మీ రాశిఫలాలు వీక్షించండి.. విజయాల బాటలో పయనించండి

మీ రాశిఫలాలు వీక్షించండి..  విజయాల బాటలో పయనించండి

ఈ రోజు (జూన్ 16) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు  మీకు కుటుంబపరమైన ఒత్తిళ్ల కారణంగా పనిపై ఫోకస్ చేయడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. అంతమాత్రాన మీ కుటుంబ సభ్యులను నిందించకండి. వారి స్వేచ్ఛ వారికి ఉండనీయండి. చివరి నిమిషంలో ప్లాన్ చేసుకున్నప్పటికీ స్నేహితులతో కలిసి సంతోషంగా సమయం గడపడానికి ప్రయత్నించండి. 

వృషభం (Tarus) – ఈ రోజు పనిలో సహచరులు చేసే పొరపాట్ల కారణంగా.. మీకు కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. అలాగని పనులన్నీ ఒకేసారి పూర్తి చేయడానికి ప్రయత్నించకండి. వాటికి అవసరమైన సమయం వాటికి ఇవ్వండి. అలాగే మీ కుటుంబ సభ్యులు చెప్పేది ఏకాగ్రతతో వినండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. 

మిథునం (Gemini) –  ఈ రోజు ఆఫీసులో మీ సహచరులు.. మీలా ఆలోచించని కారణంగా  కాస్త ఇబ్బంది కలగవచ్చు. ప్లానింగ్ లేకుండా పనులు మొదలు పెట్టడం వల్ల.. వర్క్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆత్మస్థైర్యంతో వ్యవహరించడానికి ప్రయత్నించండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ క్రియేటివ్ ఎనర్జీస్‌ని సక్రమమైన దారిలో వినియోగించుకోండి. మీకు ఎన్నో ఐడియాలు ఉన్నప్పటికీ.. వాటిని అమలుపరచడానికి మీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న కారణంగా వెనకాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ల సలహాలు తీసుకోండి. వీలైతే మీ కుటుంబ సభ్యులు అందించే సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. 

సింహం (Leo) –  ఈ రోజు పనిలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ మూడో వ్యక్తి కారణంగా మీకు, మీ సహచరులకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తవచ్చు. అందుకే ఇతరులు ఏమి చెప్పినా.. కాస్త ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో నిజాయతీగా నిర్ణయం తీసుకోండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ భాగస్వామిని నొప్పించడానికి ఏ విధంగానూ ప్రయత్నించవద్దు. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు చేయాల్సిన పనులు ఓ వైపు చక్కగా పూర్తి చేస్తూనే.. చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. అయితే మీకు వచ్చే అసైన్‌మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. 

తుల (Libra) –  ఈ రోజు మీకు చాలా బిజీగా గడుస్తుంది.  మీ ఆలోచనలు ఫలప్రదమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త నిదానంగా ఆలోచించి పని చేయండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, కుటుంబంలో కలతలు రేపే ఎలాంటి విషయాలనూ ప్రోత్సహించవద్దు. అటువంటి ఆలోచనలు రేకెత్తించే వారికి దూరంగా ఉండండి. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీ పనిలో ఊహించని మార్పులు జరుగుతాయి. మీ ఐడియాలు అందరికీ నచ్చుతాయి. ఈ క్రమంలో మీకు అదనపు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉంది. అయితే మీరు నిజాయతీగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు వినే పాజిటివ్ వార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతాయి. ఫలితంగా మరిన్ని చక్కని నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు (Saggitarius) –  ఈ  రోజు మీ పనులు చాలా నిదానంగా సాగుతాయి. కానీ జాగరూకతతో వ్యవహరించండి. మీ పట్ల చాడీలు చెప్పేవారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీ చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.  ఇలాంటి సమయాల్లో వివేకంతో వ్యవహరించండి. 

మకరం (Capricorn) –  ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో మీరు అలసిపోయి ఉన్నారా? అయితే కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నాలు ప్రారంభించండి. అందుకు ఈ రోజే సరైన సమయం. అంతేకాదు.. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లండి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు ఆఫీసులో జరిగే ఓ ముఖ్యమైన సమావేశం మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అలాగే కొత్త వ్యక్తులతో కలిసి మీరు పని చేయాల్సి రావచ్చు. ఎవరైతే తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారో.. వారికి కూడా ఇది సరైన సమయం. అలాగే మీ కుటుంబ జీవితం కూడా సాఫీగా ముందుకు వెళ్తుంది.

మీనం (Pisces) – ఈ రోజు మొదటిభాగంలో పని కాస్త నిదానంగా జరిగినట్టు అనిపించినా.. రెండో భాగం మొదలయ్యే సమయానికి అంతా సర్దుకుంటుంది. కానీ మీరు అత్యుత్సాహంతో పనిని చెడగొట్టే ప్రయత్నం చేయకండి. పలు విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలుసుకోండి.  

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?