ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!

ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!

లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత భ‌లే భ‌లే మ‌గాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయ‌న‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, అంత‌రిక్షం.. మొద‌లైన హిట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.


అయితే ఈ అమ్మ‌డు రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లో కూడా అందంగా, ఫ్యాష‌నబుల్‌గా మెరిసిపోతూ ఉంటుంది. డిఫ‌రెంట్ డ్ర‌స్సింగ్ సెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సీజన్‌కి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌ని స్టైల్స్ ఎంపిక చేసుకుంటూ భ‌లే స్టైలిష్‌గా మెరిసిపోతూ ఉంటుంది. మ‌రి, ఈ ముద్దుగుమ్మ స్టైల్ ఫైల్ నుంచి ఈ హాట్ హిట్ స‌మ్మ‌ర్‌కి సూప‌ర్బ్‌గా స‌రిపోయే కొన్ని ఫ్యాష‌న్స్‌ని మ‌న‌మూ చూద్దామా..

* స‌మ్మ‌ర్ అంటేనే చాలామంది లైట్ క‌ల‌ర్స్‌ని ఎంపిక చేసుకునేందుకు అమితంగా ఆస‌క్తి చూపుతుంటారు. మీరూ అంతేనా?? అయితే లావ‌ణ్య ధ‌రించిన ఈ అవుట్ ఫిట్‌ని చూడండి. లైట్ ఎల్లో షేడ్‌లో సిల్వ‌ర్ ప్రింట్స్‌తో ఉన్న ఈ వ‌న్ షోల్డ‌ర్ అవుట్ ఫిట్‌లో లావ‌ణ్య ఎలాంటి యాక్సెస‌రీస్ లేకుండానే చంద‌మామ‌లా మెరిసిపోతోంది క‌దూ..

* హాట్ స‌మ్మర్‌‌లో, మ‌న‌కు హాట్‌లుక్‌ని ఇచ్చే తెలుపు రంగు అయితే స‌రిగ్గా స‌రిపోతుంది. అందుకే చుడీదార్ మొద‌లుకొని టాప్స్, బాట‌మ్స్.. ఇలా ఏదో ఒక ర‌కంగా ఈ రంగుని మ‌న వ‌స్త్ర‌ధార‌ణ‌లో భాగం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటాం. లావ‌ణ్య కూడా ఇదే రూల్‌ని ఫాలో అయిపోయింది. లైట్ ఎల్లో క‌ల‌ర్ ప్రింటెడ్ ఫ్ల‌వ‌ర్స్ ఉన్న శారీలో చ‌క్క‌ని చుక్క‌లా భ‌లే అందంగా క‌నిపిస్తోందిగా..
 

 

 


View this post on Instagram


Art is beauty, Art is life, and Art is also wearing your jumpsuit with leggings! 😆 pc: @sonalsingh.k


A post shared by Lavanya T (@itsmelavanya) on
* మిక్స్ అండ్ మ్యాచ్ స్టైల్ అంద‌రూ ఫాలో అయ్యేదే. అయితే దానిని ఎంత డిఫ‌రెంట్‌గా ధ‌రించాం అనే దాని కంటే.. అది మ‌న‌కు ఎంత‌గా న‌ప్పింది అన్న‌దే ముఖ్యం. అలా జంప్ సూట్ ఫ్యాష‌న్‌లో టాప్‌కి సాధార‌ణ లెగ్గింగ్‌ని జ‌త చేసి ఫ్లాట్ ఫుట్  వేర్‌తో సింపుల్‌గా ఎలా మెరిసిపోతోందో చూడండి మ‌న అందాల ముద్దుగుమ్మ‌.

* వేస‌వి అంటే సాధార‌ణంగా మూడు నెల‌ల వ‌ర‌కు దాని ప్ర‌భావం మ‌న‌కు క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. అందుకే దానిని వేరే షేడ్స్‌తో మిక్స్ చేసి ధ‌రిస్తే బోర్ కొట్ట‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌చ్చు. లావ‌ణ్యని చూడండి.. తెలుపు రంగు టాప్‌కి వ‌దులుగా ఉన్న బ్లూ క‌ల‌ర్ కోట్, బాట‌మ్ జ‌త చేసి బ్లూ రోజ్‌లా భ‌లే ఫ్రెష్ లుక్‌లో క‌నిపిస్తోంది క‌దూ..

* లైట్ క‌ల‌ర్స్‌లో అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే షేడ్ లైట్ పింక్. దానికి లైట్‌గా గోల్డ్ ఎంబ్రాయిడ‌రీ ఉంటే ఆ లుక్ సింప్లీ సూప‌ర్బ్ అని చెప్ప‌చ్చు. ఈ కాంబినేష‌న్‌లో డ్ర‌స్ లేదా శారీ ధ‌రిస్తే యాక్సెసరీస్ కూడా అవ‌స‌రం లేకుండానే పున్న‌మి నాటి చంద్రునిలా ధ‌గ‌ధ‌గా మెరిసిపోవ‌చ్చు.

* బ్లాక్ క‌ల‌ర్ స‌న్న‌ని బోర్డ‌ర్ ఉన్న వైట్ అసెమిట్రిక‌ల్ ఫ్రాక్‌కి బ్లాక్ హీల్స్ జ‌త చేసి, రెడ్ లిప్స్‌తో హాట్ స‌మ్మ‌ర్‌లోనూ కూల్ లుక్స్‌తో అందంగా క‌నిపిస్తున్న లావ‌ణ్య‌ను చూశారా? స‌మ్మ‌ర్‌కి ఈ త‌ర‌హా ఫ్రాక్స్ చ‌క్క‌ని ఎంపిక అంటే మీరు కాదంటారా??
 

 

 


View this post on Instagram


Ride the energy of your own unique spirit. 🍀🌼


A post shared by Lavanya T (@itsmelavanya) on
* స‌మ్మ‌ర్‌లో కూల్ లుక్స్ కోసం ఎక్కువ‌మంది ఎంపిక చేసుకునే షేడ్‌లో లైట్ గ్రీన్ కూడా ఒక‌టి. మ‌రి తెలుపు, లైట్ గ్రీన్ కాంబినేష‌న్‌లో రూపొందించిన అవుట్ ఫిట్ ధ‌రిస్తే?? ఫ‌్రెష్ లుక్‌లో మెరిసిపోవాల్సిందే. కావాలంటే లావ‌ణ్య‌ని చూడండి. వైట్ & లైట్ గ్రీన్ క‌ల‌ర్ కాంబినేష‌న్‌లో డిజైన్ చేసిన ప్లెయిన్ శారీలో ఫ్రెష్ లుక్‌లో ఎలా మెరిసిపోతోందో..

* పేస్ట‌ల్ షేడ్‌లో ఉన్న జంప్ సూట్ ధ‌రించి వైట్ బెల్ట్ జ‌త చేసి కూల్‌గా క‌నిపిస్తున్న లావ‌ణ్య‌ను చూశారా?? ప‌్లెయిన్ షేడ్స్ తరహాలో లైట్‌గా ఉన్న క‌ల‌ర్స్‌ని ఎంపిక చేసుకుని కాలేజీ అమ్మాయిలు స్టైలిష్‌గా క‌నిపించ‌డానికి ఇవి చ‌క్క‌ని ఎంపిక‌. పైగా యాక్సెస‌రీస్ కూడా ఎక్కువ‌గా పెట్టుకోవాల్సిన ప‌ని ఉండ‌దు.


ఇవి లావ‌ణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న కొన్ని ఫ్యాష‌న్స్ మాత్ర‌మే.


ఈ అమ్మ‌డి స్టైల్ ఫైల్ పూర్తిగా చూడాల‌నుకుంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పై మీరూ ఓ లుక్కేయాల్సిందే..


ఇవి కూడా చదవండి


కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!


నివేదా థామస్ ఫ్యాషన్స్ సింపుల్ మాత్రమే కాదు.. స్టైలిష్ కూడా..!


భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..