మేమిద్దరం మొదటిసారి.. ఎలా రొమాన్స్ చేశామంటే..?

మేమిద్దరం మొదటిసారి.. ఎలా రొమాన్స్ చేశామంటే..?

మా ఇద్దరికీ పెళ్లయి ఓ ఏడాది కావస్తోంది. మాది ప్రేమ వివాహం. పైగా ఇద్ద‌రికీ ఒక‌రంటే మ‌రొక‌రికి చాలా ఇష్టం. అయితే శారీర‌కంగా (sex) మాత్రం మేం ఎప్పుడూ ద‌గ్గ‌ర కాలేదు. అందుకోసం మేం పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. అత్త, మామలతో పాటు ఇతర బంధువులు కూడా ఇంట్లోనే ఉండేవారు.


దాంతో మేమిద్ద‌రం క‌లిసి రొమాంటిక్‌గా ముచ్చటించుకోవడానికి లేదా ప్రేమగా కబుర్లు చెప్పుకోవడానికి అయ్యేది కాదు. అంత  ప్రైవ‌సీ ఉండేది కాదు. అలాంటప్పుడు.. ఆ చిన్న ఇంటిలోనే.. అవకాశం దొరికినప్పుడు చిన్న చిన్న ముద్దు ముచ్చ‌ట్ల‌తోనే స‌రిపెట్టుకునేవాళ్లం.


కానీ ఓసారి మా ఇద్ద‌రికీ ఏకాంతంగా క‌లిసి స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ల‌భించింది. మావారి త‌ల్లిదండ్రులు ఓ రోజు తీర్థయాత్రలకు వెళ్లారు. అలాగే మిగతా వారు కూడా ఇంటిలో ఎవరూ లేరు. దాంతో మా ఇద్ద‌రికీ బోలెడంత ప్రైవ‌సీ ల‌భించింది. ఈ విష‌యం అత‌ను నాకు చెప్ప‌గానే ఎగిరి గెంతేయాల‌ని అనిపించింది. 


అనుకున్న ప్ర‌కార‌మే ఆ రోజు మామూలుగా ఆయన ఆఫీసుకి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత సాయంత్రం ఇంటికి వేగంగా వచ్చేశారు. అప్ప‌టికే నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను. అతను ఫ్రెషప్ అయ్యి వచ్చేవరకూ.. కాసేపు రిలాక్స్ అయ్యాను. తర్వాత మేమిద్దరం కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పుకున్నాం.


ఆ ముచ్చట్లు అలా కొనసాగుతుండగానే.. ఆయన న‌న్ను గ‌ట్టిగా వాటేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత చెంప‌లు, మెడ‌.. ఇలా నా శరీరంపై వివిధ చోట్ల ముద్దులు పెడుతూ.. తర్వాత కొద్దికొద్దిగా కింద‌కు వెళ్ల‌డం మొద‌లుపెట్టాడు. ప్రేమ వ‌ర్షంలో త‌డుస్తూ, ముద్ద‌ులలో మునిగిపోయి త‌న్మ‌య‌త్వంతో ఉన్న‌ప్ప‌టికీ.. అత‌ను మ‌రింత కింద‌కు వెళ్ల‌కుండా ఆపి.. "ఏం చేస్తున్నావు.. ఆపు.. వ‌ద్దు.." అన్నా.


"ఏమీ కాదు.. భ‌య‌ప‌డ‌కు.... న‌న్ను న‌మ్ము.". అంటూ నాకు స‌మాధాన‌మిస్తూనే నన్ను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. తన పెదవులతో నా పెదవులను పెనవేసుకొని.. ముద్దులు పెడుతూ.. నా అనువనువూ స్పృశించాడు. అంతే.. ఆ ప‌ర‌వ‌శంలోనే ఇద్ద‌రం ఒకరితో ఒకరం ఏకమై.. గ‌ట్టిగా కౌగిలించుకుంటూ ఆ క‌ల‌యికను ఆస్వాదించ‌డం మొద‌లుపెట్టాం.


ఆ త‌ర్వాత మా మధ్యసాగిన ప్రేమ ప్రయాణం.. ఆ రొమాంటిక్ అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిది. అంత‌టి ఆనందం ఇంకెప్పుడూ నాకు క‌ల‌గ‌లేదు. అందుకే అత‌నిపై ముద్దుల వ‌ర్షం కురిపిస్తూనే ఉన్నాను. ఆ రాత్రంతా ఇద్ద‌రం ఎన్నిసార్లు అలా క‌లిశామో.. ఎంత సంతోషాన్ని మూట‌గ‌ట్టుకున్నామో మాకే తెలుసు..!


ఇప్పటికీ రోజూ మేము ఇలాంటి మ‌ధురానుభూతులు పంచుకుంటూనే ఉంటాం. కానీ మొట్ట‌మొద‌టిసారి (first time) చేసిన సెక్సువల్ రొమాన్స్.. దానిని ఆనందించిన ఆ క్ష‌ణాల‌ను మాత్రం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం!


ఇవి కూడా చ‌ద‌వండి


శృంగారం జరిపే సమయంలో మెద‌డులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో తెలుసా..?


ముద్దు మధురిమలు ఆస్వాదించాలంటే.. ఇలా కిస్ చేయాల్సిందే..!


మొద‌టిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలివే..!