బాపూ గారి బొమ్మ ప్ర‌ణీత ఫ్యాష‌న్స్ ఫాలో అవ్వండి.. మీరూ భ‌లేగా మెరిసిపోండి..!

బాపూ గారి బొమ్మ ప్ర‌ణీత ఫ్యాష‌న్స్ ఫాలో అవ్వండి.. మీరూ భ‌లేగా మెరిసిపోండి..!

"బొంగ‌రాలంటి క‌ళ్లు తిప్పింది.. ఉంగ‌రాలున్న జుట్టు తిప్పింది.." అంటూ బాపూ గారి బొమ్మ‌గా అభివ‌ర్ణించిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌ణీత‌ సుభాష్ (Pranitha Subhash). పాట‌కు త‌గ్గ‌ట్టుగానే అపురూప‌మైన అందం, ఆక‌ట్టుకునే రూపంతో అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుందీ సుందరి. అంతేనా.. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా చ‌క్క‌గా డ్ర‌స్ చేసుకుంటూ త‌న‌కు న‌ప్పే ఫ్యాష‌న్స్ మాత్ర‌మే ఫాలో అవుతూ తానొక స్టైల్ క్వీన్ అని కూడా అనిపించుకుంటుంది. మ‌రి, ఈ క్వీన్ స్టైల్ ఫైల్‌లో కొన్ని ఫ్యాష‌న్స్‌ని మ‌న‌మూ ఓసారి చూద్దాం రండి..
 

 

 


View this post on Instagram


Vishakapatnam ! For a product launch in 👗 @vinetibolaki ❤️ styled by @harmann_kaur_2.0 ❤️ 📸 @satyas_pixels ❤️


A post shared by Pranitha (@pranitha.insta) on
అందంగా క‌నిపించ‌డం అంటే చాలామంది అనుకునేది ఆక‌ట్టుకునే డ్ర‌స్సింగ్, అందుకు త‌గిన మేక‌ప్‌ల‌తోనే అది సాధ్య‌మ‌ని. కానీ అది నిజం కాద‌ని నిరూపిస్తోంది ప్ర‌ణీత‌. ప్లెయిన్ ఆలివ్ గ్రీన్ షేడ్‌లోని లాంగ్ గౌన్‌లో సింపుల్‌గానే ఎంత అందంగా మెరిసిపోతోందో మీరే చూడండి. చెవుల‌కు స్ట‌డ్స్ త‌ప్ప వేరే యాక్సెస‌రీస్ కూడా పెద్ద‌గా ఉప‌యోగించ‌కుండానే అందాల బొమ్మ‌ని త‌ల‌పిస్తోంది క‌దూ..

సాధార‌ణంగా స‌మ్మ‌ర్‌లో ధ‌రించే దుస్తులు లైట్ షేడ్‌వి కావ‌డంతో పాటు.. వీలైనంత వ‌దులుగా కూడా ఉండాల‌ని అంటారు. అప్పుడే మ‌న‌కు సౌక‌ర్య‌వంతంగా అనిపిస్తుంది. ప్ర‌ణీత కూడా ఈ రూల్‌ని ఫాలో అయింది చూడండి. వ‌దులుగా ఉన్న పేస్ట‌ల్ షేడ్ జంప్ సూట్‌లో హెయిర్ వ‌దులుగా వ‌దిలి, చెవుల‌కు అంద‌మైన ఇయ‌ర్ రింగ్స్‌తో త‌న లుక్‌ని పూర్తి చేసింది ప్ర‌ణీత‌.
 

 

 


View this post on Instagram


For the Fbb Big bazaar launch at Kadapa Outfit: @breanathestylestudio Accessories: @accessoriesbyanandita Styled by @officialanahita


A post shared by Pranitha (@pranitha.insta) on
సీజ‌న్ ఏదైనా స‌రే.. పార్టీ వంటి సంద‌ర్భాల‌కు మాత్రం కాస్త డిఫ‌రెంట్‌గా, స్టైలిష్‌గా ర‌డీ కావాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు/ మ‌హిళ‌లకు ఉండే ఆలోచ‌నే ఇది. మీరూ అంతేనా?? అయితే ప్ర‌ణీత ధ‌రించిన డ్ర‌స్ చూడండి. ర‌ఫెల్డ్ షిమ్మ‌రీ టాప్‌కు స్లిట్టెడ్ బాట‌మ్‌ని జ‌త చేసి ఎంత అందంగా మెరిసిపోతోందో. దానికి ఆమె మ్యాచ్ చేసిన సిల్వ‌ర్ క్ల‌చ్‌ని చూశారా? డ‌్ర‌స్ అందాన్ని రెట్టింపు చేస్తోంది క‌దూ..

అమ్మాయిల‌ను సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించేలా చేసే అవుట్ ఫిట్స్‌లో అనార్క‌లీలు ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉంటాయి. అందులోనూ లైట్ షేడ్స్ అయితే వారి అందాన్ని రెట్టింపు చేసి చూపిస్తాయి. ఏంటి?? మేం చెప్పే మాట‌లు న‌మ్మ‌రా?? అయితే ప్ర‌ణీత‌ను చూడండి. లైట్ ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ ఉన్న పేస్ట‌ల్ షేడ్ డ్ర‌స్‌కి మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకొని నిజంగానే బాపూ బొమ్మ‌లా అందంగా ఉంది. కాదంటారా??
 

