ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి

ఈ రోజు (జూన్ 3) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ఈ రోజు మీ పని చాలా నిదానంగా ముందుకు సాగుతుంది. కానీ గతంలో జరిగిన ఒక వివాదం కారణంగా మళ్లీ ఇబ్బందులు, సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి మీరు కూడా వివేకంతో వ్యవహరించి, సీనియర్స్ సలహాలు తీసుకోండి. మీరు చాలా పెద్ద విషయాన్ని మిస్ అవుతున్నారని గ్రహించండి.


వృషభం (Tarus) – మీ టీంలో ఓ వ్యక్తి కొత్తగా చేరడంతో పని చాలా చక్కగా సాగుతుంది. మీరు కూడా టీం మెంబర్స్‌కు పని కేటాయించడం, దానిని పూర్తి చేసేందుకు అవసరమయ్యే సలహాలు ఇస్తూ, ప్రణాళికలు రూపొందించేందుకు అధిక సమయం కేటాయించడం జరగుతుంది. ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి.. మీకు స్పష్టత వచ్చిన తర్వాత మరింత సానుకూలంగా స్పందిస్తూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.


మిథునం (Gemini) – ఈ రోజు నిదానంగా ప్రారంభమైనప్పటికీ.. సమయం గడిచే కొద్దీ పరిస్థితులన్నీ మీ అదుపులోకి వచ్చేస్తాయి. అయితే ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా మీరు పనిపై ఫోకస్ చేయలేరు. మీకు బదులుగా మీ పనిని పూర్తి చేసేందుకు ఆఫీసులో మీ సహచరులు సిద్ధంగా ఉంటారు. వారిని సహాయం అడిగి చూడండి.


కర్కాటకం (Cancer) – ఈ రోజు ఇంటర్వ్యూలు, ముఖ్యమైన సమావేశాలతో రోజంతా బిజీగా గడుస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఎదురుచూసే వారు ఓ అడుగు ముందుకు వేస్తారు. అయితే అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏకాగ్రతతో వ్యవహరించడం చాలా ముఖ్యం.


సింహం (Leo) –  మీరు ఈ రోజు చాలా అయోమయంలో ఉంటారు. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొత్త పనులు ప్రారంభించకండి. కొత్త డీల్ పై సంతకం చేయడానికి లేదా కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు అస్సలు మంచిది కాదు. వీలైనంత స్పష్టంగా ఇతరులతో కమ్యూనికేట్ చేయండి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా, ప్రశాంతంగా వినండి.


క‌న్య (Virgo) –  ఈ రోజు చేయాల్సిన పని చాలా ఉన్నప్పటికీ చాలా యాంత్రికంగా అంతా జరిగిపోతుంది. ఫలితంగా పని చేయాలన్న ఆసక్తి కూడా మీకు ఉండదు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. జరిగేది జరగనీయండి. మీరు పరిస్థితులను ఎంతగా అదుపు చేయాలని ప్రయత్నిస్తే.. అవి మీ చేతుల నుంచి అంతగా చేజారిపోతాయి.


తుల (Libra) – ఈ రోజు పని చాలా ఫలవంతంగా జరుగుతుంది. తర్వాత ఏం చేయాలనే విషయంలో కూడా మీకో స్పష్టత వస్తుంది. మీరు చేయాల్సిన కొత్త పనికి సంబంధించి ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే మీ ఐడియాలను అమలు పరిచేందుకు ఇతరుల సహాయం కూడా మీకు అవసరం అవుతుంది.


వృశ్చికం (Scorpio) –  పని పరంగా ఈ రోజు చాలా బిజీగా గడుస్తుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ కుటుంబపరమైన విషయాల కారణంగా కొంత ఒత్తిడి వాటిపై ప్రభావం చూపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడడం వల్ల.. మీ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.


ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు చాలా ప్రణాళికబద్ధంగా గడుస్తుంది. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్న కారణంగా.. వాటిని పూర్తి చేసిందుకు ఓ పక్కా ప్రణాళిక రూపొందించుకోవడం చాలా అవసరం. అప్పుడే పనిలో తదుపరి నిర్ణయం తీసుకోగలరు. అలాగే అందరితోనూ వీలైనంత స్పష్టంగా కమ్యూనికేట్ చేయండి.


మకరం (Capricorn) –  మీరు చేయాల్సిన పనిలో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషించే వారు పాజిటివ్ వార్తలు వింటారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల గురించి వివేకంతో వ్యవహరించండి. మీ భాగస్వామి కూడా మీకు సహకరిస్తారు.


కుంభం (Aquarius) –  మీరు ఈ రోజు చాలా ఆందోళనతో  నిద్ర లేస్తారు. చేసే పనిలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ మీకున్న అభద్రతా భావన, అసహనం మిమ్మల్ని పాజిటివ్‌గా ఆలోచించనీయవు. కాబట్టి కాస్త సమయం కేటాయించి మీ గురించి బాగా తెలిసిన వ్యక్తిని కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకోండి.


మీనం (Pisces) – ఈ రోజు పని చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే విమర్శలను స్వీకరించేందుకు కూడా మీరు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం ఉన్న క్లయింట్స్ నుంచే కొత్త ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. మీ సమయాన్ని ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయించుకోండి.


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!