నేటి రాశిఫ‌లాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేసుకోండి

నేటి రాశిఫ‌లాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేసుకోండి

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - ధ్యానం చేయడం, ఏకాగ్రతతో ఆలోచించడం ద్వారా.. మీకంటూ మీరు పెట్టుకున్న వ్యక్తిగత లక్ష్యాల గురించి ఒకసారి గుర్తుతెచ్చుకోండి. అవసరమైతే వాటిని సాధించే దిశగా మీ ఆలోచనలను మార్చుకోండి. అలాగే అందుకు తగ్గట్లుగా మీ ప్రాధాన్యాలను మార్చుకోండి. మీలానే ఆలోచించే వ్యక్తులతో కలిసి పని చేయండి.


వృషభం (Tarus) – కమ్యూనికేషన్ సరిగా లేని కారణంగా మీకు, ఇతరులకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ఇతరుల కోణం నుంచి కూడా సమస్యను చూస్తే పరిష్కారం సులభమే అని గుర్తుంచుకోండి.


మిథునం (Gemini) – మీ జీవితంలో మార్పులకు కారణమయ్యే ఒక వ్యక్తిని మీరు ఈ రోజు కలుసుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా మిమ్మల్ని వారు ప్రోత్సహిస్తారు. అయితే మీరు కూడా ఈ క్రమంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది.


కర్కాటకం (Cancer) – మీరు ఇప్పుడు ఏ పని చేపట్టినా అందులో విజయం తప్పక సాధిస్తారు. మీకు ఉన్న శక్తి, సామర్థ్యాలతో మీరు అనుకున్నది ఏదైనా సాధించగలరని మీరు బలంగా నమ్మండి. పనికి సంబంధించి మీరు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త అంశాలు నేర్చుకోవడం మంచిది.


సింహం (Leo) – మీరు ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. అయినాసరే.. మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నారు. మీరు చేపట్టే పనులు, బాధ్యతల విషయంలో బాధ్యతాయుతంగా మెలగండి. ఈ క్రమంలో ఇతరుల పట్ల నిర్లక్ష్యం వహించకండి.


క‌న్య (Virgo) – మీకు స్పష్టత వచ్చే కొద్దీ జీవితంలో వచ్చే మార్పులు మీకు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మీ జీవితంలో మీకు ఏం కావాలో స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఏమైనా మార్చుకోవాలంటే ఇదే సరైన సమయం.


తుల (Libra) – మీరు చేసే పనులు ఒక్కసారి ఆపి ఇప్పటి వరకు మీరు సాధించిన దానికి మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీరు సాధించాల్సింది ఇంకా ఉన్నా సరే.. ఈ క్షణాన్ని ఆస్వాదించడం కూడా ముఖ్యమే


వృశ్చికం (Scorpio) – మీరు విజయానికి అతి చేరువలో ఉన్నారు. అయితే దానిని సాధించేందుకు మీరు మరింత శ్రమించాల్సి ఉంటుంది. మీరు సాధించే ఈ విజయం మీకే కాదు.. ఇతరులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.


ధనుస్సు (Saggitarius) – మీ మనసులోని భావనలను మీలోనే దాచేసుకోకండి. వాటిని ఇతరులతో పంచుకోండి. ఇతరుల విషయంలో మీకు ఉన్న హద్దులేంటో వారికి ముందే స్పష్టంగా తెలియజేయండి.


మకరం (Capricorn) – మీరు దేనికోసం అయితే పోరాడుతున్నారో అది మీకు చాలా చేరువలో ఉంది. మీరు ఎంచుకున్న దారి కాస్త కష్టంగా అనిపించవచ్చు. అలాగే ఇప్పటికే మీరు అలసిపోయి ఉండచ్చు. అలాగని మీరు అనుకున్నది సాధించకుండా మధ్యలో వదిలిపెట్టకండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.


కుంభం (Aquarius) – భవిష్యత్తుకు సంబంధించి మీకు ఏమైనా భయం ఉందా? అయితే మీరు ఇరకాటంలో పడినట్లే. అనవసరంగా మీ గురించి మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుస్తాయి.


మీనం (Pisces) – మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు అందే సమయం ఇది. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా బాధిస్తుంటే మీరు మానసికంగా బలంగా ఉండగలరని నమ్మండి. మీపై మీరే ఆధారపడండి. కాస్త సమయం తీసుకుని జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


 నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!