నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను నిర్దేశించుకోండి

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను నిర్దేశించుకోండి

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీరు కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. కొందరు బిజినెస్ కోసం ప్రయాణించాల్సి రావచ్చు. ఇంకొందరు తీరిగ్గా, సరదాగా ప్రయాణించాల్సి రావచ్చు. కాబట్టి మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.


వృషభం (Tarus) – ఇతరులు బాధపడకూడదనే ఉద్దేశంతో మీరు కొన్ని ఎమోషన్స్‌ను మీలోనే దాచేసుకుంటున్నారు. కానీ మీ భావనలు వారికి తెలియజేయకపోతే మీ మధ్య ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఎమోషన్స్‌ను బయట పెట్టండి.


మిథునం (Gemini) – మీరు ఇప్పుడు ఏం చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీకున్న పట్టుదల, కష్టపడే తత్వానికి చక్కని రివార్డులు మిమ్మల్ని వరిస్తాయి. వాటి ద్వారా మీరు అనుకున్నది సాధించడం చాలా సులభం అవుతుంది.


కర్కాటకం (Cancer) – మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మీకు మంచి సమయం నడుస్తోంది. మీరు అనుకున్నది సాధించడానికి గల మార్గాలు అన్వేషించి కాస్త శ్రమిస్తే చాలు.. విజయం మీ సొంతం అవుతుంది.


సింహం (Leo) – మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రండి.. కాస్త రిస్క్ తీసుకుని మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు జీవితంలో ఏదైనా ఒకటి కావాలంటే అందుకు మనం శ్రమించాల్సిందే..


క‌న్య (Virgo) – మీరేం చేయాలనుకున్నా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యేకించి ప్రణాళిక రూపొందించుకొని అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అన్నీ సర్దుకునే వరకు సహనంతో వ్యవహరించండి.


తుల (Libra) – ప్రస్తుతం మీరున్న పరిస్థితులను బట్టి, వ్యక్తులకు ఎమోషనల్‌గా అటాచ్ అవ్వకండి. అప్పుడే మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోగలరు. వాటి నుంచి మరిన్ని జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సమస్యలను పరిష్కరించుకోండి.


వృశ్చికం (Scorpio) – మీకు ఓ వ్యక్తి దూరం కావడం వల్ల మీరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యారు లేదా మీరు అనుకున్నది జరగకపోవడం కూడా మీరు డిస్టర్బ్ కావడానికి కారణం కావచ్చు. బాధపడండి. కానీ తర్వాత దానిని అక్కడితో వదిలేయండి.


ధనుస్సు (Saggitarius) – మీ భవిష్యత్తు కోసం మీరు బలంగా పునాదులు వేసుకుంటున్నారు. మీలో కొందరు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు లేదా ఉన్న ఇంటికే చిన్న చిన్న మార్పులు చేయచ్చు. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలను కూడా చక్కబెట్టుకుంటారు.


మకరం (Capricorn) – మీకున్న డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఉన్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ లేదా బంగారం కొనుగోలు చేస్తారు. మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. మీ నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు.


కుంభం (Aquarius) – మీరు చేసే పని ద్వారా మీకు విజయం, ప్రశంస, డబ్బు దక్కుతాయి. కాబట్టి మీదైన నిజాయితీతో ఏమీ ఆశించకుండా పని చేయండి. అలాగే ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెట్టండి.


మీనం (Pisces) – మీరు మీ ఆలోచనలు, కలలను ఎవరితో పంచుకుంటున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే అందరి ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు. కాబట్టి మీ నమ్మకాలకు మీరు కట్టుబడి ఉండండి. మీరు సాధించాలనుకున్నది సాధించండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫ‌లాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేసుకోండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!