నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమనానికి బాటలు వేసుకోండి.. !

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమనానికి బాటలు వేసుకోండి.. !

ఈ రోజు (జూన్ 14) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీరు కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్న కారణంగా.. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని సపోర్ట్ చేయడమే కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలను కూడా సమర్థిస్తారు. ఈ క్రమంలో మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. చాలా రోజుల తర్వాత మీరు మీ చిన్ననాటి స్నేహితులను లేదా పాత మిత్రులను కలిసే సూచనలున్నాయి.

వృషభం (Tarus) – మీరు తీసుకునే నిర్ణయాలపై ఇతరుల ప్రభావం పడనీయకండి. ఈ విషయంలో మీ మనసు చెప్పే మాటకే ప్రాధాన్యం ఇవ్వండి. అదేవిధంగా, మీ కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపండి. మీ మనసుకు సంతోషం కలిగించే పని చేయండి.

మిథునం (Gemini) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయోజనకరంగానూ ఉంటుంది. అయితే ఇతరులపై ఆధారపడకుండా వీలైనంత స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. అధిక పనిభారం వల్ల మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయంపై ప్రభావం పడవచ్చు. ఈ క్రమంలో కొద్ది సమయం ఒంటరిగా గడపడానికి ప్రయత్నించండి.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు మానసికంగా, ఎమోషనల్‌గా చాలా డల్‌గా ఉంటారు. కాబట్టి ఈ రోజు చాలా నిదానంగా గడుస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే వారు మీతో గొడవపడే అవకాశాలున్నాయి. గతాన్ని పూర్తిగా విడిచిపెట్టేయండి. అలాగే వర్తమానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.

సింహం (Leo) – ఆఫీసులో ఇతరులు మధ్యలో విడిచిపెట్టిన పనులను మీరు గుర్తించాల్సి రావచ్చు. ఇది మీకు అదనపు బాధ్యతే అయినప్పటికీ.. దానిని మీరు చక్కగా పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తి సహకారం అందిస్తారు. అధిక సమయం పనిలో గడపడం వల్ల.. ఒంటరిగా కాసేపు గడపాలని మీరు భావించవచ్చు. అలాగే ఈ రోజు మీ పాత మిత్రులను కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. 

క‌న్య (Virgo) – మీ చుట్టూ ఉన్నవారు మీకు సపోర్ట్ చేస్తూ, మీ నిర్ణయాలను సమర్థించడం వల్ల పనిలో వేగం పుంజుకుంటుంది. ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న ఒక ముఖ్యమైన సమావేశం ఆలస్యంగా మొదలుకావచ్చు లేదా పూర్తిగా క్యాన్సిల్ కావచ్చు. దేనికైనా మీరు సిద్ధంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులు కూడా కొన్ని విషయాల్లో సలహా కోసం మిమ్మల్నే సంప్రదించవచ్చు. 

తుల (Libra) – మీరు పనిలో ఈ రోజు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే చేయాల్సిన పనులూ చాలా ఉండచ్చు. అలాగే సహచరుల నుండి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు సహనంతో వ్యవహరించండి. మీరు ప్రేమించే వ్యక్తులతో సమయం గడపడం ద్వారా మీ బాధలను మరిచిపోవడానికి ప్రయత్నించండి. పని ఒత్తిడిని ఇంటికి మోసుకెళ్లకండి.

వృశ్చికం (Scorpio) – మీరు పనిలో ముందుకు వెళ్లాలని భావించినా.. పెండింగ్‌లో ఉన్న పనిని ముందుగా పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలో కొత్త వ్యక్తులతో కలసి పని చేయాల్సి రావచ్చు. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ జీవితం కూడా సాఫీగా ముందుకు సాగుతుంది. అయితే మీ స్నేహితుల్లో ఒకరు ఎమోషనల్‌గా మీ సహాయం కోరి వస్తారు.

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేస్తారు. కొత్త ఐడియాలు, కొత్త ప్రాజెక్టులు.. ఇలా అంతా కొత్తగానే ముందుకు సాగుతాయి. మీరు గతంలో చేసిన పనికి కూడా ఇప్పుడు గుర్తింపు పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో సహనంగా వ్యవహరించండి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లకండి. ఈ రోజు ఎక్కడికెళ్లినా మీరే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.

మకరం (Capricorn) – ఆఫీసులో ఇతరులకు ఏమి అవసరమో గుర్తించడానికి ప్రయత్నించండి. వర్తమానాన్ని, గతానికి లింక్ చేసి చూడకండి. పనిలో అధిక సమయం గడపడం వల్ల కుటుంబ సమయంపై ప్రభావం పడుతుంది. అలాగే ఈ రోజు మీ పాత స్నేహితులు ఒకరు మిమ్మల్ని సహాయం కోరేందుకు కలవచ్చు.

కుంభం (Aquarius) – ఆఫీసులో ఇతరులతో ఉన్న చిన్న చిన్న గొడవల కారణంగా మీరు ఈ రోజు చేసే పనిని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అవసరమైతే ఎదుటివారిని క్షమించండి. ఇతరులపై ఆధారపడడం కంటే మీరే ఛార్జ్ తీసుకొని పనులను చక్కబెట్టుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు.

మీనం (Pisces) – ఇతరులు ఏం చెబుతున్నారో ఏకాగ్రతతో వినడానికి ప్రయత్నించండి. ఏ విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోకండి. మరింత ఎక్కువ ఫోకస్‌తో ఏ పనినైనా చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?