ఈ రోజు (జూన్ 15) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ పట్ల కాస్త అసహనాన్ని ప్రదర్శించవచ్చు. అంతమాత్రాన మీరు వారిని కోప్పడాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా వారికి ప్రాధాన్యం ఇచ్చి, వారితో గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి. వీలైనంత వరకు స్నేహపూర్వకంగా వారితో మెలగండి.
వృషభం (Tarus) – ఈ రోజు పలువురు వ్యక్తుల వల్ల.. మీలో కాస్త అభద్రతాభావం కలగవచ్చు. కానీ మీ ఆత్మస్థైర్యంతో మీకు కలిగే అసౌకర్యాలను, ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యంగా, పలువురు మీ సలహా కోరి వచ్చినప్పటికీ.. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
మిథునం (Gemini) – ఈ రోజు పనిలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ మీరు నిర్వర్తించే బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఎదిగేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. మీ సహచరులు కూడా కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకోవడం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు.
కర్కాటకం (Cancer) – పని వేగంగానే ముందుకు వెళ్తున్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయని కారణంగా.. మీపై మీకే చిరాకుగా అనిపించవచ్చు. అయితే దీని కోసం మీరు అంతగా చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త వివేకంతో వ్యవహరించండి. అలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి.
సింహం (Leo) – మీకున్న కొత్త ఐడియాలను ఈ రోజు మీరు అమలుపరుస్తారు. వాటికి మీ చుట్టూ ఉన్నవారు కూడా సహకరిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీరు ప్రేమించే వ్యక్తితో అధిక సమయం గడిపడానికి కాస్త సమయం కేటాయించండి. కొన్ని మనస్పర్థలను దూరం చేసుకోవడానికి.. ఇది అనుకూలమైన సమయం.
కన్య (Virgo) – పని విషయంలో మీరు తీసుకోవాల్సిన.. తదుపరి నిర్ణయం గురించి మీకు స్పష్టత లభిస్తుంది. కాబట్టి ఆఫీసు పనిలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆఫీసులో మీరు నిర్వర్తించే బాధ్యతలు మాత్రం కాస్త పెరగవచ్చు. ఈ క్రమంలో మీ వ్యక్తిగత జీవితం గురించి మీ సహచరులెవ్వరితోనూ చర్చించకండి. సాయంత్రం సమయంలో మీ స్నేహితులతో సమయం గడపడం ద్వారా మనసు కాస్త కుదుటపడుతుంది.
తుల (Libra) – ఈ రోజు మీరు చేసే పనులపైనే ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి. ఆలోచనలు అనేకం ఉండి.. వాటిని అమల్లో పెట్టకపోతే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ పై అధికారుల నుండి మీకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. దానిని తట్టుకుని నిలబడండి.
వృశ్చికం (Scorpio) – మీరు చేసే పనిలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ ఒక కొత్త డీల్ లేదా కాంట్రాక్ట్ గురించి మీరు చర్చలు ప్రారంభిస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పలు వ్యక్తిగత సమస్యల వల్ల మీకు కాస్త ప్రశాంతత లోపించవచ్చు. మీతో మీరు ఒంటరిగా గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి.
ధనుస్సు (Saggitarius) – గత కొద్ది రోజులుగా మీ ఆర్థిక వ్యవహారాల విషయంలో.. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పలు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా సరే వివేకంతో ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ సహచరులతో వాదనలకు దిగడం లేదా వారితో గొడవపడడం వంటివి చేయకండి.
మకరం (Capricorn) – మీరు ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నా.. లేక కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా ఈ రోజు మీకో స్పష్టత వస్తుంది. క్రియేటివ్ మీడియాలో పని చేసే వారికి ఈ రోజు నుంచి అంతా లాభదాయకంగా సాగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అలాగే పలు కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
కుంభం (Aquarius) – మీరు పెండింగ్‌లో ఉన్న పనులు చేయాలని ప్రయత్నించినా.. అవి ముందుకు కదలవు. కాబట్టి వాటి గురించి మరీ ఎక్కువగా మీరు శ్రమించకండి. అలాగే సహచరులతో వాగ్వాదాలకు దిగకండి. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి.
మీనం (Pisces) – ఈ రోజు పలు లావాదేవీలు జరిపే విషయంలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా పేపర్ వర్క్‌లో ఎక్కువసేపు పాల్గొంటారు. అలాగే పని కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. మీరు చేయాల్పిన పనుల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. మీకు, మీ స్నేహితులకు మధ్య మనస్పర్థలు కలుగజేయాలని ఓ వ్యక్తి బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.
ఇవి కూడా చదవండి
ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?