ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. ఈ ఆదివారం హాయిగా గడిపేయండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. ఈ ఆదివారం హాయిగా గడిపేయండి

ఈ రోజు (మే 26) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీకు ఈ రోజు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరకదు. అంత బిజీగా గడుపుతారు. ఒంటరిగా కాసేపు గడపాలని మీకు అనిపించినా.. అందుకు మీకు ఆ ఛాన్స్ ఉండదు. అలాగే పలువురు ముఖ్యమైన స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. 


వృషభం (Tarus) –  ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళతారు. ఇలాంటప్పుడే వారితో మనసు విప్పి మాట్లాడండి. ప్రశాంతంగా, సంతోషంగా ఈ రోజు గడపడానికి ప్రయత్నించండి. ఈ రోజు కొన్ని సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి కూడా గురిచేస్తాయి.


మిథునం (Gemini) –  మీరు ఈ రోజు మీరు ఏం చేయడానికి ప్రయత్నించినా అవి సవ్యంగా జరిగే అవకాశాలు తక్కువ. కొందరు మిమ్మల్ని ఇమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ఉచ్చులో పడద్దు. అలాగే ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.


కర్కాటకం (Cancer) –  ఈ రోజు మీరు మీ దూరపు బంధువులు లేదా స్నేహితులను కలిసే అవకాశం ఉంది.  ముఖ్యంగా పలువురు మీ సలహాలు పొందడానికి.. మిమ్మల్ని కలుస్తారు. అలాంటప్పుడు కాస్త వివేకంతో ప్రవర్తించండి. మీరిచ్చే సలహాల వల్ల.. మీ జీవితం ప్రభావితం అవుతుందనుకుంటే.. అలాంటి సలహాలు ఇవ్వకపోవడమే బెటర్. 


సింహం (Leo) – ఈ రోజు  మిమ్మల్ని మానసికంగా బాధిస్తున్న అంశం ఏదో గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ రోజు అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి. మీ భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకండి. ఒంటరిగా కాసేపు గడిపేందుకు ప్రయత్నించండి. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది.


క‌న్య (Virgo) –  కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఘర్షణల కారణంగా వారితో సంతోషంగా గడిపేందుకు మీకు సమయం చిక్కకపోవచ్చు. కొద్దిసేపు ఒంటరిగా సమయం గడపండి. అన్నీ సర్దుకుంటాయి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ స్నేహితులు ప్రయత్నిస్తారు. అలాగే మీరు ఊహించని పలు సంఘటనలు ఈ రోజు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. 


తుల (Libra) – ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం.. చేయాల్సిన పనులు క్రమంగా చేసుకుంటూ వెళ్తారు. అయితే కుటుంబ సభ్యులతో గడిపేందుకు మీ వద్ద కాస్త తక్కువ సమయం ఉండచ్చు. చివరి నిమిషంలో ప్లాన్స్ మార్చడం వల్ల కొందరు నిరుత్సాహపడవచ్చు.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు నిదానంగా మొదలైనప్పటికీ.. మధ్యాహ్న సమయానికి అన్నీ సర్దుకుంటాయి. మీ స్నేహితులు మిమ్మల్ని చూడడానికి మీ వద్దకు రావచ్చు. బయటకు వెళ్లడం వల్ల మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవడంతో పాటు కొంతసేపు లైమ్‌లైట్‌లో ఉంటారు. పలువురు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. 


ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు మీ సమయమంతా కూడా బ్యాలన్స్డ్‌గా గడుస్తుంది. మీరు మీ శారీరక ఆరోగ్యానికి, డైట్‌కి ప్రాధాన్యం ఇస్తారు. మీ కుటుంబ సభ్యులెవ్వరితోనూ ఘర్షణ లేదా వాగ్వాదానికి దిగకండి. సాయంత్రం సమయంలో మీ స్నేహితులతో కలిసి గడపండి.


మకరం (Capricorn) – ఈ రోజు  మీరు బాగా ఎమోషనల్‌గా ఫీలవుతారు. అలాగే మీకున్న పనులతో కాస్త అలిసిపోవచ్చు కూడా. కానీ మిగతావారి కోసం ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గడిపేందుకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ మీ వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ చర్చించకండి.


కుంభం (Aquarius) –  ఈ రోజు మీరు కాస్త సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. సాయంత్రం మాత్రం అన్నీ చివరి నిమిషంలోనే ప్లాన్ చేసుకుంటారు. అలాగే మిమ్మల్ని కలిసేందుకు వచ్చేవారితో గడిపేందుకు కొద్దిగా సమయం కేటాయించే అవకాశం కూడా ఉంది. 


మీనం (Pisces) –  ఈ రోజు నిదానంగా మొదలవుతుంది. కానీ మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీరు పనులను పూర్తి చేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను మీరు ఒక్కరే పూర్తి చేస్తారు. అలాగే సాయంత్రం సమయంలో మీ స్నేహితులను కలిసి సరదాగా సమయం గడుపుతారు.


Credit: Asha Shah


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీక్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చ‌ద‌వండి


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?