ADVERTISEMENT
home / Diet
జీలకర్ర తింటే చాలు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే.. 

జీలకర్ర తింటే చాలు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే.. 

జీలకర్ర (Cumin).. ఇది లేని ఇల్లు ఉండదేమో.. కూరల్లో రుచి పెంచడానికి వేసే మసాలా దినుసుల్లో ఇది ముఖ్యమైనది. అయితే కేవలం వంట కి మాత్రమే కాదు.. రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని (Health) పెంపొందించడంలోనూ జీలకర్ర ముందుటుంది. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనల్ని ఎన్నో సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. జీలకర్ర వేసిన నీళ్లు (జీరా పానీ లేదా జల్ జీరా ) తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Also Read మెంతుల వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు (Benefits Of Fenugreek Seeds For Hair)

jeera %282%29

1. బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు చక్కటి మార్గంగా జీలకర్ర ఉపయోగపడుతుంది. సాధారణంగా వ్యాయామం చేస్తే తగ్గే కొవ్వు కంటే జీలకర్రని రోజూ ఒక టీ స్పూన్ నీళ్లలో వేసి ఉపయోగించడం వల్ల కరిగే కొవ్వు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. జీలకర్ర బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎన్నో పరిశోధనలు కూడా తేల్చి చెప్పాయి. ఇది ఎక్స్ ట్రా క్యాలరీలను కరిగించడంతో పాటు జీర్ణ క్రియను సజావుగా సాగేలా చేస్తూ మెటబాలిజాన్ని పెంచుతుంది.

2. ప్రసవం తర్వాత..

గర్భం ధరించినప్పుడు, ఆ తర్వాత జీలకర్రను, జీలకర్ర వేసిన నీటిని ఎక్కువగా తీసుకోవాలని మన అమ్మమ్మలు, నానమ్మలు చెబుతుండడం మనం వింటూనే ఉంటాం. గర్భం ధరించినప్పుడు పొట్టలో సమస్యలు రాకుండా చూడడంతో పాటు ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వాటితో పాటు ప్రసవం తర్వాత పాలు తక్కువగా వచ్చేవారికి ఇది మంచి చిట్కా. జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

3. జ్వరం తగ్గుతుంది.

ఒకవేళ మీకు బాగా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఉంటే జీలకర్ర వేసిన నీటిని (జీరా పానీ) తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో వేడి బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.

Also Read: తులసి ప్రయోజనాలు (Benefits Of Basil(Tulsi) Leaves)

jeera %281%29

4. అందాన్ని పెంచుతుంది.

జీలకర్ర కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచేందుకు కూడా తోడ్పడుతుంది. రోజూ ఉదయాన్నే పరిగడుపున జీలకర్ర నీళ్లు (జీరా పానీ లేదా జల్ జీరా) తాగడం, వాటితో ముఖం కడుక్కోవడం చేస్తుంటే మీ చర్మం ప్రకాశవంతంగా మారడం మాత్రమే కాదు.. మొటిమల సమస్య కూడా ఎప్పటికీ మీ దరిచేరదు.

5. డయాబెటిస్ ని తగ్గిస్తుంది.

డయాబెటిస్ సమస్య ఉన్నవారు రోజూ తప్పక జీలకర్రను వంటల్లో ఉపయోగించడంతో పాటు జీరా పానీ లేదా జల్ జీరా తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెరలను బ్యాలన్స్ చేస్తుంది. దీనివల్ల మీ డయాబెటిస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. రోజూ పరగడుపున జీలకర్ర నీళ్లు తీసుకోవడం మర్చిపోకుండా చేయడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. 

ADVERTISEMENT

6. ఎసిడిటీ తగ్గుతుంది.

జీలకర్రలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వంటివి ఉంటాయని తెలుసుకున్నాం కదా.. అవి మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మీకు గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తగ్గించడంలో జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది.

Also Read: అవిసె గింజలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య (Benefits Of Flax Seeds For Body)

 

jeera %283%29

7. రుతుక్రమం సరయ్యేలా..

రోజూ ఉదయాన్నే జీలకర్ర, బెల్లం కలిపి నీటిలో వేసి ఆ నీటిని తాగితే మన శరీరంలో హార్మన్లన్నీ బ్యాలన్స్ అవుతాయట. పిరియడ్స్ కూడా రెగ్యులర్ గా సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు. రుతుక్రమం సమయంలో కడుపు నొప్పితో బాధపడే మహిళలకు కూడా ఇది చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

జీలకర్ర నీటిని ఎలా తయారుచేయాలంటే..

ఈ సమస్యలన్నింటికీ జీలకర్ర కంటే జీలకర్ర నానబెట్టిన నీళ్లు బాగా ఉపయోగపడతాయి. జీరా పానీ చేయడానికి ముందు రోజు రాత్రి రెండు టీస్పూన్ల జీలకర్రను గ్లాసు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఉదయాన్నే దాన్ని మరగబెట్టి వడకట్టి పెట్టుకోవాలి. అంతే జీరా పానీ లేదా జల్ జీరా సిద్ధం. దీన్ని పరిగడుపున తాగితే మంచి ఫలితాలుంటాయి.

ఇవి కూడా చదవండి.

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

పిరియడ్స్ సమయంలో.. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ నుంచి ఏం ఆశిస్తారంటే..?

ADVERTISEMENT

వేసవి సంజీవని కొబ్బరి నీళ్లు.. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు..!

27 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT