నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీకు ఎవ‌రితోనైనా త‌గాదాలు ఉంటే వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. అవ‌స‌ర‌మైతే కాంప్ర‌మైజ్ అవ్వండి. అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఎవ‌రితోనూ వాద‌న‌ల‌కు, చ‌ర్చ‌ల‌కు దిగ‌కండి.


వృషభం (Tarus) - మీ శ్ర‌మ‌ని ఎంజాయ్ చేయ‌డానికి, దానికి త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని పొందే స‌మ‌యం ఇది. మ‌రీ ప‌నికే అంకిత‌మైపోయి మీ సంతోషాన్ని వ‌దులుకోకండి. రెండింటినీ బ్యాల‌న్స్ చేస్తూ ఆనందంగా జీవించండి.


మిథునం (Gemini) - మీ ఆర్థిక వ్య‌వ‌హారాలు క్ర‌మంగా మెరుగ‌వుతాయి. ఇప్పుడు మీరు ఆలోచించి తీసుకునే నిర్ణ‌యాలు భ‌విష్య‌త్తులో మీకు గొప్ప లాభాల‌ను ఆర్జించి పెడ‌తాయి. ఆర్థికంగా స‌హాయం అందుతుంది.


కర్కాటకం (Cancer) - మీరు చేస్తున్న ప‌ని ఆపి మీ ప్రాధాన్యాలేంటో ఒక లిస్ట్ రాయండి. ఈ క్ర‌మంలో మీ గ‌ర్వాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేయండి. మీకు ఏది ముఖ్య‌మో దానిపైనే దృష్టి పెట్టండి. అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప‌ని విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి.


సింహం (Leo) - మీరు ఈ రోజు ఒక న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిని క‌లుసుకుంటారు. వారు అందించే స‌హాయాన్ని మీరు మ‌న‌స్ఫూర్తిగా స్వీక‌రించండి. మీకు తెలిసిన వారే స‌హాయం చేసి, మీలో ప్రేర‌ణ క‌లిగించ‌వ‌చ్చు.


క‌న్య (Virgo) - మీకు ఏ బంధం నుంచి సంతోషం ల‌భిస్తుందో ఆ బంధాల‌ను నిర‌భ్యంత‌రంగా కొన‌సాగించండి. అలా కాకుండా అన్ని బంధాల విష‌యంలోనూ స‌ర్దుకుపోతే ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. కాబ‌ట్టి విడిచిపెట్టాల్సిన వాటికి ఇక‌నైనా స్వ‌స్తి ప‌ల‌కండి.


తుల (Libra) - మీకంటూ ఓ ల‌క్ష్యంతో అలుపెర‌గ‌కుండా మీరు క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే మీరు అనుకున్న‌ది సాధించేందుకు మీకు ఒక‌రు స‌హాయ‌ప‌డ‌తారు. మీరు కూడా వారికి స‌హాయం అందిస్తేనే వారి ల‌క్ష్యాలు కూడా సాధించ‌గ‌లుగుతారు.


వృశ్చికం (Scorpio) - మీరు ఒక శుభ‌వార్త విన‌వ‌చ్చు లేదా లాభ‌దాయ‌క‌మైన స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. మీ జీవితంలో మ‌రింత మంచి జ‌రిగేందుకు కావాల్సిన మార్పులు త్వ‌రలో చోటు చేసుకోనున్నాయి. వాటికి సిద్ధంగా ఉండండి.


ధనుస్సు (Saggitarius) - మీకున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాలు తెలియ‌నున్నాయి. అలాగే మీకున్న అనేక స‌మ‌స్య‌ల‌కు స‌మాధానాలు కూడా తెలుసుకోనున్నారు. ఇప్పుడు మీకు అదృష్ట స‌మ‌యం న‌డుస్తోంది. సంతోషంగా జీవించ‌నున్నారు.


మకరం (Capricorn) - మీరు ఇంత‌కుముందు అస‌లు ఊహించ‌ని వ్య‌క్తిలో మీపై ఉన్న ప్రేమ గురించి తెలుసుకోనున్నారు. ఈ విష‌య‌మై మీరు కాస్త ఓపెన్ మైండ్ తో వ్య‌వ‌హ‌రించడం మంచిది. వారి నుంచి మీకు ఒక గిఫ్ట్, ఉత్త‌రం లేదా సందేశం.. వంటివి స‌ర్ ప్రైజ్ గా అంద‌వ‌చ్చు.


కుంభం (Aquarius) - ప్ర‌తి విష‌యాన్నీ విశ్లేషించి తెలుసుకునే మీ మ‌నస్త‌త్వం మిమ్మ‌ల్ని మ‌రింత లోతుగా ప‌రిశీలించేలా చేస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్న‌వారు మీతో త‌మ‌కు ఎదురైన అనుభ‌వాలు పంచుకుంటూ ఉంటారు. వాటి నుంచి మీరూ ఎంతో కొంత నేర్చుకోండి.


మీనం (Pisces) - మీ ప్ర‌తిభ‌, సృజ‌నాత్మ‌క‌త‌ను వ్య‌క్తం చేసేందుకు మ‌రిన్ని మార్గాల‌ను క‌నుగొనండి. ఇందుకు ఒక‌టి కంటే ఎక్కువ మార్గాలు ఉండ‌డం చాలా మంచిది. ఈ క్ర‌మంలో మీకు స‌హాయ‌ప‌డేవారికి రుణ‌ప‌డి ఉండండి.


ఇవి కూడా చదవండి


ఈ రోజు రాశిఫ‌లాలు తెలుసుకోండి.. బంగ‌రు భ‌విత‌కు ప్రణాళిక‌లు వేసుకోండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!