 

 


View this post on Instagram


For #hgpk promotions and tour Outfit: @themerakiproject Accessories: @accessoriesbyanandita Styled by @officialanahita 💖


A post shared by Pranitha (@pranitha.insta) on
హాట్ స‌మ్మ‌ర్‌లోనూ కూల్ ఫ్యాష‌న్స్‌తో అద‌ర‌గొట్టాల‌ని అనుకుంటున్నారా?? అందుకూ బోలెడు మార్గాలున్నాయి. మ‌న ప్ర‌ణీత ధ‌రించిన‌ట్లుగా కాట‌న్ అసిమెట్రిక‌ల్ టాప్‌కి.. కాస్త వ‌దులుగా ఉన్న చ‌క్క‌ని జీన్స్‌ని జ‌త చేసి చూడండి.. స్టేట్ మెంట్ చెయిన్ లేదా నెక్ పీస్‌తో ఈ అవుట్ ఫిట్‌లో అందంగా, ఫ్యాష‌నబుల్‌గా క‌నిపించ‌వ‌చ్చు తెలుసా??

స్పెషల్ అకేష‌న్ ఉన్న‌ప్పుడు మ‌నం కూడా న‌లుగురిలోనూ స్పెష‌ల్‌గా క‌నిపించాల్సిందే. లేదంటే ఫ్యాష‌న్ ప‌రంగా వెన‌క‌ప‌డిపోయిన‌ట్లేగా.. అందుకే ఈసారి మీకు ఇలాంటి సంద‌ర్భాలేవైనా ఎదురైన‌ప్పుడు ప్ర‌ణీత ధ‌రించిన ఈ ఫ్యాష‌న్‌ని ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి. క్యాట్ గ‌ర్ల్ లుక్‌లో భ‌లే అందంగా మెరిసిపోవ‌చ్చు.
 

 

 


View this post on Instagram


Keeping it Simple !! Wearing @kalkifashion for a bigbazaar charity event .. Thankyou @instagladucame for conordinatinf it ❤️


A post shared by Pranitha (@pranitha.insta) on
కాలేజీ అమ్మాయిలు స్టైలిష్‌గా క‌నిపించ‌డానికి ఎంత ఇష్ట‌ప‌డ‌తారో తమ డ్ర‌స్సింగ్ సింపుల్‌గా ఉండాల‌ని కూడా అంతే బ‌లంగా కోరుకుంటారు. మీరూ అంతేనా?? అయితే ప్ర‌ణీత ధ‌రించిన అవుట్ ఫిట్‌ని చూడండి. లైట్ మిర్ర‌ర్ వ‌ర్క్ ఉన్న టాప్‌కి ప‌లాజో త‌ర‌హా బాట‌మ్‌ని జ‌త చేసి, దానికి మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకొని ఎంత కూల్‌గా క‌నిపిస్తోందో..
 

 

 


View this post on Instagram


Kurnool for the rural sports festival .. Wearing @athlea.krishna


A post shared by Pranitha (@pranitha.insta) on
ఈ రోజుల్లో స్టైలిష్ లుక్ సొంతం చేసుకోవాలంటే అందుకు మ‌న డ్ర‌స్సింగ్ కూడా భిన్నంగా ఉండాల‌ని భావించే అమ్మాయిలు ఎంద‌రో.. ఒక‌వేళ మీ ఆలోచ‌న కూడా ఇలాగే ఉంటే ఒక్క‌సారి ప్ర‌ణీత ధ‌రించిన అవుట్ ఫిట్ చూడండి. నార్మ‌ల్ చుడీదార్‌లా క‌నిపిస్తున్నా.. సింగిల్ హ్యాండెడ్ లాంగ్ టాప్ విత్ బాట‌మ్‌కి స్టేట్ మెంట్ ఇయ‌ర్ రింగ్స్ జ‌త చేసి అందంలోనే కాదు.. ఫ్యాష‌న్స్‌లోనూ తానేమీ తీసిపోన‌ని చెప్పిన‌ట్లు ఉంది క‌దూ..
 

 

 


View this post on Instagram


#about yesterday #keepingitsimple #dhoti #desi


A post shared by Pranitha (@pranitha.insta) on
కాలేజీ అమ్మాయిలు ఎక్కువ‌గా ఎంపిక చేసుకునే స్టైల్స్‌లో ధోతీ కూడా ఒక‌టి. దీనిని డిఫ‌రెంట్‌గా ధ‌రిస్తే స్టైలిష్ గానే కాదు.. ఫ్యాష‌న‌బుల్ అని కూడా అనిపించుకోవచ్చు. మ‌న అందాల నాయిక ప్ర‌ణీత ఇదే ప‌ని చేసింది. ధోతీ బాట‌మ్‌కి కేప్ త‌ర‌హా టాప్‌ని జ‌త చేసి దానికి మ్యాచింగ్‌గా సిల్వ‌ర్ కోటెడ్ ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకొని బొమ్మ‌లా మెరిసిపోతుంది క‌దూ..


ఇన్ని ఫ్యాష‌న్స్ ఫాలో అయ్యే ప్ర‌ణీత‌కు మాత్రం బాగా ఇష్ట‌మైన డ్ర‌స్సింగ్ అంటే అది లెహెంగా అనే చెప్పుకోవాలి. వీటితోనూ ఈ అమ్మ‌డు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూ భిన్న‌మైన లుక్స్‌లో మెరుస్తూ ఉంటుంది. కావాలంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫ్యాష‌న్స్ పై మీరూ ఓ లుక్కేయండి..


ఇవి కూడా చదవండి


 ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!


కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!


నివేదా థామస్ ఫ్యాషన్స్ సింపుల్ మాత్రమే కాదు.. స్టైలిష్ కూడా..!