ఈ రోజు (జూన్ 1) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు మీరు ఇచ్చే ప్రాధాన్య క్రమం ఆధారంగానే పనులు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను సక్రమంగా పూర్తి చేసేందుకు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకో స్పష్టత ఏర్పడుతుంది. పెండింగ్‌లో ఉన్న ఐడియాలను కూడా ఈ రోజు మీరే ఛార్జ్ తీసుకొని అమలు చేస్తారు. ఫలితంగా పని చాలా ఫలవంతంగా ముందుకు వెళ్తుంది. అధిక సమయం పనిలోనే గడపడం వల్ల కుటుంబ సభ్యులతో కాస్త తక్కువగా సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది.
వృషభం (Tarus) – ఈ రోజు మీ మనసు చెప్పింది వింటూ పని చేస్తూనే.. మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీరు చాలా వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీ బాస్, క్లయింట్స్, సహచరులు.. మీ నుంచి చాలా ఆశిస్తారు. ఫలితంగా మీకు కాస్త చిరాగ్గా అనిపించవచ్చు. కాబట్టి ఒకసారి ఒక పని చేస్తూ దాని ద్వారా సాధించాల్సిన లక్ష్యంపైనే ఫోకస్ చేయండి.
మిథునం (Gemini) – మీ జీవితంలో మీరు ఈ రోజు అన్ని అంశాల్లోనూ అందరినీ ఆకర్షిస్తారు. మీరు కొత్త ప్రజెంటేషన్స్ చేయాలన్నా, ఏవైనా డీల్స్ ఫైనలైజ్ చేయాలన్నా, కొత్త జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఈ రోజు చాలా మంచిది. మీరు ఆఫీసులో ఇతరులకు సహాయం చేస్తే వారు కూడా మీకు సహాయం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఎవరిని నమ్ముతారు? వారితో ఎలాంటి విషయాలు పంచుకుంటారనే విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పని కాస్త నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న పనిని కూడా మీరు పూర్తి చేసేస్తారు. మీ కుటుంబ సభ్యులు గతంలో.. ఇతరులకు సంబంధించిన జీవిత విశేషాల గురించి మీ వద్ద ప్రస్తావిస్తారు. వారి జీవితంతో మీకూ ఏదో ఒక బంధం ఉండే ఉంటుంది. కాబట్టి వారు చెప్పేది శ్రద్ధగా వినండి.
సింహం (Leo) – ఈ రోజు మీరు చేసే పనిలో పెద్దగా మార్పులు ఉండవు. కానీ పని విషయమై మీ సలహాలు తీసుకోవడానికి లేదా గైడెన్స్ పొందడానికి కొందరు మీ వద్దకు వస్తారు. గతంలో మీకు పరిచయం ఉన్న ఓ వ్యక్తితో ఒక కొత్త డీల్ లేదా ప్రాజెక్ట్, ఐడియాని మీరు ప్రతిపాదిస్తారు. అలాగే మీరు గడిపే అధిక పని గంటలు మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించవచ్చు. అయితే సాయంత్రం అయ్యే సరికి చాలా సంతోషంగా సమయం గడుపుతారు.
కన్య (Virgo) – ఈ రోజు అన్నీ మీరు ఊహించిన విధంగా, ప్లాన్ చేసుకున్నట్లుగానే జరుగుతాయి. అయితే ప్లాన్ చేసే క్రమంలో మీరు పరిగణనలోకి తీసుకోని కొన్ని అంశాల కారణంగా అనుకోని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇవి మిమ్మల్ని ఇబ్బందిపెట్టడమే కాదు.. చిరాకును కూడా కలిగేలా చేస్తాయి. మీరు నిస్సహాయులని మీకు అనిపించేలా చేస్తాయి. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి.
తుల (Libra) – మీ సహచరులతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. వారి మనసులో ఉన్న విషయాలను మీరు అర్థం చేసుకోలేని కారణంగా తలెత్తే చిన్న చిన్న అపార్థాలు పనిపై ప్రభావం చూపిస్తాయి. మీ అభద్రతాభావనలకు మిమ్మల్ని మానసికంగా వెంటాడే అవకాశం ఇవ్వకండి. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించి మీకు ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. బయటకు వెళ్లినప్పుడు చాలామంది కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడవచ్చు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. దాంతో చాలా బిజీగా గడుపుతారు. వాటిని కొత్తగా చేస్తూనే ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. పనిలో బిజీగా ఉన్న కారణంగా.. ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేయవద్దు.
ధనుస్సు (Saggitarius) – మీరు చేయాల్సిన పని చాలా ఉన్నప్పటికీ ఇతరుల కారణంగా ఆ పనిలో జాప్యం జరగవచ్చు. అలాగే తప్పిదాలు కూడా దొర్లవచ్చు. దానికి మీరు కానీ.. మీ పని సామర్థ్యంలో ఉన్న లోపాలు కానీ కారణం కాదని గ్రహించండి. సహనంతో వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి మీతో సమయం గడపాలని బలంగా కోరుకుంటున్నారు. వారికి సమయం కేటాయించండి.
మకరం (Capricorn) – ఈ రోజంతా మీరు మీ భవిష్యత్ కెరీర్ ప్రణాళికల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ వాటిని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం చాలా టీం వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే.. మీ మెదడులో ఉన్న అనవసర ఆలోచనల నుంచి కూడా మీరు బయటపడాల్సి ఉంటుంది.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జరిగే వాటిని జరగనీయండి. రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయి. అయితే మీ జీవితంలో జరుగుతున్న మంచి గురించి ఎవరితోనూ చర్చించకండి. మీ కుటుంబ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టండి.
మీనం (Pisces) – మీరు గతంలో పడిన శ్రమ, కష్టానికి నేడు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ కలలను నిజం చేసుకునేందుకు గల.. కొత్త మార్గాలు లేదా సాధ్యాసాధ్యాలకు సంబంధించి మీకో స్పష్టత వస్తుంది. అయితే మీరేం చేయాలనే విషయంలో మాత్రం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొండి పట్టుదలతో ఆలోచిస్తే దెబ్బతినేది మీరే అని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవపడకండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించండి.
Credit: Asha Shah
ఇవి కూడా చదవండి
నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!