ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి..!

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి..!

ఈ రోజు (మే 10) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా ఈ రోజు పూర్తవుతుంది. అంతేకాదు.. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి కొన్ని పరిశోధనలు కూడా చేస్తారు. మీ పాత స్నేహితులను కలిసి వారితోనూ సరదాగా సమయం గడపండి.


వృషభం (Tarus) –  మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి గురించి బాగా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఓడిపోతామనే భయం మిమ్మల్ని కాస్త ఆందోళన, ఒత్తిడికి గురి చేయచ్చు. మీ ఒత్తిడిని తగ్గించుకుని ఏకాగ్రతతో పని చేసేందుకు ప్రయత్నించండి.


మిథునం (Gemini) –  మీరు చేసే పని నెమ్మదిగా జరుగుతుంది. కానీ ఈ క్రమంలో కమ్యూనికేషన్ లోపించిన కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్ట్స్.. వేటి గురించీ ఇప్పుడు స్పష్టత ఉండకపోవచ్చు. మీ భాగస్వామికి తోడు ఉంటూ వారికి సహకరించండి.


కర్కాటకం (Cancer) –  పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. అంతేకాదు.. ఇతరులు చేయాల్సిన పని బాధ్యతలను కూడా మీరే స్వీకరించాల్సి రావచ్చు. ఇలా ఊహించని సంఘటనలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి.


సింహం (Leo) –  మీ మెదడులో ఉన్న ఆలోచనలను మీరు కాస్త క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. చేసే పనిలో మరింత ఏకాగ్రత చూపండి. మీ పై అధికారులు మిమ్మల్ని పరీక్షించాలని చూసినా మీకున్న ప్రవర్తన కారణంగా సునాయాసంగా అందులో సఫలత సాధిస్తారు. ఇలా ఈ రోజు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి.


క‌న్య (Virgo) –  మీ మనసులో ఉన్న అభిప్రాయాల పట్ల స్పష్టతతో వ్యవహరించండి. ఎవరినీ తక్కువ చేసి చూడద్దు. పనిలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని పూర్తి చేసేందుకు ఇంటికి తీసుకెళ్లకండి. అలాగే ఒత్తిడిని కూడా ఆఫీసులోనే వదిలేయండి.


తుల (Libra) –  ఏమీ ఆశించకుండా మీ పనిని మీరు పూర్తి చేస్తారు. ఈ రోజు జరిగే ఒక సమావేశం మీరనుకున్నట్లుగా ముగిసినప్పటికీ దాని నుంచి వెంటనే ఫలితాలు వస్తాయని ఆశించకండి. మీ పాత స్నేహితుల కోసం కాస్త సమయం కేటాయించండి.


వృశ్చికం (Scorpio) – మీరు చేసే పనికి, మీ మనసులోని ఆలోచనలకు మధ్య బ్యాలన్స్ చేయండి. ఒక్కోసారి ఇది కాస్త కష్టం అనిపించినా అసాధ్యం మాత్రం కాదు. ఇది మీకు మీ బలాలు, బలహీనతల గురించి తెలిసేలా కూడా చేస్తుంది. అందరితోనూ మర్యాదపూర్వకంగా ప్రవర్తించండి.


ధనుస్సు (Saggitarius) –  ముందుగానే ప్లాన్ చేసుకున్న కొన్ని పనులు, కుటుంబపరమైన ఒత్తిళ్ల కారణంగా ఈ రోజు మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండచ్చు. ఓ సమావేశం ద్వారా మీకు కొన్ని ప్రాజెక్ట్స్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.


మకరం (Capricorn) –  కమ్యూనికేషన్‌లో ఉన్న లోపం కారణంగా పని చేసినప్పటికీ ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండచ్చు. మీ చుట్టూ ఉన్న సహచరులతో మీ మనసులో ఉన్న మాటను చెప్పండి. మీ ఉనికి, చేస్తున్న పని కారణంగా ఒకరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సహనంతో వ్యవహరించండి.


కుంభం (Aquarius) –  పని చాలా నిదానంగా జరుగుతుంది. మీ పాత క్లయింట్స్ కొత్త ఐడియాలతో మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ సహచరులతో కాస్త సహనంగా వ్యవహరించండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కూడా చాలా అవసరం.


మీనం (Pisces) –  ఇతరుల ప్రమేయంతో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందేలా ఉన్న నిర్ణయాలు తీసుకోకండి. కాస్త ఉపశమనం పొందడానికి.. స్నేహితులతో సమయం గడపండి.


ఇవి కూడా చ‌ద‌వండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి..!