ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ ఆర్థిక సమస్యలను అధిగమించండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ ఆర్థిక సమస్యలను అధిగమించండి..!

ఈ రోజు (జూన్ 11) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు మీరు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. మీరు ఇతరుల భాగస్వామ్యంతో చేసే పని  ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. అలాగే ఆఫీసులో చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు. పెరిగే ధరలు కూడా మీ ఆర్థిక స్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చే అవకాశాలున్నాయి. అయితే ఆగిపోయిన కొన్ని క్రియేటివ్ పనులను.. మీరు మళ్లీ పూర్తి చేస్తారు. అలాగే తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి.


వృషభం (Tarus) – ఈ రోజు మీకు చాలా బాగా గడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు ఈ రోజు చక్కబడతాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది. మీలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. క్రియేటివ్ వర్క్ చేసేవారిలో ఆసక్తి పెరుగుతుంది. కొందరికి మాత్రం ఉద్యోగం మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజినెస్‌కి సంబంధించి చేసే ప్రయాణాలు తప్పకుండా మీకు లాభాన్నిస్తాయి.


మిథునం (Gemini) – ఈ రోజు ప్రేమికుల్లో ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు తీసుకునే కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా స్నేహం ముసుగు కప్పుకున్న మీ శత్రువులను వీలైనంత త్వరగా గుర్తించండి. లేదంటే ఈ సమస్యలు మరింత పెరిగిపోవడమే కాదు.. మిమ్మల్ని అనేక ఇబ్బందులకు సైతం గురిచేస్తాయి. అయితే ఈ విషయాల్లో ఇతరులను నిందించకండి. ఆఫీసులో మీ పై అధికారులతో కాస్త మనస్పర్థలు రావచ్చు. కానీ క్రమంగా అవి సర్దుకుంటాయి.


కర్కాటకం (Cancer) – మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ తల్లిదండ్రులతో గడపడానికి ప్రయత్నించండి.  కొన్ని సందర్భాలలో మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని మరీ పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి.. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడానికి అనువైన సమయం. 


సింహం (Leo) –  ఈ రోజు  మీకున్న మంచి ఆలోచనలను అమలుపరచడంలో తప్పక విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలను ఆర్జిస్తారు. అంతేకాదు.. కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటారు. మీ క్రియేటివ్ వర్క్ చాలా చక్కగా ముందుకు సాగుతుంది. ఆఫీసులో పని వాతావరణం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లోనూ మీ భాగస్వామి పూర్తి సహకారం మీకు అందుతుంది.


క‌న్య (Virgo) – మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  ఇటువంటి విషయాలలో మీరు పాజిటివ్‌గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే కుటుంబ వాతావరణం కూడా  ఆహ్లాదకరంగా మారుతుంది. బిజినెస్‌లో కొత్తగా ఏర్పరుచుకునే బంధాలు.. మీ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలుస్తాయి. అలాగే ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభం కావడమే కాదు.. సత్వరమే పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 


తుల (Libra) – ఆఫీసులో మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఈ రోజు కాస్త పెరుగుతాయి. ఫలితంగా మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు. అలాగే విద్యార్థులు కూడా తమ కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కాస్త నిరుత్సాహపడతారు. ఇలాంటి సమయాల్లోనే మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నెగటివ్ ఆలోచనలను కట్టడి చేయాలి. 


వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీ స్నేహితుల నుంచి మీరు ఖరీదైన బహుమతులు అందుకుంటారు. ఇక మీ ఉద్యోగ జీవితం కూడా సాఫీగా సాగుతుంది. మీరు ప్రమోషన్లు కూడా అందుకొనే అవకాశం ఉంది. మీరు సంతకం చేసే కొత్త కాంట్రాక్ట్స్ మీకు లాభాలను చేకూరుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించే నిమిత్తం.. మీరు ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. 


ధనుస్సు (Saggitarius) – ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వారు.. మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్దకాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇక ఉద్యోగస్థులకు ఇది సమస్యల కాలం. మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భావిస్తున్న కొందరి ఎత్తుగడలను పసిగట్టి.. వివేకంతో వ్యవహరించాలి. 


మకరం (Capricorn) – మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. రక్తపోటు, ఆయాసం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.  అలాగే మీరు జరిపే లావాదేవీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. లేదంటే అనుకోకుండా కొన్ని లాభాలు పొందినట్లే.. నష్టాలను కూడా చవిచూడాల్సి ఉంటుంది. ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.  మీ స్నేహితులకు మీ సపోర్ట్ అందించండి. అలాగే అనుకున్న సమయానికి పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.


కుంభం (Aquarius) – మీరు మీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో తప్పకుండా సఫలత సాధిస్తారు. అలాగే కొన్ని పాత బంధాలను పునరుద్ధరించుకోవాలని భావిస్తారు. అలాగే మీ భాగస్వామికి ఎమోషనల్‌గా మీ సపోర్ట్ అందించి.. వారికి అండగా నిలవడానికి ప్రయత్నించండి. బిజినెస్ కాంట్రాక్ట్స్  విషయంలోనూ మీరు ఈ రోజు  మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులను  సైతం మీరు తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.


మీనం (Pisces) – సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో పనిచేసేవారికి ఇది చాలా మంచి రోజు. ఈ రంగంలోని వారు లక్ష్యాలను సాధించడంలో సునాయాసంగా విజయం సాధిస్తారు. ఆఫీసులో  పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి.  అయితే ఖర్చుల విషయంలో మాత్రం ముందునుంచే జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు కూడా ఇది అనువైన కాలం. 


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ అదృష్ట రేఖను అనుసరించండి


ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?