ADVERTISEMENT
home / వెల్‌నెస్
నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!

ఈ రోజు (మే 30) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీరొక శుభవార్త వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాదు.. మీరు ఈ రోజు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. అయితే ఇవి మీకు మీరుగానే తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభం (Tarus) – చేసే పనిలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. ఈ క్రమంలో ఇతరులతో ఉన్న విభేదాలు, వాదనలు మిమ్మల్ని కాస్త బాధిస్తాయి. ఎదుటివారు చెప్పేది ప్రశాంతంగా, పూర్తిగా వినండి. పనిలో ఉండే ఒత్తిడి కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని పొందలేరు. కాబట్టి ఆ ఒత్తిడిని జాగ్రత్తగా తగ్గించుకోండి. 

మిథునం (Gemini) – చేసే పనిలో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ఆలోచనలు, అవకాశాలతో మీరు ఈ రోజు కాస్త బిజీగా ఉండవచ్చు. అంతమాత్రాన నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకండి. ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉండే విధంగా పని చేయండి. అవసరమైతే మీ సీనియర్స్ నుంచి సలహాలు తీసుకోండి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేయాల్సి ఉండడంతో మీరు పని చేసే విధానాన్ని నేడు మార్చుకోవాల్సి రావచ్చు. మీ సహచరులు కూడా ఈ క్రమంలో మీకు బాగా సహాయపడతారు. అయితే వారిపై మీరు సరైన నమ్మకం ఉంచడం చాలా అవసరం. అలాగే మీ ఆరోగ్యం విషయంలోనూ కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భాగస్వామితో జరిగే చిన్న చిన్న గొడవల కారణంగా కుటుంబంలో కాస్త ప్రశాంతత లోపించవచ్చు. అయినా మీ కుటుంబీకులతో మీరు శాంతియుతంగానే మెలగండి. 

సింహం (Leo) – మీ ఆలోచనల్లో కాస్త మార్పు వచ్చే రోజు ఇది. మీ వ్యక్తిగత జీవితం లేదా ఆఫీసు వ్యవహారాలకు సంబంధించి మీకు ఉన్న నమ్మకాల్లో కూడా మార్పు రావచ్చు. ఈ క్రమంలో ఎదుటివారికి మీరు వివరణ ఇచ్చుకోవడం లేదా వారికి సర్దిచెప్పాల్సి రావడం వంటివి జరగచ్చు.

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చాలా వివేకంతో వ్యవహరించడంతో పాటు.. మీ మనసు చెప్పింది చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. మీరు చేసే పనిలో ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ.. మీకింకా ఏదో అనుమానం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవడాన్ని ఆపాలి.  

తుల (Libra) – మీరు ఈ రోజు ఏం చేసినా.. ఎంత ప్రయత్నించినా పని చాలా నిదానంగా, నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి మీరు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆఫీసులో సహచరులు కొందరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. అయినా సరే.. ఓర్పుతో సహించండి. సాయంత్రం అయ్యే సరికి అన్నీ సర్దుకుంటాయి.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కోపాన్ని మరొకరిపై అస్సలు ప్రదర్శించవద్దు. ఇలా చేస్తే సమస్యల వలయంలోకి మీకు మీరే అడుగుపెడుతున్నారనే భావన కలుగుతుంది. అలాగే పని విషయంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

ధనుస్సు (Saggitarius) – మీరు చేస్తున్న పనికి సంబంధించి స్పష్టత తెచ్చుకోవాల్సిన విషయాలు మీ మెదడులో చాలా ఉన్నాయి. ఈ క్రమంలో అవసరమైతే ఎవరినైనా సహాయం అడగండి. అన్నీ మీరే స్వయంగా చేయలేకపోవచ్చు. కుటుంబ సభ్యులకు ఈ రోజు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. మీ భాగస్వామితో గొడవ పడకండి.

మకరం (Capricorn) – ఈ రోజు అన్నీ మీరు కోరుకున్నట్లుగానే జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడుపుతూ సంతోషంగా ఉంటారు. ఎవరితోనైనా వివాదాలుంటే.. మనసు విప్పి మాట్లాడడం ద్వారా వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జీవితం హాయిగా సాగాలంటే.. మీ భాగస్వామికి కూడా సాధ్యమైనంత వరకూ సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు ఏ విషయానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోలేరు. మీకేం కావాలో మీకు తెలిసినా.. అందుకు తగ్గ ఫలితాలను పొందేందుకు మీరు శక్తివంచన లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే పలు విషయాల్లో స్పష్టత లేకపోవడం లేదా సమావేశాల్లో జరిగే జాప్యం కారణంగా పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా మీ సహచరులతో మీకు అభిప్రాయభేదాలు రావచ్చు. అంతే కాకుండా.. మీ స్నేహితుల ప్రవర్తన కారణంగా మీరు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. 

ADVERTISEMENT

Credit : Asha Shah

‌ఇవి కూడా చ‌ద‌వండి

నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..!

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

ADVERTISEMENT

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

 

29 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT