ఈ రోజు (మే 11) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసులో చాలామంది మీ గురించి వ్యతిరేక ధోరణిలో మాట్లాడినా.. తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకొని సహకరిస్తారు. మీరు ఆఫీసు టెన్షన్ నుండి బయటపడి.. కొంతసేపు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. తద్వారా మానసిక ఒత్తిడిని కాస్త తగ్గించుకోండి.
వృషభం (Tarus) – మీరు ప్రస్తుత జీవితంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారు. కనుక అప్పుడప్పుడు అన్ని కార్యకలాపాలనూ పక్కన పెట్టి.. మీ భాగస్వామితో గడపడానికి కాస్త సమయం కేటాయించండి. లేదంటే మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని భావించవచ్చు.
మిథునం (Gemini) – మీతో మీరు నిజాయితీగా వ్యవహరించి మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోండి. అలాగే గతంలో మీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే.. ఇప్పుడు వాటిని అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వాస్తవాల నుండి దూరంగా జరిగితే పరిస్థితులు మరింత జఠిలంగా మారతాయని గ్రహించండి.
కర్కాటకం (Cancer) – మీరు ఆగిపోయిన పని ముందుకెళ్లేలా కొత్త ఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కాస్త కష్టమే అయినా… మీ సహచరులను కూడా మీ ప్రణాళికలకు అంగీకరించేలా చేస్తారు. పనిలో ఎక్కువ సమయం గడపడం వల్ల కుటుంబ జీవితం కాస్త సమస్యల్లో పడవచ్చు. కాబట్టి అన్నింటికీ మీరు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
సింహం (Leo) – మీ జాబ్ లేదా బాధ్యత లేదా పాత్ర ఏంటనేది అందరికీ స్పష్టంగా తెలిసే రోజు ఇది. దీని తర్వాత ఎలాంటి ముందడుగు వేయాలో మీకు తెలిస్తుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులేవైనా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే.. ఈ రోజు ఫలితాలు పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఎదుటివారు చెప్పేది అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా వినండి.
కన్య (Virgo) – ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని జరగకూడని విషయాలు జరిగే అవకాశం ఉంది. కానీ మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు.. కుటుంబ సభ్యులు మీకు బాగా సహకరిస్తారు. అయితే మీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం. అంతేకాదు.. మీ శరీరానికి అవసరమయ్యే విశ్రాంతిని కూడా తప్పకుండా అందించండి.
తుల (Libra) – మీరు అన్ని విషయాలనూ వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపేయాలి. ఇలాంటి ధోరణే మిమ్మల్ని ముందుకు వెళ్లనీయకుండా ఆపేస్తోందని తెలుసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల భావోద్వేగాల కారణంగా.. వ్యక్తిగత జీవితం కూడా కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. కనుక సున్నితమైన విషయాలను సున్నితంగానే డీల్ చేయండి.
వృశ్చికం (Scorpio) – మీరు చేయాల్సిన కొత్త ప్రాజెక్ట్స్ గురించి.. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడం గురించి మీరు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. మల్టీటాస్కింగ్ ద్వారా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీరు పనికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. మీ కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. అప్పుడే మీ జీవితం సమతుల్యంగా ఉంటుంది.
ధనుస్సు (Saggitarius) – మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏమనుకున్నా.. మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులపైనే గురి పెట్టండి. ప్రతికూల భావధోరణితో మాట్లాడేవారి గురించి ఆలోచించకండి. అలాగే మీ ఆరోగ్యం పై మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ విషయంలోనూ మీ గురించి ఇతరులు ఏం అనుకుంటారోనని ఆలోచించవద్దు.
మకరం (Capricorn) – మీరు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉన్న కారణంగా.. చేసే పనులపై మీకు ఏకాగ్రత కుదరకపోవచ్చు. అలాగని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. అలాగే కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడడం ద్వారా.. భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణపై ఓ స్పష్టత వస్తుంది.
కుంభం (Aquarius) – ఇతరులతో ఉన్న కన్‌ఫ్యూజన్ కారణంగా పనిలో కాస్త జాప్యం జరగవచ్చు. మీకు, వారికి మధ్య ఉన్న అభిప్రాయభేదాలేంటో.. ఈ రోజే మీరు సరిచూసుకోకపోతే అవి పనిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
మీనం (Pisces) – ఈ రోజు ఆఫీసులో మీరు ఎవరిని నమ్మాలన్నా.. కాస్త వెనకాడుతూ ఉంటారు. దీనికి తగ్గట్లుగా మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కాస్త శ్రద్ధ పెడితే జాగ్రత్తగా పని పూర్తి చేయవచ్చు.
Credit: Asha Shah
ఇవి కూడా చదవండి
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
నేటి రాశిఫలాలు చదవండి.. మీ రాశి ఫలితం ఏంటో తెలుసుకోండి!