#ToMaaWithLove 'మదర్స్ డే' కానుకగా.. ఈ స్టార్ రెస్టారెంట్లకు అమ్మను తీసుకెళదాం..!

#ToMaaWithLove 'మదర్స్ డే' కానుకగా.. ఈ స్టార్ రెస్టారెంట్లకు అమ్మను తీసుకెళదాం..!

ప్రతి రోజూ మన కోసం అన్ని పనులు చేసి పెడుతుంది అమ్మ. నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకొనేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మరి అలాంటి అమ్మ కోసం మనమూ ఏదైనా చెయ్యాలి కదా. అందుకే ఈ మదర్స్ డే (Mothers day) నాడు సరదాగా అలా హోటల్‌కి తీసుకెళ్లి తనతో కలసి డిన్నర్ లేదా లంచ్ చేయండి. తను చాలా సంతోషిస్తుంది.


పైగా రోజువారి పని నుంచి కాస్త విశ్రాంతి ఇచ్చినట్టూ ఉంటుంది. అందుకే మీ కోసం లంచ్, డిన్నర్ చేసేందుకు కొన్ని బెస్ట్ స్టార్ రెస్టరెంట్లు మీకు పరిచయం చేస్తున్నాం. వాటిలో మీకు దగ్గరగా ఉండే చోటకు వెళ్లి మదర్స్ డే సందర్భంగా సరదాగా కలిసి భోం చేస్తూ అమ్మతో కాసేపు గడపండి మరి.


1. ది ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్ (The Fisherman's Wharf), గచ్చిబౌలి


4-mothers-day-the-fishermans -wharf


Image: Trip Advisor


మీ అమ్మగారికి సీఫుడ్ అంటే బాగా ఇష్టమా? అయితే ఈ మదర్స్ డే నాడు మీరు ఆమెను కచ్చితంగా గచ్చిబౌలిలోని ది ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్‌కి తీసుకెళ్లాల్సిందే. కోస్తా తీరంలో మాత్రమే దొరికే సముద్రపు చేపల రుచిని ఆమెకు బహుమతిగా అందించండి. ఓ పక్కన సముద్రపు చేపలు, రొయ్యలు, పీతల రుచిని ఆస్వాదిస్తూ.. మరో పక్క లైవ్ మ్యూజిక్‌ను కూడా ఎంజాయ్ చేయచ్చు. ఇక్కడ మీరు బటర్ గార్లిక్ ప్రాన్స్‌ను కచ్చితంగా ట్రై చేయాల్సిందే.


ఎక్కడ: 304, పుప్పాలగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, ఐఎస్బీ-అవుటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్.


ధర: రూ. 1800 (ఇద్దరికి సుమారుగా)


Also Read: తండ్రి కోసం ప్రత్యేక బహుమతి ఆలోచనలు (Unique Gift Ideas For Fathers)


2. లిటిల్ ఇటలీ (Little Italy), హైటెక్ సిటీ


6-mothers-day-little-italy


Image: Trip Advisor


ఇటాలియన్ ఫుడ్ రెసిపీస్‌తో మీ అమ్మగారిని సర్ప్రైజ్ చేయాలనుకొంటే హైటెక్ సిటీలోని లిటిల్ ఇటలీకి తీసుకెళ్లాల్సిందే. ముఖ్యంగా ఆవిడ శాఖాహారి అయితే మాత్రం కచ్చితంగా ఇక్కడ మదర్స్ డే ట్రీట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ దొరికే కాన్నెల్లొని అల్లా ఫ్లోరెంటీనాను మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.


ఎక్కడ: థర్డ్ ఫ్లోర్, బీకే టవర్స్, హుడా టెక్నో ఎన్క్లేవ్, సైబర్ టవర్స్ దగ్గర, సెక్టర్ 2, హైటెక్ సిటీ, హైదరాబాద్.


ధర: రూ. 1800 (ఇద్దరికి సుమారుగా)


3. సీజనల్ టేస్ట్, హైటెక్ సిటీ


5-mothers-day-seasonal-taste


Image: Zomato


దేశీ, విదేశీ వంటకాలతో కూడిన ట్రీట్ మదర్స్ డే సర్ప్రైజ్‌గా ఇవ్వాలనుకొంటే సీజనల్ టేస్ట్ సరైన ఎంపిక. ఇండియన్ వంటకాలతో పాటు యూరోపియన్, చైనీస్, కాంటినెంటల్ వంటకాలను ఇక్కడ రుచి చూడొచ్చు.


ఎక్కడ: ది వెస్టిన్ హైదరాబాద్, మైండ్ స్పేస్, రహేజా ఐటీ పార్క్, హైటెక్ సిటీ, హైదరాబాద్.


ధర: రూ 2500 (ఇద్దరికి సుమారుగా)


4. అమోఘం- ది లేక్ వ్యూ రెస్టారెంట్, ఖైరతాబాద్


2-mothers-day-amogham


Image: Zomato


మీ అమ్మగారికి బిర్యానీ అంటే ఇష్టమా? అయితే ఘుమఘుమలాడే బిర్యానీ రుచులు ఆస్వాదిస్తూ అమోఘం రెస్టరెంట్లో మదర్స్ డే జరుపుకోండి. బిర్యానీతో పాటు మొఘలాయి రుచులు, సంప్రదాయ భారతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడొచ్చు.


ఎక్కడ: ఖైరతాబాద్, హుస్సేన్ సాగర్, హైదరాబాద్


ధర: రూ. 1000 (ఇద్దరికి సుమారుగా)


5. విస్తా (ది పార్క్), విశాఖపట్నం


1-mothers-day-park-viazag


Image: Flickr


ది పార్క్ హోటల్లోని విస్తా రెస్టారెంట్లో భోజనమంటే ఓ అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవాలి. విశాల సముద్రపు గలగలలను ఆస్వాదిస్తూ సాగే ఈ డిన్నర్ మీకు చక్కటి అనుభూతిని మిగులుస్తుందంటే అతిశయోక్తి కాదు.


ఎక్కడ: ది పార్క్ హోటల్, బీచ్ రోడ్, విశాఖపట్టణం


ధర: రూ. 1000 (సుమారుగా)


6. హోటల్ విన్సార్ పార్క్, విశాఖపట్నం


3-mothers-day- winsar-park


Image: Trip Advisor


వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇండియన్, చైనీస్, సీ ఫుడ్.. ఏదైనా సరే ఇక్కడ చాలా రుచిగా ఉండటంతో పాటు బడ్జెట్లోనూ దొరుకుతుంది. వీగన్స్ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకమైన మెనూ ఉంది. 


ఎక్కడ: కేజీహెచ్ ఎదురుగా, మహారాణిపేట, విశాఖపట్నం


ధర: రూ. 1000(సుమారుగా)


మదర్స్ డే కానుకగా మీ అమ్మగారికి బహుమతి ఇవ్వాలనుకొంటున్నారా? POPxo Shop నుంచి ఓ అందమైన బహుమతిని కొనుగోలు చేసి ఈరోజును ఆమెకు మరింత ప్రత్యేకంగా మార్చండి. మీకోసం మేము ఈ సెంటెడ్ సెట్ క్యాండిల్స్‌ను రికమెండ్ చేస్తున్నాం.


fb-mothers-day-lunch-gift


ధర: రూ 1299.


డిస్కౌంట్లో లభించే ధర: 909


క్యాండిల్స్ ఇక్కడ కొనుగోలు చేయండి.


ఇవి కూడా చదవండి:


 'మదర్స్ డే' రోజు అమ్మకు.. మర్చిపోలేని మధుర కానుకను అందించండి..!


అమ్మ కోసం ఎన్ని వేల సంతకాలో..! మాతృదినోత్స‌వ కానుకగా గిన్నిస్ రికార్డ్..!