ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు (జూన్ 5) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు పూర్తిగా విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మధ్య మీరు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి ఈ ఒక్క రోజు పనికి దూరంగా ఉంటూ రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించండి. మీ కుటుంబీకులతో కూడా గడపడానికి ప్రయత్నించండి. 


వృషభం (Tarus) –  కుటుంబ పరమైన ఒత్తిళ్ల కారణంగా.. మీలో ఉండే ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండవు. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. మీరు సెన్సిటివ్‌గా ఉండడం వల్ల.. మీలో ఉన్న ఎమోషన్స్ ఇంకా హద్దులు దాటే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తపడండి.


మిథునం (Gemini) –  మీకున్న ఐడియాలను వీలైనంత త్వరగా అమల్లో పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అన్నీ ఒకేసారి అమలు చేయాలని అనుకోకండి. దాని బదులు ఒకసారి ఒకే పనిపై ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి. కొన్ని మానసిక ఇబ్బందుల వల్ల.. ఈ రోజు కాస్త ఒత్తిడిగా అనిపించినా రోజు సరదాగానే గడుస్తుంది.


కర్కాటకం (Cancer) –  మీరు నిద్ర లేచేసరికి కాస్త చిరాగ్గా అనిపించవచ్చు. రోజుని మరింత బాగా గడిపేందుకు ప్రయత్నించండి. ఆఫీసులో కష్టపడడంతో పాటు ఫిట్‌నెస్ పై కూడా కాస్త దృష్టి సారించండి. మీ భాగస్వామి కూడా మీకు సహకరిస్తారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించండి.


సింహం (Leo) –  పుస్తకాలు, సంగీతం, మీరు ప్రేమించిన వ్యక్తుల సాన్నిహిత్యంలో ఈ రోజు చాలా చక్కగా గడుస్తుంది. అయితే మీ చుట్టూ ఉన్నవారు కాస్త డల్‌గా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం అయ్యే సరికి అన్నీ సర్దుకుని వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ స్నేహితులతో సాయంత్రం సరదాగా గడుపుతారు.


క‌న్య (Virgo) –  మీ కుటుంబ సభ్యులతో గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పటికీ చర్చించడం లేదా వాటిని మనసులో పెట్టుకోవడం సరైంది కాదు. వాటిని వదిలేయాల్సిన సమయం ఇది. వాటి గురించి చర్చించడం లేదా ఆలోచించడం వల్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయే తప్ప ఉపయోగం ఉండదు.


తుల (Libra) – మీకు ఏం కావాలో, మీ మనసు ఏం కోరుకుంటోందో మీ చుట్టూ ఉన్నవారికి స్పష్టంగా చెప్పండి. మీ మనసులో ఉన్న విషయాలను వీలైనంత త్వరగా బయటకు వ్యక్తం చేయండి. మీరు బాగా ప్రేమించే వ్యక్తితో సాయంత్రం సమయం సరదాగా గడుపుతారు. అర్థం కాక ముందే పరిస్థితులు లేదా సందర్భాల గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి.


వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీ షెడ్యూల్ చాలా బిజీగా గడుస్తుంది. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటూ; కుటుంబపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ రోజుని గడపాల్సి ఉంటుంది. వీటన్నింటితో పాటు పెండింగ్‌లో ఉన్న పనిని కూడా మీరు ఈ రోజే పూర్తి చేయాల్సి ఉంటుంది. రోజంతా బిజీగా గడిచిన తర్వాత రాత్రి సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరని మర్చిపోవద్దు.


ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు మీరు వీలైనంత బాగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న భావోద్వేగాలను అణగదొక్కుకుంటూ.. మిమ్మల్ని మీరు బాధించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వీలైనంత స్పష్టంగా వాటిని ఇతరులతో పంచుకోండి.


మకరం (Capricorn) –  ఈ రోజు మీరు ప్రేమించే వ్యక్తితో ఇంటి వద్ద ఉండి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. అలాగే నిద్రపోతూ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ స్నేహితులు, బంధువులతో సమయం గడుపుతారు. 


కుంభం (Aquarius) –  ఈ రోజు చాలా బ్రహ్మాండంగా గడుస్తుంది. కాసేపు ఒంటరిగా, ఇంకాసేపు కుటుంబ సభ్యులతో, మరికాసేపు స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు. ముఖ్యంగా మీరు ప్రేమించినవారితో సమయం గడపడమే కాదు.. జీవితంపై ఓ అవగాహన కూడా ఏర్పరచుకుంటారు.


మీనం (Pisces) –  ఈ రోజు కొన్ని అవాంతరాలు ఎదురైనా... మీరు కోరుకున్న పనులు తప్పకుండా జరిగి తీరుతాయి. మీరు మీకు నచ్చిన పనులు చేస్తూ.. విశ్రాంతి తీసుకుంటూ సమయం గడుపుతారు. సాయంత్రం సమయంలో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. కానీ ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించండి.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ష్య సాధనకు కృషి చేయండి


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?