ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీరు చేసే ఒక ప‌నిలో పాజిటివ్ అవుట్ పుట్ వ‌స్తుంది. అది మీకు బోలెడంత సంతోషాన్నిస్తుంది. అంతేకాదు.. మ‌నసు నిండా ప్ర‌శాంత‌త‌, ప‌నిలో తృప్తిని కూడా మీకు అందిస్తుంది.

వృషభం (Tarus) – మీరు సాధించాల‌ని అనుకుంటున్న ల‌క్ష్యం దిశ‌గా ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి. అప్ప‌టికే మీరు ఆ మార్గంలో ఉన్నార‌ని మీకు అర్థ‌మ‌వుతుంది. ఆత్మ‌విశ్వాసంతో మీరు అనుకున్నది సాధించండి.

మిథునం (Gemini) – ఎప్ప‌ట్నుంచో ప‌రిష్కారం కాని ఒక స‌మ‌స్య మిమ్మ‌ల్ని బాగా భ‌య‌పెడుతోంది. రాత్రి పూట స‌రిగ్గా నిద్ర కూడా పోనీయ‌డం లేదు. ఆ భయాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. అన్నీ స‌ర్దుకుంటాయి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – మీరు మీ భాగ‌స్వామి ప‌ట్ల ఉన్న ఫీలింగ్స్‌‌ను వారికి చెప్పండి. అన్నీ మీలోనే దాచుకోవ‌డం వ‌ల్ల ఒరిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని గ్ర‌హించండి. మ‌రీ బాధ‌గా అనిపిస్తే మ‌న‌సారా ఏడ్చేయండి. మ‌న‌సు తేలిక ప‌డుతుంది.

సింహం (Leo) – మీ జీవితంలో ఏదైనా కొత్త‌ది ప్రారంభించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. ఇందుకు స‌మ‌యం మాత్ర‌మే కాదు.. ప్రేమ కూడా అనుకూలంగా ఉంది. మీ మ‌న‌సుకు అయిన గాయాల‌ను మాన్పుతుంది.

క‌న్య (Virgo) – మీకు ప‌రిచ‌య‌మైన ఒక కొత్త వ్య‌క్తితో ఏర్ప‌డిన బంధం చూసి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు. వారు మీ జీవితాన్ని ప్రేమ‌, ఆనందంతో నింపేస్తారు. మీ బాధ‌లు కూడా సంతోషాలుగా మారిపోతాయి.

తుల (Libra) – మీరు మాన‌సికంగా చాలా దృఢంగా ఉంటారు. కానీ మ‌రింత దృఢంగా మిమ్మ‌ల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు దానిపై దృష్టి పెట్టండి. మీ మ‌న‌సు ఏం చెబుతుందో వినండి.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – మీరు ప్ర‌యాణించ‌డానికి ఎంచుకున్న మార్గం కొత్త‌దే అయిన‌ప్ప‌టికీ మీకు చ‌క్క‌ని అనుభ‌వాన్ని మిగుల్చుతుంది. అయితే మిమ్మ‌ల్ని మీరు వీలైనంత ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవ‌డం మంచిది.

ధనుస్సు (Saggitarius) – ఎమోష‌న‌ల్‌గా మీకు ఎదురైన ఒత్త‌ిడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. తిరిగి మీలో ఉత్సాహాన్ని నింపుకోండి. ఒకప్పటి బాధాక‌ర‌మైన జ్ఞాప‌కాల‌ను విడిచి వ‌ర్త‌మానం గురించి ఆలోచించడం మొద‌లుపెట్టండి. మ‌న‌సును తేలిక‌ప‌రుచుకోండి.

మకరం (Capricorn) – మీ భాగ‌స్వామి మీకు ఇచ్చిన మాట‌లు అన్నీ నెర‌వేర్చ‌క‌పోవ‌చ్చు. ఈ క్రమంలో మీరు కాస్త నిరుత్సాహానికి గురి కావ‌చ్చు. కాబ‌ట్టి మీ చుట్టూ ఉండే వారి విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. వారు చెప్పే మాట‌ల‌పై కాకుండా బాడీ లాంగ్వేజ్ పై దృష్టి పెట్టండి. నిజాలు మీకే తెలుస్తాయి.

కుంభం (Aquarius) – మీరు త్వ‌ర‌లో ఒక స్పెష‌ల్ ప్ర‌దేశానికి ప్ర‌యాణించాల్సి రావ‌చ్చు. మీకు వ‌చ్చే ఒక సాధార‌ణ ఆలోచ‌న‌ను భిన్నమైన కోణం నుంచి చూడ‌డం ద్వారా మీ జీవితాన్నే మార్చుకునే అవ‌కాశం ఉంది.

ADVERTISEMENT

మీనం (Pisces) – మీరు ఉన్న చోటే ఆగిపోయాన‌ని బాధ‌ప‌డుతున్నారా? అయితే అది కేవ‌లం మీ ఊహ మాత్ర‌మే. మీ మ‌న‌సులో ఉన్న భ‌యాన్ని ప‌క్క‌న పెడితే వృద్ధి అదే క‌నిపిస్తుంది. క్ష‌మించి, మ‌రిచిపోవ‌డం కూడా అల‌వాటు చేసుకోండి.

ఇవి కూడా చ‌ద‌వండి

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భవిష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

ADVERTISEMENT

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?

05 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT