నేను బిగ్ బాస్‌కి సెలక్ట్ అయ్యానా.. రూ.30 లక్షల రెమ్యూనరేషనా: యాంకర్ లాస్య

నేను బిగ్ బాస్‌కి సెలక్ట్ అయ్యానా.. రూ.30 లక్షల రెమ్యూనరేషనా: యాంకర్ లాస్య

తెలుగు బుల్లితెర నటిగా, యాంకర్‌గా సుపరిచితురాలు లాస్య (Lasya). ఇటీవలే ఈమె బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆమె బిగ్ బాస్‌ షోలో పాల్గొనబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఆమె ఆ షోకి ఎంపిక అయ్యారని.. దాదాపు రూ.30 లక్షల రూపాయలు పారితోషికంగా ఆమెకు ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో సైతం గాసిప్స్ వచ్చాయి.

అయితే ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు లాస్య. ఇలాంటి వార్తలు వినడానికి చాలా బాగుంటాయని, కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారామె. "బిగ్ బాస్ (Bigg Boss) షోలో లాస్య పాల్గొంటోంది. ఆమెకు రూ.30 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని యూట్యూబ్ ఛానల్స్ రాశాయి. వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఈ ఫేక్ న్యూస్ కూడా జనాలు ఎలా  నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు" అని తెలిపింది లాస్య.

Anchor Lasya (Instagram)

2017లో లాస్య వివాహం మంజునాథ్ అనే వ్యక్తితో జరిగింది. తనకు రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. పైగా తనకు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చినా.. చేయలేనని తెలిపింది లాస్య. "నాకు రెండు నెలల బాబు ఉన్నాడు. ఈ ఏడాది అంతా తనతోనే నాకు గడపాలని ఉంది. ఆ టైం నాకు మళ్లీ మళ్లీ రాదు. అందుకే ఈ సారి నాకు ఇలాంటి షోలో అవకాశం వచ్చినా.. చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తా. వచ్చేసారి అవకాశం వస్తే చూస్తా" అని తెలిపిందామె.

లాస్య మా మ్యూజిక్ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన.. సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో రవితో కలిసి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరి పెయిర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత లాస్య మొండి మొగుడు పెంకి పెళ్లాం, ఢీ, మా ఊరి వంట లాంటి షోల్లో కూడా యాంకర్‌గా చేసింది.

ఈ కథనం కూడా చదవండి: "బిగ్ బాస్ 3" తెలుగు రియాల్టీ షో.. కంటెస్టంట్స్ వీరేనా..?

Anchor Lasya - Manjunath (Instagram)

లాస్య ఓ తెలుగు చిత్రంలో కూడా నటించింది. 2017లో విడుదలైన "రాజా మీరు కేక" సినిమాలో ఆమె టాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఆమె స్వస్థలం తిరుపతి. కానీ హైదరాబాద్ సిబిఐటిలోనే ఆమె ఇంజనీరింగ్ చేసింది. తర్వాత టెలివిజన్ కెరీర్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్‌లో కూడా చేయనుందని కొన్ని ఫేక్ వార్తలు రావడం విశేషం.

ఎండిమోల్ షైన్ ఇండియా సంస్థ, భారతదేశంలో వివిధ భాషల్లో బిగ్ బాస్ షోలు ప్రారంభించడానికి.. అనేక సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టింది. హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో సక్సెస్ అయ్యాక, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఇదే షోని తెరకెక్కించారు. తమిళంలో కమల్ హాసన్ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్.. సెకండ్ సీజన్‌లో నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కథనం కూడా చదవండి: బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తానంటోన్న రేణు దేశాయ్

Raja Meeru keka - Movie Poster

బిగ్ బాస్ షోకి ఎంతమంది అభిమానులైతే ఉన్నారో.. ఆ షో మీద అన్నే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పార్టిసిపెంట్స్‌కు ఇస్తున్న టాస్క్‌ల విషయంలోనూ పలు వివాదాలున్నాయి. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్.. ఇక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. శివబాలాజీ ఈ షోలో విజేతగా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచారు. హరితేజ, నవదీప్, అర్చన మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు.

ఇదే సీజన్‌లో దీక్ష పంత్, ప్రిన్స్, ముమైత్ ఖాన్, కత్తి కార్తీక, ధనరాజ్, కల్పన, మహేష్ కత్తి, సమీర్, మధుప్రియ, సంపూర్ణేష్, జ్యోతి పార్టిసిపెంట్స్‌గా పాల్గొన్నారు. రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ, సచిన్ జోషి, అల్లరి నరేష్, కళ్యాణ్ రామ్, సునీల్ లాంటి టాలీవుడ్ నటులు బిగ్ బాస్ మొదటి సీజన్‌ని తమ చిత్రాలకు ప్రమోషన్ క్యాంపెయిన్‌గా కూడా వాడుకున్నారు.

Bigg Boss (Telugu) Season 1 Winner - Shiva Balaji (Instagram)

ఇక బిగ్ బాస్ సీజన్ 2 విషయానికి వస్తే.. నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ షోలో కౌశల్ మండా విన్నర్‌గా నిలవగా.. గీత రన్నరప్‌గా నిలిచారు. తనీష్, దీప్తి, సామ్రాట్ మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. రోల్ రైడా, అమిత్ తివారి, శ్యామల, నూతన నాయుడు, గణేష్, పూజ, దీప్తి, బాబు గోగినేని, నందిని రాయ్, తేజస్వి, భాను, కిరీటి, సంజన  పార్టిసిపెంట్స్‌గా పాల్గొన్నారు.

ఇప్పుడు మూడవ సీజన్ పై కూడా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పార్టిసిపెంట్స్ పై పుకార్లు వస్తున్నాయి. శోభిత ధూళిపాళ, గుత్తా జ్వాల, లాస్య మొదలైనవారు ఈ షోలో పాల్గొననున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని వారు ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

ఈ కథనం కూడా చదవండి: బిగ్ బాస్ 3 గురించి ఎవరికీ తెలియని సీక్రెట్‌ : హౌస్‌లోకి వెళ్లేదెవరో తెలుసా?

Bigg Boss (Telugu) Season 2 Winner - Kaushal Manda (Instagram)

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.