంతాలకు సపోర్ట్ అందించండి. మీరు చెప్పే మాటలు కొన్ని పరిస్థితులతో పాటు, పలువురు వ్యక్తులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతూ, తెలివిగా కమ్యూనికేట్ చేయండి.

ధనుస్సు (Saggitarius) – మీ జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉండచ్చు. మీరు బిజీగా ఉంటూ ఉండవచ్చు. అందుకు మీరు సంతోషించండి. కొన్ని కష్టమైన పనులను ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకు వెళ్లండి.

మకరం (Capricorn) – మీ మనసులో ఏమనుకుంటే దానిని మీరు సాధించగలరు. మీ తెలివితేటలు, కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందిస్తాయి. ప్రశంసలు అందేలా చేస్తాయి. ఈ క్రమంలో మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తితో సమయం గడిపితే మరింత సంతోషంగా ఉంటారు.

కుంభం (Aquarius) – మీరు సాధించాలనుకున్నది ఏదైనా సరే.. సులభంగా సాధిస్తారు. ఒకేసారి ఒకటికి మించి ప్రాజెక్ట్స్ టేకప్ చేసే పూర్తిస్థాయి సామర్థ్యం మీకు ఉంది. మీకున్న తెలివితేటలతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది.

ADVERTISEMENT

మీనం (Pisces) – మీ జీవితంలో ఉన్న అనవసరమైన బంధాలు, స్నేహాలకు ముగింపు పలకండి. వాటిని ఇకపై కొనసాగించకండి. వ్యక్తిగతమైనా విషయాలైనా.. ఉద్యోగపరమైనా విషయాలైనా ఈ పద్దతిని తప్పక అనుసరించండి. ముఖ్యంగా మిమ్మల్ని ముందడుగు వేయనీయకుండా వెనక్కి లాగే వారి నుంచి దూరం జరగండి.

ఇవి కూడా చ‌ద‌వండి

 నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను నిర్దేశించుకోండి

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?

ADVERTISEMENT

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..! 

10 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT