నివేదా థామస్ ఫ్యాషన్స్ సింపుల్ మాత్రమే కాదు.. స్టైలిష్ కూడా..! | POPxo

నివేదా థామస్ ఫ్యాషన్స్ సింపుల్ మాత్రమే కాదు.. స్టైలిష్ కూడా..!

నివేదా థామస్ ఫ్యాషన్స్ సింపుల్ మాత్రమే కాదు.. స్టైలిష్ కూడా..!

నివేదా థామ‌స్ (Nivetha Thomas).. జెంటిల్ మెన్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి. తెలుగు కంటే ముందు త‌మిళ‌, మలయాళ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న స‌త్తా చాటిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన కొద్ది కాలంలోనే ప్రేక్షకుల‌కు బాగా చేరువైపోయింది.


జెంటిల్ మెన్ త‌ర్వాత నిన్ను కోరి.., జై ల‌వ‌కుశ వంటి హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ సుంద‌రి ప్ర‌స్తుతం తెలుగులో బ్రోచేవారెవ‌రురా?, శ్వాస చిత్రాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ద‌ర్బార్ అనే త‌మిళ సినిమాలోనూ న‌టిస్తోంది. రీల్ లైఫ్‌లో ఎంతో సింపుల్‌గా క‌నిపించే ఈ అందాల బొమ్మ రియ‌ల్ లైఫ్‌లోనూ అలానే ఉంటుందంటే మీరు న‌మ్ముతారా??


కానీ ఇది నిజ‌మండీ.. కేవ‌లం రెగ్యుల‌ర్ లైఫ్‌లోనే కాదు.. ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాలు, ఫంక్ష‌న్ల‌కు హాజ‌ర‌య్యేట‌ప్పుడు కూడా నివేదా చాలా సింపుల్‌గానే ర‌డీ అవుతుంది. ఆమె ఫాలో అయ్యే ఫ్యాష‌న్స్ కూడా అంతే సింపుల్‌గా ఉంటాయ‌ని మీకు తెలుసా?? కావాలంటే ఈ అమ్మ‌డి స్టైల్ ఫైల్‌లో కొన్ని స్టిల్స్ మీరూ చూడండి..

* పార్టీల‌కు హాజ‌రుకావాల‌న‌గానే చాలామంది కాస్త హెవీగా క‌నిపించే అవుట్ ఫిట్ లేదా ఎంబ్రాయిడ‌రీ, సీక్వెన్స్, క్రిస్ట‌ల్స్.. ఇలా బాగా హైలైట్ అయ్యే వ‌ర్క్ ఉన్న అవుట్ ఫిట్‌ని ఎంచుకుంటూ ఉంటారు.


కానీ నివేదా థామ‌స్ ఇందుకు భిన్నం. ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్‌లో ఉన్న ప్లెయిన్ గౌన్‌కి గోల్డ్ బెల్ట్‌ని జ‌త చేసి ఎంత సింపుల్‌గా మెరిసిపోతోందో చూడండి.. పైగా ఈ అవుట్ ఫిట్‌కి చెవి రింగులు త‌ప్ప పెద్ద‌గా యాక్సెస‌రీలు కూడా పెట్టుకోలేదు.

* స‌మ్మ‌ర్‌లో చాలామంది లైట్ క‌ల‌ర్ అవుట్ ఫిట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నివేదా కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు.. లైట్ పింక్ షేడ్‌లోని ప్రింటెడ్ మిడీ‌కి మ్యాచింగ్ ఫుట్ వేర్‌తో పాటు; చ‌క్క‌ని స్టేట్ మెంట్ ఇయ‌ర్ రింగ్స్ కూడా జ‌త చేసి స్టైలిష్‌గా క‌నిపిస్తోంది క‌దూ..
 

 

 


View this post on Instagram


A post shared by Nivetha Thomas (@i_nivethathomas) on
* రెగ్యుల‌ర్ అవుట్ ఫిట్స్‌తో పోలిస్తే లేయ‌ర్డ్ అవుట్ ఫిట్స్‌తో వ‌చ్చే లుక్ చాలా స్పెషల్ అని చెప్పాలి. సీజ‌న్‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతున్నారు నేటి అమ్మాయిలు.


ముఖ్యంగా ఈ స‌మ్మ‌ర్‌లో లేయ‌ర్డ్ ఫ్యాష‌న్ ధ‌రించాల‌నుకునేవారు.. మ‌న నివేదాని ఫాలో అయితే స‌రి.. మ్యాచింగ్ స్నీక‌ర్స్, ఇయ‌ర్ రింగ్స్‌తో ఆమె ఫ్యాష‌న‌బుల్‌గా మెరిసిపోతోంది క‌దూ..

* శుభ‌కార్యాల‌కు హాజ‌ర్యేట‌ప్పుడు కాస్త ప్రత్యేకంగా క‌నిపించాల‌ని అంతా భావిస్తారు. అందుకోసం స్పెష‌ల్‌గా క‌నిపించేందుకు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తారు కూడా.. కానీ నివేదాని చూడండి.. గోల్డ్ త్రెడ్ వ‌ర్క్ ఉన్న బ్లూ క‌ల‌ర్ చుడీదార్‌కి ఒకేఒక్క చోక‌ర్ జ‌త చేసి ఎంత అందంగా క‌నిపిస్తుందో..

* అమ్మాయిల వార్డ్ రోబ్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉండే అవుట్ ఫిట్స్‌లో బ్లాక్ క‌ల‌ర్ డ్ర‌స్ కూడా ఒక‌టి. అది చీర‌, డ్ర‌స్, వెస్ట్ర‌న్ మోడ‌ల్.. ఏదైనా కావ‌చ్చు. నివేదా స్టైల్ ఫైల్‌లో కూడా బ్లాక్ భాగ‌మే.


కాక‌పోతే దానిని ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు భిన్నంగా ధ‌రిస్తూ ఉంటుంది. కావాలంటే మీరే చూడండి.. బ్లాక్ క‌ల‌ర్ చుడీదార్ అండ్ స‌న్న‌ని బెల్ట్ జ‌త చేసిన ఈ చిన్న‌ది మ్యాచింగ్ ఫుట్ వేర్‌తోనే త‌న లుక్‌ని పూర్తి చేసి ప‌ర్ఫెక్ట్ అనిపించుకుంది.

* ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఉండే ఎవ‌ర్ గ్రీన్ ఫ్యాష‌న్స్‌లో వింటేజ్ ఫ్లోర‌ల్ ప్రింట్స్ కూడా ఒక‌టి. వీటిని సెల‌బ్రిటీలు ఎప్ప‌టిక‌ప్పుడు ర‌క‌ర‌కాలుగా ధ‌రిస్తూనే ఉంటారు. నివేదా కూడా అదే పని చేసింది. వింటేజ్ ఫ్లోర‌ల్ ప్రింటెడ్ జంప్ సూట్ త‌ర‌హా డ్ర‌స్‌లో కూల్ లుక్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
 

 

 


View this post on Instagram


Styling by @lavanyabathina Outfit : @sourabhkantshrivastava Accessories : @divya_varun_official and @bellofox PC : @seethauday


A post shared by Nivetha Thomas (@i_nivethathomas) on
* లెహెంగా అన‌గానే చాలామంది డిజైన‌ర్ లేదా ప్రింటెడ్ త‌ర‌హావి ఎంచుకుంటూ ఉంటారు. కానీ ప్లెయిన్ లెహెంగా కూడా అంద‌మైన లుక్ ఇస్తుంద‌ని మీకు తెలుసా?? చూడండి.. ప్లెయిన్ లైట్ పింక్ లెహెంగాకి డిజైన‌ర్ బ్లౌజ్‌ని జ‌త చేసి భ‌లేగా మెరిసిపోయింది మ‌న నివేదా.
 

 

 


View this post on Instagram


Styling by @lavanyabathina Outfit : @sourabhkantshrivastava Accessories : @divya_varun_official and @bellofox PC : @seethauday


A post shared by Nivetha Thomas (@i_nivethathomas) on
* బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్‌లో ఫ్లోర‌ల్ ప్రింటెడ్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతోన్న నివేదాని చూశారా?? కాలేజ్ గ‌ర్ల్‌లా భ‌లే స్టైలిష్‌గా ఉంది క‌దూ.. చేతికి రిస్ట్ వాచ్ ఒక్క‌టి పెట్టుకుని ఫ్యాష‌న‌బుల్ హ్యాండ్ బ్యాగ్‌తో ఉన్న ఈ లుక్‌లో మీరూ మెరిసిపోవ‌చ్చు. కావాలంటే ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.


ఇవి కూడా చదవండి


 భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..


స్టైలిస్ట్ అవుట్ ఫిట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా.. నిలుస్తోన్న సంజ‌నా గ‌ల్రానీ..!


నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..

Read More from Fashion

Load More Fashion Stories