నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను చేరుకోండి..!

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను చేరుకోండి..!

ఈ రోజు (మే 27) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన సమావేశానికి హాజరైన కారణంగా పనుల్లో కాస్త జాప్యం జరగవచ్చు. ఈ క్రమంలో మీరు చాలా ఏకాగ్రతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కాస్త నెమ్మదిస్తాయి. మీ ప్రవర్తన కారణంగా ఒకరికి ఇబ్బంది కలుగుతుంది. ఎదుటివారితో మాట్లాడినప్పుడు వారి భావోద్వేగాలకు కూడా విలువివ్వండి. 


వృషభం (Tarus) – చాలా రోజుల తర్వాత ఆఫీసులో ఈ రోజు మీకు చాలా బాగా గడుస్తుంది. మీరు పడిన కష్టానికి, శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అయితే మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒత్తిడిని పనిపై ప్రభావం చూపనీయకండి. మీ నుంచి చుట్టూ ఉన్నవారు అధికంగా ఆశిస్తారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.


మిథునం (Gemini) – ఈ రోజు ఆర్థికంగా బాగా లాభదాయకమైన ఓ ప్రాజెక్ట్ మీ వద్దకు వస్తుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ముందుకు కదులుతాయి. మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల అండతో మీరు సంతోషంగా గడుపుతారు.


కర్కాటకం (Cancer) – పనికి సంబంధించిన చిన్న చిన్న టెన్షన్స్‌తో ఈ రోజు ఉదయాన్నే నిద్రలేస్తారు. మీ వద్ద ఉన్న తక్కువ సమయంలోనే ఆ పనులన్నీ పూర్తి చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే మీరు కాస్త విశ్రాంతి కూడా తీసుకోండి. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. మీ కుటుంబ సభ్యులు లేదా ఇతరుల నుంచి మీకు సహాయం అందుతుంది.


సింహం (Leo) – పనిలో మీరు తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయం గురించి మీకో స్పష్టత వస్తుంది. మీ జీవితాన్ని బాగా ప్రభావితం చేసే ఓ వ్యక్తిని మీరు నేడు కలుసుకుంటారు. దీర్ఘకాలంలో వీరు మీలో చాలా పాజిటివ్ మార్పులను తీసుకొస్తారు. అయితే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి.


క‌న్య (Virgo) – ఆఫీసులో మీ కోపం లేదా చిరాకుని ఈ రోజు ప్రదర్శించకండి. పని నిదానంగా జరగడంతో పాటు మీకు కాస్త ఆందోళన కూడా కలిగించవచ్చు. అయితే చివరికి మీకు అన్ని విషయాల్లోనూ ఓ స్పష్టత వస్తుంది. మీ కుటుంబ సభ్యులు మీకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తారు.


తుల (Libra) – ఆఫీసులో పని విషయంలో అంతా సక్రమంగానే జరిగినప్పటికీ.. కొందరి పనితీరు కారణంగా మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు అందరినీ నియంత్రించే స్థాయిలో ఉన్నప్పటికీ వారిపై కోపం, చిరాకుతో ప్రవర్తించడం సరికాదు. వీలైనంత వరకు సహనంతో వ్యవహరించండి.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఏ విషయంలోనూ ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకండి. వాటికి ప్రభావితమైతే ఇబ్బందులపాలయ్యేది మీరేనని గుర్తుంచుకోండి. అలాగే ఇతరులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత తక్కువగా మాట్లాడండి.


ధనుస్సు (Saggitarius) – మీ మెదడులో ఈ రోజు చాలా ఆలోచనలు ఉంటాయి. అయితే మీరు మాత్రం ఇతరులు చేసిన పొరపాట్లను సరిదిద్దడంపైనే గురి పెడతారు. ఆర్థికంగా చూస్తే మీకు ఈ రోజు ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా ముఖ్యమే.


మకరం (Capricorn) – మీరు ఈ రోజు కాస్త మూడీగా ఫీలవుతారు. కాబట్టి దేని గురించీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ తొలిగిపోయి తిరిగి ప్రశాంతతను పొందేందుకు.. తగినంత విశ్రాంతిని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి.


కుంభం (Aquarius) – నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్న కారణంగా.. మీరు ఈ రోజు చాలా బిజీగా గడుపుతారు. అంతేకాదు.. ఆఫీసులో మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ అనుబంధాలకున్న ప్రాధాన్యతను అనుసరించి వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వండి.


మీనం (Pisces) – పూర్తి చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. మీరు దానిని సవ్యంగా చేయలేరు. ఇలాంటి సమయంలోనే వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. వీలైతే మీ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాయం కూడా తీసుకోవాలి. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. ఈ ఆదివారం హాయిగా గడిపేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!