మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ రోజు పరిస్థితిని విశ్లేషించండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ రోజు పరిస్థితిని విశ్లేషించండి..!

ఈ రోజు (జూన్ 2) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీ వద్ద చాలా ఐడియాలు, వాటిని త్వరగా అమలుపర్చాలన్న ఆత్రుత ఉన్నప్పటికీ ఇతరులకు ఉన్న హద్దుల కారణంగా వాటిని అమలు చేయలేరు. కాబట్టి నిదానంగా ముందడుగు వేయండి. ముందుగానే కొన్ని ప్లాన్స్ సిద్ధం చేసుకున్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు వాటిలో మార్పులు చేసుకోండి.


వృషభం (Tarus) – మీరు చేసే పనులు, మీ ఆలోచనలు ఒకే దారిలో ఉండేలా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. లేదంటే అంతా ఒకేలా అనిపించినప్పటికీ.. అమల్లోకి వచ్చేసరికి అది వేరేలా మారిపోతుంది. ఫలితంగా మీ అనుబంధాల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. ఇటు శారీరకంగా, అటు మానసికంగా అలసిపోయినట్లు మీకు అనిపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.


మిథునం (Gemini) – మీరు ఈ రోజు చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నో పనులు చేయాలని అనుకున్నప్పటికీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా అన్నీ మీరు చేయలేకపోవచ్చు. అయితే మీరు అనుకున్న పనులు పూర్తి చేయడం కోసం వారిని బలవంత పెట్టడం కూడా సరికాదు. దీనికి బదులుగా స్వతంత్రంగా ఉంటూ మీరు చేయాలనుకున్నది చేయండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.


కర్కాటకం (Cancer) – ఈ రోజు చాలా మీరు సరదాగా గడుస్తుంది. మీకు నచ్చిన వ్యక్తులను కలుస్తూ, చేయాలనుకున్న పనులు చేస్తూ సంతోషంగా ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లిదండ్రుల గురించి కూడా మీరు జాగ్రత్త వహిస్తారు.  అయితే.. కుటుంబీకుల విషయంలో  మీరు సహనంతో వ్యవహరించడం చాలా అవసరం.


సింహం (Leo) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. మీరు రిలాక్స్ అవ్వాలని అనుకున్నప్పటికీ మీ చుట్టూ ఉన్నవారు మీ నుంచి చాలా ఆశిస్తారు. అలసట కారణంగా మీకు చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. అయితే దానిని ఎవ్వరి మీదా ప్రదర్శించకండి. సాయంత్రం సమయంలో మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. 


క‌న్య (Virgo) – మీరు ఈ రోజు చాలా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన పనులు, సహాయాలు.. అన్నీ మీ బంధాలపై ప్రభావం చూపిస్తాయి. అలాగే మీరు జీవితంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి కూడా ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి సమయం గడపాలనే ఉద్దేశంతో బయటకు వెళ్లేందుకో లేక సినిమా చూసేందుకో ప్లాన్ చేస్తారు. గతానికి సంబంధించిన వ్యవహారాల గురించి ఇప్పుడు చర్చించకండి.


తుల (Libra) –  మీకు ఇబ్బంది కలిగించే ఎలాంటి పరిస్థితులకైనా దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో మీరు కూడా అసహనంతో ఉంటారు. మీ మనసులో ఉన్నది వారితో చెప్పాలని అనుకుంటారు.. కానీ అందుకు ఈ రోజు సరైంది కాదు. కాబట్టి పరిణతితో వ్యవహరించి పరిస్థితులను చక్కదిద్దండి. అవసరమైతే ఇందుకోసం మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.


వృశ్చికం (Scorpio) – మీ రోజు చాలా నిదానంగా ప్రారంభం అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులతో చర్చించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే ఉంటాయి. సరైన విధంగా చర్చించి, నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సమర్థులు. కాబట్టి మీపై మీరు నమ్మకం ఉంచండి.


ధనుస్సు (Saggitarius) – ఈ రోజు చాలా ప్రశాంతంగా గడుస్తుంది. మీరు చేయాల్సిన క్రియేటివ్ వర్క్ చాలా వరకు పూర్తి చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలను కూడా పూర్తిగా, ప్రశాంతంగా వినండి. మీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.


మకరం (Capricorn) – ఈ రోజు మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పై కాస్త దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, మీకు మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించుకునేందుకు మీకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీతో వారి వ్యక్తిగత విషయాలు కూడా చర్చిస్తారు.


కుంభం (Aquarius) – మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులకు సంబంధించి.. ఈ రోజు మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే వారి మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. లేకపోతే తర్వాత మీరే పశ్చాత్తాపపడతారు. అలాగే మీ భాగస్వామి అవసరాలపై దృష్టి పెట్టండి. మీ కుటుంబ సభ్యులతో చివరి నిమిషంలో చేసుకునే ప్లాన్స్ కారణంగా సంతోషంగా గడుపుతారు.


మీనం (Pisces) – శారీరకంగా అంతా బాగానే ఉన్నట్లు మీకు కనిపించినా.. మానసికంగా మీరు చాలా ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా, డల్‌గా ఉంటారు. దీనికి ప్రత్యేకించి కారణం కూడా ఉండదు. ఇదొక దశ మాత్రమే. కాబట్టి దీని నుంచి బయటపడేలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మీకు నచ్చిన వ్యక్తులను కలిసి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!