ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ష్య సాధనకు కృషి చేయండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ష్య సాధనకు కృషి చేయండి

ఈ రోజు (జూన్ 4) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం


 


మేషం (Aries) –  మీరు ఈ రోజుని చాలా మంచి ప్రణాళికతో ప్రారంభిస్తారు. అయితే మీ చుట్టూ ఉన్న వారి కారణంగా కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రోజు మీరు కొత్త లావాదేవీలు జరిపినప్పటికీ వాటికి సంబంధించిన ఫలితాలు మాత్రం ఇప్పట్లో రావు.


వృషభం (Tarus) –  మీరు చేసే పనిలో పెద్దగా మార్పులు ఉండవు. కానీ ఈ మధ్య ప్రారంభించిన పనిలో మాత్రం కొంత అభివృద్ది కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో జరిగిన ఏ విషయాల గురించి కూడా.. వర్తమానంలో చర్చించే ప్రయత్నం చేయకండి. లేదంటే తర్వాత మీరే పశ్చాత్తాపం పడాల్సి ఉంటుంది. 


మిథునం (Gemini) –  ఈ రోజు మీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. మీ చుట్టూ ఉన్నవారు ఈ తరహా ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయచ్చు. వారిచ్చే సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికల్లో.. చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా మీకు కాస్త చిరాకుగా అనిపించవచ్చు.


కర్కాటకం (Cancer) –  ఈ రోజు చాలా ఉల్లాసంగా గడుస్తుంది. అన్ని పనులూ మీకు అనుకూలంగానే జరుగుతాయి. ఏ విషయంలోనూ మొండిగా వ్యవహరించకండి. అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరిగినప్పటికీ.. ఎదుటివారి ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేయాలని ప్రయత్నించకండి. 


సింహం (Leo) –  ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ.. దానికి తగిన ఫలితాలు కూడా కనిపిస్తాయి. రోజు ముగిసే సమయానికి మీరు సాధించిన విజయాలను చూసి మీరు గర్విస్తారు. అయితే పనిలో అధిక సమయం గడపడం వల్ల.. కుటుంబ జీవితంపై దాని ప్రభావం పడవచ్చు. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి.


క‌న్య (Virgo) – ప్రస్తుతం మీరు చేపట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంది. కానీ మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కారణంగా ఆఫీసులో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారి వల్ల మీకు కలుగుతున్న అసౌకర్యం గురించి మీరు వారికి చెప్పాలని భావించినా.. అందుకు ఇది సరైన సమయం కాదని గ్రహించండి. కాబట్టి మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించడంపైనే ఫోకస్ చేయండి. 


తుల (Libra) – పేపర్ వర్క్‌లో ఉన్న ఇబ్బంది కారణంగా.. మీ పని కాస్త ఆలస్యంగా జరగవచ్చు. మీరు ఈ మధ్య ప్రారంభించిన కొత్త ప్రాజెక్టుల గురించి మీకు త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా మీ క్రియేటివిటీని ఉపయోగించండి. చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కుటుంబ జీవితం సాఫీగా ముందుకెళ్తుంది. మీ స్నేహితులతో కాసేపు సరదాగా సమయం గడపండి.


వృశ్చికం (Scorpio) – మీరు ఈ రోజు అంత ఉత్సాహంగా పనిచేయలేకపోవచ్చు. ఫలితంగా అధికారుల నుండి మందలింపుకి కూడా గురయ్యే అవకాశం ఉంది.  ఒక్కసారి మీ ప్రాధాన్యాల క్రమాన్ని సరిచూసుకుని వాటికి అనుగుణంగా పని చేయడానికి ప్రయత్నించండి. 


ధనుస్సు (Saggitarius) –  మీ బద్ధకం వల్ల ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఆ సమస్యల వల్ల మీకు ఎలాంటి నష్టమూ కలగదు. అదేవిధంగా మీరు ఇతరులకు అప్పగించిన బాధ్యతలను.. మరోసారి సరిచూసి అవసరమైతే మార్పులు – చేర్పులు చేయాలని భావిస్తారు. అయితే ఈ విషయంలో మరీ పట్టుదలతో వ్యవహరించడం కూడా మంచిది కాదు. మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలను స్వీకరించండి.


మకరం (Capricorn) – ఈ రోజు పని చాలా నిదానంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి  మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రోజు జరిగే ఓ ముఖ్యమైన సమావేశం.. మీరు ఊహించిన విధంగా జరగకపోవచ్చు. అయితే భవిష్యత్తులో మాత్రం తప్పకుండా మీరు కోరుకున్న ఫలితం వస్తుందని నమ్మండి. ఆశని వదులుకోకండి.


కుంభం (Aquarius) –  మీ మెదడులో ఉన్న అనేక ఆలోచనల కారణంగా ఈ రోజు పని కాస్త నెమ్మదిగా జరగవచ్చు. అయితే ప్రస్తుతం చేపట్టిన పని మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా యథావిథిగా ముందుకు సాగుతుంది. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీకో స్పష్టత ఏర్పడుతుంది. మీ దూరపు బంధువులను కలిసి వారితో సంతోషంగా సమయం గడుపుతారు.


మీనం (Pisces) – గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు లేదా చేసిన పొరపాట్ల కారణంగా పనిలో తప్పులు దొర్లవచ్చు. వాటికి ఇతరులను బాధ్యులుగా చేయకండి. మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేయాల్సి వస్తుంది. అయితే వారిని ఎంతవరకు నమ్మవచ్చు అనే విషయమై మీకు త్వరలో ఓ స్పష్టత వస్తుంది. మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వారికీ కాస్త సమయం కేటాయించండి.


ఇవి కూడా చ‌ద‌వండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ రోజు పరిస్థితిని విశ్లేషించండి..!