ఈ రోజు (మే 25) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఆఫీసులో ఇతరులు చేసిన పనిని మీరు సమీక్షించాల్సి రావచ్చు. ఈ క్రమంలో మీరు వీలైనంత వరకు వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే మీ సహచరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మనసు చెప్పేది వినండి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి.
వృషభం (Tarus) – ఈ రోజు మీరు చేపట్టిన పని ఏదైనా సవ్యంగా జరుగుతుంది. అలాగే అందరి చూపు మీపైనే ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు. కొందరు మీ పట్ల కఠినంగా వ్యవహరించినా మీ ఆలోచనాతీరుని ప్రభావితం చేయలేరు. అనవసర విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి.
మిథునం (Gemini) – ఈ రోజు చాలా ముఖ్యమైన సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి. వాటిలో మీరు పూర్తి ఏకాగ్రతతో పాల్గొనడం చాలా అవసరం. అలాగే ఈ సమావేశాల కారణంగా.. కొన్ని పనులు ఆలస్యంగా జరగచ్చు. ఫలితంగా పనిలోనే అధిక సమయం గడపాల్సి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉండండి.
కర్కాటకం (Cancer) – పని విషయంలో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ కొన్ని క్లయింట్ మీటింగ్స్ లేదా క్లయింట్స్ నుంచి రావాల్సిన ఫలితాల్లో ఆలస్యం జరగచ్చు. ఈ క్రమంలో మీకు చికాకుగా అనిపించినప్పటికీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీరు కూల్ అయ్యేందుకు సహాయపడతారు. సమస్యను అవతలివారి కోణం నుంచి కూడా చూడాలని చెప్తారు.
సింహం (Leo) – ఉన్నట్లుండి మీరు నిర్వహించాల్సిన బాధ్యతల జాబితా బాగా పెరిగిపోవడంతో వాటిని ఎక్కడి నుంచి ప్రారంభించాలో.. ఎక్కడ ముగించాలో మీకు అర్థం కావడం లేదు. పనిలో అంతా సవ్యంగా జరగడం మాత్రమే కాదు.. కొత్త పనికి కూడా శ్రీకారం చుడతారు. పనితో పాటు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి.
కన్య (Virgo) – ఈ రోజు మీరు చేపట్టిన చాలా పనులు సవ్యంగా పూర్తవుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఉన్నట్లుండి ఎలాంటి విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకోకండి. కాస్త బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల కూడా నేడు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
తుల (Libra) – ఈ రోజు ఇతరులు తీసుకునే నిర్ణయాలు మీపై బాగా ప్రభావం చూపిస్తాయి. ఆఫీసులో మీ సీనియర్స్ కూడా మీరు గతంలో పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు లేదా మాట్లాడే మాటలను ఈ రోజు అందరూ అపార్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు నేడు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది.
వృశ్చికం (Scorpio) – పనిలో ఈ రోజు మీరు తీరిక లేనంత బిజీగా ఉంటారు. కానీ మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పరిస్థితులను బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించకండి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఏ పని చేసినా ఆర్గనైజ్డ్‌గా వ్యవహరించండి.
ధనుస్సు (Saggitarius) – పని విషయంలో పెద్దగా మార్పులేమీ లేకపోయినప్పటికీ కొన్ని విషయాలను మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఈ కారణంగా మీ మూడ్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇది మీరు చేసే పనిని సైతం ప్రభావితం చేస్తుంది. దీనికి తోడు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే పరిస్థితులు కూడా మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. మీ మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది.
మకరం (Capricorn) – ఈ రోజు మీరిచ్చే కొత్త ఐడియాలు సత్ఫలితాలు ఇవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అయితే మీరు చెప్పేది ఎదుటివారికి పూర్తిస్థాయిలో అర్థంకాక వారు మీతో ఏకీభవించడానికి కూడా టైం పడుతుంది. ఈ క్రమంలో మీరు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం.
కుంభం (Aquarius) – పెండింగ్ వర్క్ పూర్తి చేయాలని మీపై వచ్చే ఒత్తిడి కారణంగా.. ఈ రోజు ఆఫీసులో పరిస్థితులు కాస్త గంభీరంగా మారే అవకాశాలున్నాయి. అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించేందుకు చివరి నిమషంలో సమావేశాలు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలానే ఉన్న కారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమయం కేటాయించలేరు.
మీనం (Pisces) – కొన్ని కారణాల వల్ల పని కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన మెయిల్, షిప్ మెంట్ లేదా మీరు పాల్గొనే సమావేశం కారణంగా ఆలస్యం జరగవచ్చు. అయితే సమయం గడిచే కొద్దీ ఇవన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మీరు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గించుకునేందుకు మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ రోజు రాశిఫలాలు చదవండి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి..!
ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?