నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు ఎలా ఉందో తెలుసుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు ఎలా ఉందో తెలుసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీ బంధాన్ని సంర‌క్షించుకునేందుకు మీరు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. మీ బంధంలో మునుప‌టి సంతోషాన్ని నింపుకునేందుకు ప్ర‌య‌త్నించండి. మీ కుటుంబంలో జ‌రిగే శుభ‌కార్యాల‌కు ఇద్ద‌రూ క‌లిసి హాజ‌రుకండి.


వృషభం (Tarus) - ప్ర‌కృతితో కాస్త స‌మ‌యం గ‌డ‌పండి. మీ చుట్టూ మొక్క‌లు ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డండి. మీరు అల‌సిపోయిన‌ట్లుగా మీకు అనిపించ‌వచ్చు. కానీ దీర్ఘంగా శ్వాస తీసుకుని మ‌న‌సులోని బాధ‌ల‌ను విడిచిపెట్టండి. అంతా స‌ర్దుకుంటుంది.


మిథునం (Gemini) - మీరు కోరుకున్న‌వి సాధించ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఈ క్ర‌మంలో మీ చుట్టూ ఉన్న ప్ర‌పంచం కూడా స‌హాయం చేస్తుంది. మీరు వేసే ప్ర‌తి అడుగులోనూ తోడు ఉంటుంది.


కర్కాటకం (Cancer) - మీకు అంద‌రి ఆశీర్వాదాలు అందుతాయి. అయితే అవి ఏ రూపంలోనైనా కావ‌చ్చు. ఫ్రీ లంచ్, రైడ్, సినిమా.. ఇలా ఏదైనా కావ‌చ్చు. అలాగే మీ ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా త్వ‌ర‌లో స‌ర్దుకుంటాయి.


సింహం (Leo) - మీరు అనుకున్న ల‌క్ష్యాన్ని త్వ‌ర‌లో సాధిస్తారు. అయితే అందుకు నిదానంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. ఇత‌రుల‌తో మిమ్మ‌ల్ని పోల్చుకోకుండా మీరు వెళ్లే దారిపై దృష్టి పెట్టండి. స‌రిపోతుంది.


క‌న్య (Virgo) - మీరు ఏం చేశారో మీ మ‌న‌సుకు బాగా తెలుసు. కాబ‌ట్టి ఒక్క‌సారి అన్నింటి గురించీ బాగా ఆలోచించండి. మీరు చేసిన త‌ప్పుల‌ను ధైర్యంగా అంగీక‌రించండి.


తుల (Libra) - మీకు ప్ర‌శ్న‌గా క‌నిపిస్తున్న‌ది మ‌రీ పెద్ద‌దేమీ కాదు. కాస్త దృష్టి పెట్టి ఆలోచించండి. ప‌రిష్కారం మీ చేతిలోనే ఉంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోండి. అన్నీ స‌ర్దుకుంటాయి. భ‌గ‌వంతునిపై న‌మ్మ‌కం ఉంచండి.


వృశ్చికం (Scorpio) - మీకున్న ఆలోచ‌న‌లే ఇప్పుడు మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఏ విష‌యంలోనైనా నిర్ణ‌యం తీసుకోండి. బాధ‌ల‌ను విడిచిపెట్టండి.


ధనుస్సు (Saggitarius) - మీరు ప్రార్థించిన ప్ర‌తి ప్రార్థ‌న‌కు ఫ‌లితం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఒకవేళ మీ మ‌న‌సులో ఇంకా ఏవైనా ప్రార్థ‌న‌ల‌కు ఫ‌లితం లేద‌ని అనిపిస్తే మీరు ఆ దేవున్ని పూర్తిగా న‌మ్మ‌న‌ట్లే!


మకరం (Capricorn) - మీ శ‌రీరాన్ని డీటాక్సిఫై చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యం. గ‌తంలో పెట్టుకున్న హ‌ద్దుల‌ను చెరిపేయండి. వీలైనంత ఎక్కువ‌గా పాజిటివిటీతో వ్య‌వ‌హ‌రిస్తూ మిమ్మ‌ల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయండి. అద్భుతాలు చూస్తారు.


కుంభం (Aquarius) - మీ జీవితం ఎలా ఉండాలో మీరు మాత్ర‌మే నిర్ణ‌యించుకోగ‌ల‌రు. అయితే మీరు త‌ర్వాత ఏం చేయాల‌ని అనే అంశమై ఇత‌రుల అభిప్రాయాలు తీసుకోవాల‌ని చూస్తున్నారు. కానీ మీ జీవితం గురించి మీరు నిర్ణ‌యించుకోవ‌డ‌మే ఉత్త‌మం.


మీనం (Pisces) - మీరు క‌ల‌లు క‌నండి. వాటిని సాకారం చేసుకోవడానికి ప్ర‌య‌త్నించండి. ఎందుకంటే మీకు సంతోషాన్నిచ్చే అంశాలు మీకు క‌ల‌ల రూపంలో తెలియ‌వ‌చ్చు. కాబ‌ట్టి వాటిని అనుస‌రించండి.


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!


నేటి రాశిఫ‌లాలు.. వేస్తాయి మీ భ‌విత‌కు బంగారు బాట‌లు..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?