ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించండి

ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించండి

ఈ రోజు (మే 9) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీరు గతంలో చేసిన పొరపాట్లు లేదా తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా పనిలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వాటికి ఇతరులను బాధ్యులుగా చేయకండి. ఒక కొత్త ప్రాజెక్ట్ నిమిత్తం మీరు కొత్త సభ్యులతో కలిసి పని చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలో నిదానంగా ఆలోచించి పని చేయండి.  నెగటివ్‌గా ఆలోచించడం మాని.. పాజిటివ్ ఆలోచనలకు శ్రీకారం చుట్టండి


వృషభం (Tarus) – మీరు మీ రోజుని చక్కగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ చుట్టూ అంతా సవ్యంగా జరుగుతున్నప్పటికీ మీరు సరిగ్గా ప్రణాళిక ప్రకారం పని చేయకపోవడం వల్ల.. అందరూ గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. వివేకంతో ఆలోచించి అటువంటి సందర్భాల్లో నిర్ణయం తీసుకోండి. 


మిథునం (Gemini) – పని ప్రశాంతంగా జరిగినప్పటికీ.. పని ప్రదేశంలో వ్యక్తుల ప్రవర్తన కారణంగా మీకు కాస్త బాధ కలగవచ్చు. మీ అసౌకర్యం గురించి పై అధికారులకు చెప్పాలని అనుకున్నా.. అందుకు ఇది సరైన సమయం కాదని గ్రహించండి. నెగెటివిటీని పట్టించుకోకుండా మీ పని మీరు పూర్తి చేయడం మంచిది. కొన్ని విషయాల్లో రాజీపడితేనే మనం సంతోషంగా ఉండగలమనే విషయాన్ని నమ్మండి.


కర్కాటకం (Cancer) – చేస్తున్న పని నిదానంగా జరిగినా.. చేయాల్సిన ఒక కొత్త పనికి సంబంధించి మీకో స్పష్టత వస్తుంది. దానిని పూర్తి చేయడానికి మీ శక్తి, సామర్థ్యాలను మీకు అనుగుణంగా మలుచుకోండి. మీ స్నేహితులతో కాస్త సమయం గడపండి.


సింహం (Leo) – ఈ రోజు మీరు చాలా సమతుల్యతతో వ్యవహరించాలి. మీరు వ్యక్తిగత సమస్యలతో సతమతమవడం వల్ల .. అది పనిపై కూడా ప్రభావాన్ని చూపించవచ్చు. ఒక్కోసారి మీ ప్రాధాన్యాలను సరిచూసుకోవడం కూడా ముఖ్యమే అని మరువకండి. ఈ విషయాల్లో కుటుంబ సభ్యులు మీకు సహకారం అందిస్తారు.


క‌న్య (Virgo) – పనిలో ఈ రోజు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడానికి అస్సలు వెనుకాడకండి. కొన్ని విషయాలను మీ సన్నిహితులతో కూడా పంచుకోండి.  


తుల (Libra) – మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా సరిచూసుకోండి. కుటుంబ సభ్యులతో తగాదా పడకండి. గతం గురించి ప్రస్తావించకండి. తర్వాత మీరే ఇరకాటంలో పడాల్సి ఉంటుంది. జరిగే ఘటనలకు అనుగుణంగా ముందుకు వెళ్లండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి.


వృశ్చికం (Scorpio) – మీరు ఈ రోజు చెప్పేది, చేసేది ఒకటే అయి ఉండాలి. లేదంటే అది వ్యక్తిత్వం పైనే ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. ఇతరులు ఇచ్చే సలహాలను జాగ్రత్తగా వినండి. ఏ విషయాన్ని అయినా నూటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


ధనుస్సు (Saggitarius) – ఈ రోజంతా ప్రతి పనీ మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఇతరుల ఎమోషన్స్‌ని కూడా మీరు నియంత్రించాలని చూడకండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచండి.


మకరం (Capricorn) – మీరు చేసే పని ఏదైనా సరే.. దానిపై ఏకాగ్రత ఉండేలా చూసుకోండి. అప్పుడు పని కాస్త ఎక్కువగా ఉన్నా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే మీరు మీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం అవసరం.


కుంభం (Aquarius) – ఈ రోజు మీరు చేపట్టిన పని ఏదైనా నిదానంగా జరుగుతుంది. కొన్ని పనులు మాత్రం మీరు ఊహించినదానికి భిన్నంగానూ జరగవచ్చు. ఇలాంటి సమయంలో చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీ ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టండి.


మీనం (Pisces) – మీ మెదడులో ఉన్న అనేక ఇతరత్రా ఆలోచనల కారణంగా చేపట్టిన పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదే విధంగా పలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీకో స్పష్టత వస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబసభ్యులతో గడపడానికి కూడా సమయం కేటాయించండి. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి..!


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి..!